amp pages | Sakshi

సాగునీటి కోసం పోరుబాట

Published on Wed, 01/28/2015 - 02:29

పాలకులు, అధికార యంత్రాంగం పక్షపాతం, నిర్లక్ష్యం కారణంగా కావలి కాలువ ఆయకట్టు భూములు బీళ్లుగా మారాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పొలాలు సాగునీరందక కళ్ల ముందే ఎండిపోతుండటంతో కడుపు మండుతున్న రైతులు ఒక్కటవుతున్నారు. సాగునీటి కోసం అధికార యంత్రాంగపై సమరానికి సిద్ధమవుతున్నారు. ఒకే వేదికగా సాగునీటి ఉద్యమానికి ప్రణాళిక సిద్ధమవుతోంది.
 
కావలి :  సోమశిల జలాశయంలో పుష్కలంగా నీరున్నా.. కావలి కాలువ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయడంలో అధికారులు  మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఐఏబీ సమావేశంలో కాలువ ఆయకట్టు కింద 75 వేల ఎకరాలకు సాగునీరందిస్తామని అధికారులు, పాలకులు ప్రకటించారు. ఆ మేరకు రైతులు సాగు చేపట్టారు. తీరా ఇప్పుడు అంత ఇవ్వలేం..ఇంతవ్వలేమంటూ రైతులను నష్టాలపాల్జేసి అప్పులు ఊబిలోకి నెట్టారు.

ఇప్పటికే సుమారు 50 వేల ఎకరాలు సాగు చేయకుండా వదిలేస్తే.. మరో 40 వేల ఎకరాల్లో నాటిన నాట్లు, వెన్నుదశలోని పైరు ఎండిపోతున్నాయి. ఇప్పటి వరకు సహనంగా ఎదురు చూసిన రైతాంగం కదం తొక్కనుంది. అన్నదాత పక్షాన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి  ఆమరణ దీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే దీక్షకు రాజకీయాలకతీతంగా రైతులు, ప్రజల మద్దతు వెల్లువెత్తుతోంది. కావలి కాలువ కింద పెరిగిన సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఆధునికీకరణ జరగలేదు.

గడచిన నాలుగు సీజన్ల నుంచి ఆయకట్టు రైతులు సాగునీటికి కష్టాలు పడుతున్నారు. కావలి కాలువ సామర్థ్యం 650 క్యూసెక్కుల కాగా పూడిక పేరుకుపోవడం, నిర్వహణ లోపం తో అందులో సగభాగం నీరు కూడా కాలువలో పారడం లేదు. సంగం బ్యారేజీ నుంచి సుమారు 57 కిలోమీటర్ల పొడవున ఈ కాలువ ఉంది. 54 చెరువులు ఈ కాలువ ఆయకట్టు కింద ఉన్నాయి. కావలి కాలువ కింద కావలి పట్టణం, రూరల్, బోగోలు, దగదర్తి, జలదంకి మండలాలు ఉన్నాయి.

ప్రస్తుత రబీ సీజన్‌కు సంబంధించి నిర్వహించి ఐఏబీ సమావేశంలో కావలి కాలువ కింద 75 వేల ఎకరాలకు నీటిని ఇవ్వాలని అధికారులు, పాలకులు తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని అనుసరించి రైతులు సాగును ప్రారంభించారు. సాగు ప్రారంభించిన తర్వాత కావలి కాలువ అధికారులు ఆయకట్టు కింద ఉన్న 54 చెరువులకు, సుమారు 29 వేల ఎకరాలకు సాగునీటిని ఇవ్వలేమని చెప్పారు.

ఎందుకు అనధికారికంగా ఈ నిర్ణయం తీసుకున్నారో అంతుపట్టడం లేదు. నీటి కొరత అంటే.. అదీ లేదు. సోమశిల జలాశయంలో నీరు పుష్కలంగా ఉంది. కేవలం అధికార పార్టీ నేతల తీరు కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు తీరు కారణంగా అప్పులు చేసి సాగుచేసిన పొలాలు కళ్ల ముందు ఎండిపోతుండటంతో రైతు లు లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది.
 
ఫలించని ఎమ్మెల్యే ప్రయత్నాలు
కావలి కాలువ ఆయకట్టు రైతాంగం పడుతున్న సాగునీటి కష్టాలను తీర్చేందుకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఎక్కడని గడప.. దిగని గడప లేదన్న చందంగా ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశారు. సోమశిల విభాగంలోని అన్ని స్థాయిల ఇంజనీర్ల నుంచి కలెక్టర్ స్థాయి వరకు పలుమార్లు రైతాంగం పడుతున్న సాగునీటి వెతలు వారి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాకు చెందిన మంత్రితో పాటు ఇరిగేషన్‌శాఖ మంత్రిని కలిసినా ఫలితం లేకపోయింది. దీంతో ఉద్యమానికి సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒకటి..రెండు రోజుల్లో నిరశన దీక్షకు సంబంధించి ప్రకటన వెలువడనుంది.  
 
రైతుల కోసం నిరాహార దీక్ష :  

కావలి కాలువ కింద ప్రస్తుతం సాగులో పంటలు ఎండిపోకుండా సాగునీటిని విడుదల చేయించేందుకు నిరాహార దీక్ష చేపడుతా. ఐఏబీలో నిర్ణయించిన మేరకు ఆయకట్టు రైతాంగానికి సాగునీటిని విడుదల చేయాల్సిందే. ఇప్పటికే సాగునీటి విడదల చేయాలని అందరిని కలిసి విజ్ఞప్తి చేశా. ఇక ఓపిక లేదు.. రైతాంగం శ్రేయస్సు కోసం అధికార యంత్రాంగానికి, పాలకుల కళ్లు తెరిపించే విధంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.

కావలి కాలువ ఆయకట్టు రైతాంగం పడుతున్న సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరకాలని నిరాహార దీక్షను చేపడుతున్నాను. సంగం బ్యారేజీ ఆధునికీకరణ ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. కావలి కాలువ ఆధునికీకరణను చేపట్టాలి. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే విధంగా ఇప్పుడున్న కాలువ సామర్థాన్ని 1200 క్యూసెక్కులకు పెంచాలి.               
 - రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే
 
సాగునీరు అందివ్వడంలో నిర్లక్ష్యం:
సాగునీటిని ఇవ్వడంలో అధికారులు విఫలంకాగా, సర్కారు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. కావలి కాలువ రైతాంగం సంక్షే మం కోసం నిరాహార దీక్షను చేపట్టనున్న ప్రతాప్‌కుమార్‌రెడ్డికి రైతులందరూ సంఘీభావం ప్రకటించాలి. కావలి కాలువ రైతులు ఎంతో కాలంగా సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. సోమశిల ప్రాజెక్టులో నీరు ఉన్నా కావలి కాలువ రైతులకు సాగునీరందకపోవడం దారుణం.
 - వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే.
 
సాగునీరు అందించాలి:   
కావలికాలువ ద్వారా దామవరం మైనర్ చానల్‌కు సాగునీరు అందకపోవడంతో ఈ ఏడాది కాలువ పరిధిలో వెయ్యి ఎకరాలు పైన బీడు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కావలి కాలువ ఆధునికీకరణ చేపట్టి ఆయకట్టు పరిధిలోని భూములకు నీరివ్వాలి. - వట్టికాళ్ల తిరుపతి, రైతు, నారాయణపురం, దగదర్తి

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)