amp pages | Sakshi

పచ్చ .. రచ్చ

Published on Sun, 04/26/2015 - 05:28

పార్టీ పదవుల కోసం తెలుగు త మ్ముళ్ల తగవులాట
పరస్పరం చెప్పులు, కుర్చీలు విసురుకున్న నేతలు
రసాభాసగా సాగిన పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశం

 
గుంతకల్లు టౌన్ : గుంతకల్లు పట్టణ తెలుగుదేశం పార్టీ లో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ పట్టణ అధ్యక్ష పదవి కోసం టీడీపీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయాయి. అధ్యక్ష పదవి మాకివ్వాలంటే.. లేదు మా వర్గీయులకివ్వాలంటూ మార్కెట్‌యార్డు ఛైర్మన్ బండారు ఆనంద్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్త కోడెల చంద్రశేఖర్‌లు బాహా బాహీకి దిగారు. నీ అంతు చూస్తానంటే..నీ అంతుచూస్తానని మీడియా ముందే దుర్భాషలాడుకున్నారు. పరస్పరం చెప్పులు, కుర్చీలు విసురుకున్నారు. పరిటాల కళ్యాణ మండపంలో శని వారం ఏర్పాటైన సమావేశ ప్రాంగణాన్ని రణరంగంగా మార్చారు. ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఇరువర్గాలను మందలించి పరిస్థితిని చక్కదిద్దారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపచేశారు.  

గుంతకల్లు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకై ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పార్టీ అధిష్టానం నుంచి ఎన్నికల పరిశీలకుడిగా బాలాజీనాయుడు విచ్చేశారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై వారిరువురు పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు. మూడు మండలాలకు చెందిన నేతలు వేర్వేరుగా భేటి అయి ఏకాభిప్రాయంతో పార్టీ కోసం పనిచేసే వారిని పట్టణ, మండల అధ్యక్షులుగా ఎన్నుకోవాలని వారు ఆదేశించారు.

సమావేశం ముగిసిన అరగంటకే గుంతకల్లు పట్టణ కమిటీ ఎన్నిక విషయంలో చిన్నపాటి గొడవ మొదలైంది. మార్కెట్‌యార్డు ఛైర్మన్‌గా కొనసాగుతున్న బండారు ఆనంద్ పేరును పలువురు కౌన్సిలర్ ప్రతిపాదించారు. అంతలోపే మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్త, మాజీ కౌన్సిలర్ కోడెల చంద్ర పట్టణ అధ్యక్ష పదవిని ప్రస్తుతానికి పక్కనబెట్టి, తొలుత కార్యవర్గసభ్యులను ఎన్నుకోవాలని సూచించాడు. అంతలోపే కోపోద్రిక్తుడైన ఆనంద్ అతనిపై చేయి చేసుకునేందుకు యత్నించాడు.

ఈ క్రమంలో ఆనంద్, చంద్రలు పార్టీ పరిశీలకుల సమక్షంలో పరస్పరం అసభ్యపదజాలాలతో దూషించుకున్నారు. ఒకరిపైకి ఒకరు చెప్పులు విసురుకున్నారు. అక్కడికి ఆగకుండా ఇద్దరు నేతల వర్గీయులు మందీమార్భలను రప్పించుకుని ఘర్షణ పడాలని చూశారు. విషయం తెలుసుకున్న ఛైర్‌పర్సన్ కోడెల అపర్ణ కూడా బండారు ఆనంద్ వర్గీయులపై నిప్పులు చెరిగారు. దమ్ముంటే బయటికి రావాలని సవాలు విసిరారు.

దీంతో పరిటాల కళ్యాణ మండపం పరిసరాల్లో ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఇరువర్గాలపై సీరియస్ అయ్యారు. వ్యక్తిగత ద్వేషాలతో పార్టీ పరువును తీయడం మంచిదికాదని, గ్రూపు రాజకీయాలు, వర్గ విభేధాలకు దిగితే సహించేది లేదని మందలించారు. సమాచారం అందుకున్న అర్బన్ సిఐ ప్రసాద్ కళ్యాణ మండపం వద్దకు చేరుకుని ఇరువర్గాలను శాంతింప చేశారు. ఏదిఏమైనప్పటికీ గతంలో మాదిరిగానే టిడిపిలో తిరిగి వర్గవిభేధాలు వీధినపడ్డాయి.

వ్యక్తిగత కక్షలే గొడవలకు కారణమా?

ఒకే సామాజిక వర్గానికి చెందిన బండారు ఆనంద్, కోడెల చంద్రల మధ్యన ఉన్న వ్యక్తిగత కక్షలే ఈ గొడవకు దారి తీశాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. గత నాలుగు రోజుల క్రితం పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడి ఎన్నిక విషయమై ఆ పార్టీ కౌన్సిలర్ల సమావేశం జరిగింది. ఆ సమయంలో మెజార్టీ కౌన్సిలర్‌లు మార్కెట్‌యార్డు ఛైర్మన్‌గా కొనసాగుతున్న బండారు ఆనంద్‌కే తిరిగి పట్టణ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పారు.

ఆ సమయంలో కోడెల చంద్ర, మరి కొందరు కౌన్సిలర్లు కృపాకర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి తోడు మున్సిపాలిటిలో ఆనంద్ వర్గీయులకి చెందిన కాంట్రాక్టర్‌ల బిల్లులను అధికారులపై ఒత్తిడి తెచ్చి బిల్లులను నిలబెట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్యలో రాజుకున్న చిన్నపాటి వివాదమే ఈ ఘర్షణకి దారి తీసిందని పార్టీ కార్యకర్తలు బహిరంగంగా చర్చించుకున్నారు.  
 
