amp pages | Sakshi

‘ఎర్ర’ స్మగ్లర్లపై టాస్క్‌ఫోర్స్ ఉక్కు పిడికిలి

Published on Sun, 04/26/2015 - 02:02

- 181 మంది స్మగ్లర్లపై సస్పెక్ట్ షీట్స్
- మరో పది మందిపై పీడీ యాక్ట్
- టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో  నిరంతర నిఘా
- వారానికొకమారు పోలీసు కౌన్సెలింగ్
- ‘సాక్షి’తో చిత్తూరు టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ రత్న
సాక్షి,చిత్తూరు:
ఎర్రచందనం స్మగ్లర్లపై టాస్క్‌ఫోర్స్ ఉక్కు పిడికిలి బిగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 181 మంది ఎర్రస్మగ్లర్లపై  టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణలో సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తోంది. కొత్తగా  మరో పది మంది స్మగ్లర్లపై పీడీ యాక్టు కేసులు సైతం నమోదు చేస్తోంది.  ఈ విషయాలను ఏఎస్పీ టాస్క్‌ఫోర్స్ రత్న శనివారం ‘సాక్షి’కి వెల్లడించారు. ఇప్పటివరకూ పది చందనం స్మగ్లింగ్ గ్యాంగ్‌లపై  సస్పెక్ట్ షీట్స్ నమోదు చేసినట్లు చెప్పారు.  

ఇందులో ఆయా గ్యాంగుల్లోని లీడర్లతోపాటు వారి అనుయాయులు,ఎస్కార్ట్, వాహనాలు సమకూర్చినవారు, నడిపేవారు తదితరులు ఉన్నారన్నారు. ఒక్కొక్క గ్యాంగ్‌లో ఆరు నుంచి 24 మంది వరకూ ఉన్నారని  ఏఎస్పీ చెప్పారు. ఇప్పటివరకూ 181 మంది పైనే షీట్లు ఓపన్ చేసినా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. జాబితాలోనివారిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. వారానికొకమారు  పోలీసు స్టేషన్‌కు పిలిపించి  కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. వారు తిరిగి స్మగ్లింగ్‌కు పాల్పడితే  కేసులు నమోదు చేయడంతో పాటు సస్పెక్ట్ షీట్‌లో ఆ వివరాలు నమోదు చేస్తామన్నారు.

దీన్నిబట్టి పోలీసులు  రౌడీషీట్లు సైతం నమోదు చేసే అవకాశం ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. ఐదుకు మించి  కేసులు నమోదైతే పీడీయాక్టు  నమోదు చేస్తామన్నారు. ఇప్పటివరకూ 35 పీడీ యాక్టు కేసులు నమోదు చేసినట్లు ఆమె చెప్పారు. వారిలో 15 మంది వరకూ బెయిల్‌ పై బయట ఉన్నారన్నారు. వారిపై కూడా నిరంతరం నిఘా ఉంటుందన్నారు. తిరిగి స్మగ్లింగ్‌కు పాల్పడితే  మరో మారు పీడీ పీడీయాక్టు కేసులు సమోదు చేసేందుకు వెనుకాడబోమన్నారు. కొత్తగా మరో పదిమంది స్మగ్లర్లపై  పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తున్నామన్నారు. వీరిలో చిత్తూరు,తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారన్నారు. చందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్న ఇంటి దొంగలపై  చర్యలుంటాయని ఏఎస్పీ తెలిపారు.

ఇందుకోసం ఉన్నతాధికారులు మార్గదర్శకాలు రూపొందిస్తున్నారన్నారు. త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయని  ఏఎస్పీ స్పష్టం చేశారు. చందనం స్మగ్లింగ్‌కు సంబంధించి ఇప్పటివరకూ 336 కేసులు నమోదు చేశామన్నారు. దాదాపు రెండు వేల మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. చిత్తూరు పరిధిలోని కేసులకు సంబంధించి మరో 400 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. వీరితో పాటు  మరో పది మంది అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. వీరిలో తమిళనాడు,కర్ణాటక వారు మాత్రమే ఉన్నట్లు ఆమె చెప్పారు.

అంతర్రాష్ట్ర స్మగ్లర్ల జాబితా కూడా ఉందన్నారు. ఇందులో మన రాష్ట్రానికి  చెందిన స్మగ్లర్లు ఉన్నట్లు ఏఎస్పీ చెప్పారు. సౌందర్‌రాజన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని  విషయాలు బయటపడే అవకాశం ఉందన్నారు. కొత్త స్మగ్లర్ల  జాబితా తెలిసే అవకాశం ఉందన్నారు. కస్టడీ కోసం కోర్టుకు విన్నవించినట్లు ఆమె చెప్పారు. చందనం స్మగ్లింగ్‌కు అడ్డు కట్ట వేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు  ఏఎస్పీ తెలిపారు.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)