ఆ పోస్టులపై రాజకీయ పిడుగు

Published on Tue, 06/13/2017 - 05:39

‘ఇందుగలడందు లేదని సందేహం వలదు...’ అన్నట్టు అన్నింటిపైనా పాలకపక్ష నేతల కన్ను పడుతోంది. ఏ పోస్టులు వచ్చినా...  ముందుగానే ముడుపులు తీసుకుంటున్నారు. తాము చెప్పేలా నియామకాలు చేపట్టాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తీరా వారి మాట చెల్లుబాటు కాకపోయేసరికి లేనిపోని రాద్ధాంతం సృష్టిస్తున్నారు. పాలకవర్గం లేని నెల్లిమర్ల నగరపంచాయతీపైనా అదే ప్రయత్నం చేయగా... గుట్టుచప్పుడు కాకుండా గడచిన అధికారి ఔట్‌సోర్సింగ్‌ పోస్టులు భర్తీ చేసేయడంతో వాటిని రద్దు చేసి... తమవారిని వేయించుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారు. అవసరమైతే ఆ అధికారిని ఇరికించేందుకు కూడా వెనుకాడటం లేదు.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: నెల్లిమర్ల మున్సిపాల్టీలో నెల రోజుల క్రితం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకాలు జరిగాయి. ఆ సమయంలో భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో పోస్టుకు రూ. 50వేల నుంచి రూ. లక్షా 50వేల వరకు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తాన్ని తీసుకున్నదెవరో గానీ, అప్రతిష్ట మాత్రం అధికారులకే వచ్చింది. ఇదొక ఎత్తయితే... నియామకాల సమయంలో రెండు పోస్టులు మాత్రమే కొందరు నేతల సిఫార్సుల మేరకు చేశారని, మిగతావన్నీ అప్పటి అధికారి ఏకపక్షంగా వేశారని నెల్లిమర్లలో చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా స్థానిక టీడీపీ నేతల సిఫార్సుల్ని పరగణనలోకి తీసుకోకుండా అప్పటి అధికారి ఇష్టారీతిన వేశారని నెల్లిమర్ల పాలకపక్ష నేతలు భగ్గుమంటున్నారు. తాము అధికారంలో ఉండి, తమ వారిని వేసుకోకపోతే ఎలా అని, ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుని అధికారి వేసుకోవడమేంటని అధికార పార్టీ నేతలు ఒంటికాలితో లేస్తున్నారు. తాము చెప్పినా విన్పించుకోని ఆ అధికారిని ఎలాగైనా ఇరికించాలనే కసితో ఉన్నారు. వీరింతగా బాధపడటానికి కారణాలు లేకపోలేదు. ఆ పోస్టులు వేస్తామంటూ వారు ఇప్పటికే కొందరితో బేరాలు కుదుర్చేసుకున్నారు. ఇప్పుడు వ్యవహారం బెడిసికొట్టడంతో ఇరుకున పడ్డారు.

రంగంలోకి దిగిన ఓ ఎమ్మెల్యే
తమ అనుయాయులను వేసుకోలేదని ఆగ్రహంతో ఉన్న నాయకులంతా శనివారం విజయనగరంలో ఉన్న ఓ ఎమ్మెల్యే కుమారుడి ఇంటికి చేరుకుని గగ్గోలు పెట్టారు. గత అధికారి తమ మాట విన్పించుకోకుండా, బదిలీకి ముందు ఇష్టానుసారంగా వ్యవహరించారని, ఇలాగైతే తమ మనుగుడ ఎలా అని ఏకరువు పెట్టారు. సిఫార్సులు చేసిన నేతలంతా ఒక్కటై మొర పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కుమారుడు సైతం కన్నెర్రజేశారు. వెంట నే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పోస్టులు భర్తీ చేసి, బదిలీపై వెళ్లిన అధికారికి ఫోన్‌ చేసి గట్టిగా అడిగారు. ఎందుకిలా జరిగిందని, ఇష్టారీతిన పోస్టులు వేసుకోవడమేంటని, తక్షణమే వేసిన వారిని తీసేసి తాము సూచించినోళ్లను వేయాలని ఆదేశించారు.

ఆ అధికారి నిశ్చేష్టుడై ఇప్పటికే వేసేశామని, ఇంకా రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో తమకు నచ్చినవారిని వేసుకోవచ్చని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఎమ్మెల్యే... ఆయన కుమారుడు ససేమి రా అన్నట్టు తెలిసింది. తీవ్ర స్వరంతో మాట్లాడినట్టు సమాచారం. ఆయన సంగతి చూస్తామంటూ, వసూళ్ల సంగతేంటో తేల్చుతామంటూ ఆ అధికారిని హెచ్చరించారని తెలిసింది.  అధికారి కూడా అంతే దీటుగా స్పందించి... తనకున్న అధికారాలతో పోస్టులు వేశానని... తానేమీ తప్పు చేయలేదని... ఇక మీ ఇష్టమంటూ ఫోన్‌లో ఘాటుగా చెప్పినట్టు సమాచారం.

ఆవేదనలో నేతలు
వేసిన వారిని తీయలేమనడం, తమ అనుయాయులకు అవకాశం దక్కకపోవడంతో టీడీపీ నేతలు ఇప్పుడు ఇరుకున పడ్డారు. ఇప్పుడేం చేయాలని మల్ల గుల్లాలు పడుతున్నారు. పోస్టుల్ని భర్తీ చేసిన అధికారిని ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నారు. నెల్లిమర్ల మున్సిపాల్టీలో పోస్టులు భర్తీ చేసేసి బదిలీపై వెళ్లిపోయిన అధికారిపైనా ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. తమ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారీతిన చేసిన నియామకాల్ని రద్దు పరిచి, తమ వారిని తీసుకోవాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. అధికార జులుంతో తమ మాట చెల్లుబాటు కావాలని ప్రయత్నిస్తే... పాత వారిని తీసేయాలని గట్టిగా పట్టుబడితే... తమ పరిస్థితేంటని ఇప్పటికే నియమితులైన ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే తాము ఆర్థికంగా, ఉపాధి పరంగా నష్టపోతామని భయపడుతున్నట్టు తెలిసింది.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)