amp pages | Sakshi

పాస్‌పోర్ట్ కోసం నకిలీ ధ్రువ పత్రాలు

Published on Thu, 10/02/2014 - 02:52

ఎమ్మిగనూరు రూరల్: అతనో సైనికుడు. అర్ధాంతరంగా ఉద్యోగం మానేశాడు. ఎలాగైన విదేశాలకు వెళ్లాలనే ఉద్దేశంతో పాస్‌పోర్ట్ పొందేందుకు నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి పోలీసులకు చిక్కిన సంఘటన బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్ణణ ఎస్‌ఐ ఇంతియాజ్‌బాష తెలిపిన వివరాలివీ.. పట్టణంలోని మాచాని వీధికి చెందిన చెన్నారెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు రఘునాథ్‌రెడ్డి పదో తరగతి వరకు చదువుకున్నాడు. 2001వ సంవత్సరంలో సైన్యలో చేరి 8 సంవత్సరాలు సిపాయిగా పనిచేశాడు. అనంతరం సైన్యంలో అధికారులకు చెప్పకుండా పారిపోయి ఇంటికి వచ్చాడు. అయితే అతని ఒరిజనల్ సరిఫికెట్లు సైన్యం కార్యాలయంలో ఉండటంతో తాను విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం నకిలీ ధ్రువపత్రాలను సృష్టించాలనుకున్నాడు.

గడి వేముల జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నట్లు నకిలీ సర్టిఫికేట్ సృష్టించి ప్రధానోపాధ్యాయుడి సంతకం ఫోర్జరీ చేశాడు. ఈ సర్టిఫికేట్ జతపరచి పాస్‌పోర్టు కోసం ఎస్‌బీ పోలీసులకు ధరఖాస్తు చేసుకున్నాడు. ఎస్‌బీ హెడ్ కానిస్టేబుల్ చంద్ర విచారణలో భాగంగా గడివేముల జెడ్పీ పాఠశాలను సందర్శించగా ఈ పేరుగల విద్యార్థి తమ పాఠశాలలో చదవ లేదని, ఈ టీసీ మేము ఇచ్చింది కాదని అక్కడి హెచ్‌ఎం తేల్చి చెప్పారు. మోసాన్ని గమనించి ఎస్‌బీ కానిస్టేబుల్ చంద్ర పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ ఇంతియాజ్‌బాష నిందితుడి ని అదుపులో తీసుకొని విచారించారు. దీంతో రఘునాథ్‌రెడ్డి పాస్‌పోర్ట్ పొందేందుకు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించానని నేరం అంగీకరించాడు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో పట్టణ ఎఎస్‌ఐ ఆలీ, పోలీసు సిబ్బంది ఉన్నారు.



 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)