amp pages | Sakshi

కనురెప్ప కాటేస్తోంది

Published on Sun, 10/15/2017 - 13:25

నెల్లూరు నగరంలోని కరెంట్‌ ఆఫీస్‌ సెంటర్‌. ఎనిమిదేళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి తెగబడ్డాడు. ఇదే నగరంలోని బట్టల దుకాణంలో పనిచేస్తున్న కోవూరు ప్రాంత బాలికను అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ చంపేస్తానని బెదిరించి కామవాంఛ తీర్చుకున్నాడు. నెల్లూరు రూరల్‌ మండలానికి చెందిన ఓ బాలికను గౌడ్‌ హాస్టల్‌ సెంటర్‌కు చెందిన ఖాజామస్తాన్‌ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పాడు. ఆనక లైంగిక దాడికి పాల్పడ్డాడు. పడారుపల్లి సుందరయ్య కాలనీలో కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి కన్న కూతురుపైనే అఘాయి త్యానికి ఒడిగట్టాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే.. రక్త సంబంధీకులు, సమీప బంధువులు, తెలిసిన వారి పైశాచికత్వానికి బలైపోతున్న బాలికల ఉదంతాలు అనేకం ఉంటున్నాయి. బాధితుల్లో 90 శాతం మంది 5 నుంచి 13 ఏళ్లలోపు వారు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.           

నెల్లూరు (క్రైమ్‌): పైశాచికత్వం పెరుగుతోంది. బాలికలపై లైంగిక దాడులకు కారణమవుతోంది. అయినవారూ అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఇంటాబయట భద్రత కొరవడటంతో బాలికలు బిక్కుబిక్కుమంటున్నారు. ఘోరం జరిగాక.. అగ్ని‘పరీక్ష’లు నిర్వహించి నిందితులు ఎంతటి వారైనా వదిలేదిలేదని అధికారులు, పాలకులు ప్రకటనలిస్తున్నారే తప్ప వీటి నిరోధానికి పటిష్టమైన చర్యలు చేపట్టలేకపోతున్నారు. ఆడపిల్లలపై అయినవారే అఘాయిత్యాలకు ఒడిగట్టడం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. విద్యాబుద్ధులు నేర్చుకునేం దుకు చిన్నారులను పాఠశాలలకు పంపితే.. కీచక గురువులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.

మనుమరాలి వయసున్న బాలికలపై లైంగికదాడి చేస్తున్న వృద్ధులూ లేకపోలేదు. కన్నతండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నారులను చిదిమేస్తున్న ఘటనలున్నాయి. బాలల రక్షణ కోసం పనిచేయాల్సిన చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీల ప్రతినిధులు ఘటన జరి గిన అనంతరం హడావుడి చేయడంతో సరిపెడుతున్నారు. రికార్డుల పరంగా గడచిన 10 నెలల్లో  43 కేసులు నమోదయ్యాయి. అనేకమంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురవుతున్నా పరువుపోతుం దనే ఉద్దేశ్యంతో పోలీసుల వరకు  రావడం లేదు.

పరిచయస్తులే..
చిన్నారులపై లైంగిక దాడులు అధికం కావడాన్ని జాతీయ నేర రికార్డుల బృందం తీవ్రంగా పరిగణించి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. హోం మంత్రిత్వ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సంయుక్తంగా నేరాలను విశ్లేషించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న చిన్నారుల వయస్సు 5నుంచి12 ఏళ్లలోపు ఉందని తేల్చింది. ఇందులో 30 శాతం మంది లైంగిక దాడులకు గురవుతుండగా.. 40 శాతం మందిపై లైంగిక దాడి యత్నాలు జరిగా యని వెల్లడించింది. చిన్నారులను లైంగికంగా వేధించిన వారిలో 90 శాతం మంది వారికి పరిచయస్తులేనని స్పష్టం చేసింది.

చట్టాలున్నా..
నైతిక విలువలు, కట్టుబాట్లు లేని నడవడిక.. పర్యవేక్షణ కరువైన యువత పెడదారి పడుతున్నారు. అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక పరిస్థితి విషమంగా మారుతోంది. పాఠశాలల్లోనే విద్యార్థులు మొబైల్‌లో అశ్లీల వీడియోలు చూడటం సర్వసాధారణ అంశంగా మారింది. లైంగిక దాడులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2012 నవంబర్‌ 26న ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్స్‌ (ఫోక్సో) చట్టాన్ని అమలులోకి తెచ్చింది. సాధారణ సెక్షన్ల మాదిరే ఉన్నా ఈ చట్టంలోని క్లాజ్‌లు చాలా కఠినంగా ఉంటాయి. ఈ చట్టం కింద కేసు నమోదైతే 13ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే మరింత ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉండే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు. 18 ఏళ్లలోపు బాలికలు లైంగిక వేధింపులకు గురైతే ఈ కేసులను ఫోక్సో చట్టం కింద నమోదు చేస్తారు. గడచిన ఐదేళ్లలో ఫోక్సో యాక్ట్‌ కింద జిల్లాలో సుమారు 225 కేసులు నమోదయ్యాయి.

విలువలు బోధించాలి
పిల్లలు మగవారైనా.. ఆడవారైనా చిన్నతనం నుంచీ నైతిక విలువల్ని బోధించాలి. ఏది మంచి.. ఏది చెడో తెలుసుకునేలా వారిని తీర్చిదిద్దాలి. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తప్పు లేదు. దానిని తప్పుడు పనులకు ఉపయోగించడం నేరం. చదువుకోవాల్సిన పిల్లలు నీలి చిత్రాలు చూసి పాడైపోతున్నారు. పిల్లలు అలాంటి వాటికి దూరంగా ఉండాలి.
–కె.బాలచెన్నమ్మ, ఉపాధ్యాయిని, నెల్లూరు

అప్రమత్తంగా ఉండాలి
చిన్నారులపై లైంగిక వాంఛ కలిగి ఉండటం ఒక మానసిక వ్యాధి. దీనిని ఫీడోఫీలియా అంటారు. సాధారణ వ్యాధుల్లా దీనిని గుర్తించలేం. లైంగిక సామర్థ్యంపై విశ్వాసం లేనివారు, వయసు పైబడిన వారిలో ఈ లక్షాణాలు ఉంటాయి. అలాంటి వారిని గుర్తించి ముందే కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. వారితో పిల్లలు మెలుగుతుండేప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. స్వీట్లు, చాక్లెట్లు ఇచ్చి పిల్లలను మచ్చిక చేసుకునే వారి విషయంలో జాగ్రత్త వహించాలి. వారి ప్రవర్తనను పరిశీలించి పిల్లలను ఎడ్యుకేట్‌ చేయాలి.                
 – డాక్టర్‌ శ్రీనివాసతేజ,
మానసిక వైద్య నిపుణులు, నెల్లూరు

కఠిన చర్యలు తప్పవు
చిన్నారులపై లైంగిక దాడులకు  పాల్ప డితే కఠిన చర్యలు తప్పవు. ఫోక్సా యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తున్నాం. ఈ చట్టం కింద కేసులు నమోదైతే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఆడపిల్ల లు తమను తాము కాపాడుకునేందుకు దోహదపడే ఆత్మరక్షణ విద్యలు, మెళకువలను తల్లిదండ్రులు నేర్పించాలి. ఫోక్సా చట్టంపై వారు  అవగాహన కల్గి ఉండాలి. అనుకోని ఘటన జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
– కె.శ్రీనివాసాచారి, డీఎస్పీ,
మహిళా పోలీస్‌ స్టేషన్, నెల్లూరు

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)