amp pages | Sakshi

ప్రాణాలు కాపాడిన అపరిచిత వ్యక్తి ఫోన్‌కాల్‌

Published on Fri, 01/10/2020 - 08:23

సాక్షి, కాశీబుగ్గ: క్షణికావేశానికి లోనై ఓ మహిళ అర్ధరాత్రి వేళ రైలు పట్టాలపైకి చేరుకుంది. దీన్ని ఓ అపరిచిత వ్యక్తి గమనించి సంకోచించకుండా వెంటనే 100 కాల్‌కు ఫోన్‌ చేశాడు. అప్పుడే విధుల్లో ఉన్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌కు సమాచారం చేరడంతో నిమిషాల వ్యవధిలో అక్కడకు చేరుకుని ఆమెను ప్రాణాలతో రక్షించాడు. ఈ ఘటన పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ తాళభద్ర రైల్వేగేట్‌ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. అత్యవసర సమయంలో 100 కాల్‌ చేస్తే విలువైన ప్రాణాలు కాపాడవచ్చని ఈ ఘటన నిరూపించింది.
 
కాశీబుగ్గ పోలీసు డివిజన్‌ కార్యాలయంలో గురువారం కాశీబుగ్గ డీఎస్పీ ఎన్‌ శివరామరెడ్డి ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన ఓ మహిళకు తన భర్తతో చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాలపైకి చేరుకుంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 3వ వార్డులో తాళభద్ర రైల్వేగేట్‌ సమీపంలో అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడింది. దీన్ని గమనించిన ఓ అపరిచిత వ్యక్తి వెంటనే 100కు డయల్‌ చేసి విషయం చెప్పాడు. తక్షణమే కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందడంతో కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలిలో రాత్రి విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ రామయ్య నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు.

అయితే భువనేశ్వర్‌ నుంచి వైజాగ్‌ వైపు వెళ్లే ఈస్టుకోస్టు రైలు రావడం ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో ఆ మహిళను రక్షించగలిగారు. లేదంటే ప్రాణాలు పోయి ఉండేవి. అనంతరం కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి సమస్యను పరిష్కరించారు. ఆపద సమయంలో డయల్‌ 100 సేవలను ప్రజలకు వినియోగించుకోవాలని డీఎస్పీ తెలిపారు. ఈమెను ప్రాణాలతో రక్షించినట్లుగా హెడ్‌ కానిస్టేబుల్‌ రామయ్య విషయం తెలియడంతో ఎస్పీ అమ్మిరెడ్డి రూ.5 వేలు రివార్డు ప్రకటించి అభినందనలు తెలిపారు. 100 కాల్‌ చేసిన వ్యక్తిని సైతం అభినందించారు. అయితే ఆయన వివరాలు ఇంతవరకు పోలీసులకు తెలియరావడం లేదు. ఈ సమావేశంలో కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Videos

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)