 25జిటిఎల్301-19040017: సమావేశంలో పరస్పరం దాడికి పాల్పడుతున్న తమ్ముళ్లు
 25జిటిఎల్301ఎ-19040017: తమ్ముళ్ల ఘర్షణలో విరిగిన కుర్చీలు
 25జిటిఎల్301బి-19040017: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మార్కెట్‌యార్డు ఛైర్మన్ బండారు ఆనంద్, వర్గీయులు
 25జిటిఎల్301సి-19040017: ప్రత్యర్థి వర్గీయులను దూషిస్తున్న ఛైర్‌పర్సన్ అపర్ణ, భర్త చంద్రలు
 25జిటిఎల్301డి-19040017: ఇరువురిని మందలిస్తున్న ఎమ్మెల్యే జితేంద్రగౌడ్
 25జిటిఎల్301ఇ-19040017: ఛైర్‌పర్సన్ అపర్ణ ఇంటి వద్ద భద్రత చర్యలు చేపట్టిన చర్యలు
 
ఇరువర్గాలను మందలించి పరిస్థితిని చక్కదిద్దారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపచేశారు. గుంతకల్లు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకై ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పార్టీ అధిష్టానం నుంచి ఎన్నికల పరిశీలకుడిగా బాలాజీనాయుడు విచ్చేశారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై వారిరువురు పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు.

మూడు మండలాలకు చెందిన నేతలు వేర్వేరుగా భేటి అయి ఏకాభిప్రాయంతో పార్టీ కోసం పనిచేసే వారిని పట్టణ, మండల అధ్యక్షులుగా ఎన్నుకోవాలని వారు ఆదేశించారు. సమావేశం ముగిసిన అరగంటకే గుంతకల్లు పట్టణ కమిటీ ఎన్నిక విషయంలో చిన్నపాటి గొడవ మొదలైంది. మార్కెట్‌యార్డు ఛైర్మన్‌గా కొనసాగుతున్న బండారు ఆనంద్ పేరును పలువురు కౌన్సిలర్ ప్రతిపాదించారు. అంతలోపే మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్త, మాజీ కౌన్సిలర్ కోడెల చంద్ర పట్టణ అధ్యక్ష పదవిని ప్రస్తుతానికి పక్కనబెట్టి, తొలుత కార్యవర్గసభ్యులను ఎన్నుకోవాలని సూచించాడు. అంతలోపే కోపోద్రిక్తుడైన ఆనంద్ అతనిపై చేయి చేసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆనంద్, చంద్రలు పార్టీ పరిశీలకుల సమక్షంలో పరస్పరం అసభ్యపదజాలాలతో దూషించుకున్నారు.

ఒకరిపైకి ఒకరు చెప్పులు విసురుకున్నారు. అక్కడికి ఆగకుండా ఇద్దరు నేతల వర్గీయులు మందీమార్భలను రప్పించుకుని ఘర్షణ పడాలని చూశారు. విషయం తెలుసుకున్న ఛైర్‌పర్సన్ కోడెల అపర్ణ కూడా బండారు ఆనంద్ వర్గీయులపై నిప్పులు చెరిగారు. దమ్ముంటే బయటికి రావాలని సవాలు విసిరారు. దీంతో పరిటాల కళ్యాణ మండపం పరిసరాల్లో ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఇరువర్గాలపై సీరియస్ అయ్యారు.

వ్యక్తిగత ద్వేషాలతో పార్టీ పరువును తీయడం మంచిదికాదని, గ్రూపు రాజకీయాలు, వర్గ విభేధాలకు దిగితే సహించేది లేదని మందలించారు. సమాచారం అందుకున్న అర్బన్ సిఐ ప్రసాద్ కళ్యాణ మండపం వద్దకు చేరుకుని ఇరువర్గాలను శాంతింప చేశారు. ఏదిఏమైనప్పటికీ గతంలో మాదిరిగానే టిడిపిలో తిరిగి వర్గవిభేధాలు వీధినపడ్డాయి.

 వ్యక్తిగత కక్షలే గొడవలకు కారణమా?

ఒకే సామాజిక వర్గానికి చెందిన బండారు ఆనంద్, కోడెల చంద్రల మధ్యన ఉన్న వ్యక్తిగత కక్షలే ఈ గొడవకు దారి తీశాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. గత నాలుగు రోజుల క్రితం పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడి ఎన్నిక విషయమై ఆ పార్టీ కౌన్సిలర్ల సమావేశం జరిగింది. ఆ సమయంలో మెజార్టీ కౌన్సిలర్‌లు మార్కెట్‌యార్డు ఛైర్మన్‌గా కొనసాగుతున్న బండారు ఆనంద్‌కే తిరిగి పట్టణ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పారు.

ఆ సమయంలో కోడెల చంద్ర, మరి కొందరు కౌన్సిలర్లు కృపాకర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి తోడు మున్సిపాలిటిలో ఆనంద్ వర్గీయులకి చెందిన కాంట్రాక్టర్‌ల బిల్లులను అధికారులపై ఒత్తిడి తెచ్చి బిల్లులను నిలబెట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్యలో రాజుకున్న చిన్నపాటి వివాదమే ఈ ఘర్షణకి దారి తీసిందని పార్టీ కార్యకర్తలు బహిరంగంగా చర్చించుకున్నారు.

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)