amp pages | Sakshi

మరిన్ని విజయాలు సాధించాలి

Published on Fri, 05/29/2015 - 03:21

రెడ్‌శాండల్స్ యాంటీ స్మగ్లింగ్ సెల్ టాస్క్‌ఫోర్స్‌కు ఎస్పీ అభినందన
 
 కడప అర్బన్ : రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముగ్గురు ఎర్రచందనం స్మగర్లు బొడ్డె వెంకట రమణ, ముఖేష్ బదానియా, మణి అన్నన్‌లను అరెస్టు చేసిన పోలీసు అధికారులను ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ప్రత్యేకంగా అభినందించారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో రెడ్‌శాండల్స్ యాంటీ స్మగ్లింగ్‌సెల్ టాస్క్‌ఫోర్స్ పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ధైర్య సాహసాలతో స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకభూమిక పోషించిన సిబ్బందిని పేరుపేరున అభినందించారు.

భారీగా నగదు రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో టాస్క్‌ఫోర్స్ పోలీసు అధికారులు, సిబ్బంది మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన నలుగురు డీఎస్పీలకు డీజీపీ కమాండేషన్ లెటర్ కోసం ఎస్పీ సిఫార్సు చేశారు. అలాగే నలుగురు ఇన్‌స్పెక్టర్లకు మెరిటోరియస్ సర్వీసు ఎంట్రీ ప్రకటించారు. అలాగే నగదు రివార్డులను ఎస్పీ చేతుల మీదుగా అందుకున్నారు.

 రివార్డులు అందుకున్న అధికారులు, సిబ్బంది
 ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కృషి చేసిన డీఎస్పీలు ఫ్యాక్షన్ జోన్ బి.శ్రీనివాసులు, ఎస్‌బీ డీఎస్పీ ఎం.రాజగోపాల్‌రెడ్డి, రాజంపేట డీఎస్పీ అరవిందబాబు, కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, సీఐలు బి.రాజేంద్రప్రసాద్, శ్రీరాములు, బీవీ శివారెడ్డి, వెంకటప్ప,  ఆర్‌ఐ హరికృష్ణ, ఎస్‌ఐలు ఎస్‌కే రోషన్, హేమకుమార్, శివశంకర్, రాజరాజేశ్వర్‌రెడ్డి, రమేష్‌బాబు, పెద్ద ఓబన్న, కేవీ కొండారెడ్డి, ఎ.సురేష్‌రెడ్డి, అన్సర్‌బాష, ఎస్.మహబూబ్‌బాష, నాగమురళి, ఎస్‌బీహెచ్‌సీ మనోహర్‌వర్మ, హెచ్‌సీలు శ్రీనివాసులు, నాగార్జున, కానిస్టేబుళ్లు శ్రీహరి, వెంకటేశు, ప్రసాద్‌నాయుడు, కొండయ్య, శేఖర్, శ్రీనివాసులు, ఎస్‌కే నిస్సార్‌బాష, కె.రామకృష్ణ, రాజేంద్ర, సి.చంద్రశేఖర్, చంద్రశేఖర్, బి.సురేష్, ఎ.రవిశేఖర్, ఎన్.ప్రసాద్‌బాబు, శేఖర్, హోం గార్డు ఎ.విద్యాపతి, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ సి.రామలింగ ఆచారి నగదు రివార్డులు అందుకున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