amp pages | Sakshi

పెట్రోకారిడార్ ప్రాంతం పరిశీలన

Published on Fri, 12/12/2014 - 01:19

నక్కపల్లి: మండలంలో పెట్రోకారిడార్ ప్రతిపాదిత గ్రామాల్లో గురువారం ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ప్రతినిధుల బృందం  పర్యటించింది. 20 మంది సభ్యులతో కూడిన బృం దం రాజయ్యపేట, అమలాపురం, వేంపాడు, మూలపర గ్రామాల్లో పర్యటించి  ప్రతిపాదిత పెట్రోకారిడార్‌మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించింది. అనంతరం రాజయ్యపేట,బోయపాడు మీదు గా మూలపర చేరుకుంది. ఇక్కడ పెట్రోకారి డార్ ఏర్పాటు చేస్తే పరిశ్రమల ఏర్పాటుకు సం బంధించి నీటివనరులు, రోడ్లు,ఇతర మౌలిక సదుపాయాలు, ప్రతిపాదిత ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ,ప్రైవేటు భూముల వివరాలు, తదితర వివరాలను ఏపీఐఐసీ అధికారులు వారికి వివరించారు.

పెట్రోకారిడార్‌లోకి ఏయేగ్రామాలు వస్తాయి, ఈ ప్రాంతం నుంచి జాతీయరహదారి ఎంతదూరం ఉంది. గతంలో ఇక్కడ ఏయేపరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నది ఏడీబీ ప్రతినిధులు ఏపీఐఐసీ అధికారులను అడిగితెలుసుకున్నారు. పెట్రోకారిడార్ మాస్టర్‌ప్లాన్ రూపొందించినప్పటికీ, దాని ఏర్పాటుకు అనుమతులు, భూసేకరణ, రైతుల అంగీకారం గు రించి ఆరా తీశారు.

రైతుల నుంచి ప్రైవేటు భూమి కొనుగోలు, పరిశ్రమల ఏర్పాటు, అవసరమైన తాగునీరు, విద్యుత్ సదుపాయం, రోడ్డురవాణా, ఇతర మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తున్నదీ చెప్పడంలో అధికారులు తడబడ్డా రు. పర్యావరణ అనుమతులు దాదాపు కొలిక్కి వచ్చాయని భూసేకరణకు నోటిఫికేషన్ విడుదలచేశామని,ఈనెలలో ప్రజాభిప్రాయసేకరణకు సిద్ధమవుతున్నామని ఏపీఐఐసీ అధికారలు ఏడీబీ ప్రతినిధులకు వివరించారు. ఈ బృందం వెంట నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు, స్థానిక తహశీల్దార్ సుందరరావు , ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.
 
ప్రజల్లో ఉత్కంఠ..
దాదాపు 8 వాహనాలతోకూడిన కాన్వాయ్ ఒకదానివెంట ఒకటి రయ్య్‌మ్రని పరుగులు తీయడం వాహనశ్రేణి ముందు పోలీసుల వాహనం పైలట్‌గా వెళ్లడం ఒక్కసారిగా వాహనాలు ఆగడం టకటకామంటూ అధికారులు దిగి ఏవో పెద్దపెద్ద ప్లానులు చూడటం వారిలో వారే మాట్లాడుకోవడం, వచ్చిన వారంతా తెల్లదొరలమాదిరిగా ఉండటంతో ఏమిజరుగుతుందో తెలియక ఈ ప్రాంత ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు.

పీసీపీఐఆర్‌ఏర్పాటుకు ఈనెల 18న ప్రజాభిప్రాయసేకరణ జరగనుంది, ఇప్పటికే దీనిపై ఆందోళన చెందుతున్న ప్రజానీకం తాజాగా పెట్రోకారిడార్ ఏర్పాటుకోసం ప్రభుత్వం ఈప్రాంతానికి ఏడీబీ ప్రతినిధుల బృందాన్ని తీసుకొచ్చింది. దీంతొ తీరప్రాంతగ్రామాల్లో ఉత్కంఠనెలకొంది. స్థానిక అధికారులెవరూ ఈవిషయాలపై నోరుమెదపకపోవడం రైతులను,కూలీలను, గంగపుత్రులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
 
అచ్యుతాపురంలో..  ఏడీబీ ప్రతినిధుల బృందం గురువారం మండలంలో పర్యటించింది. బ్రాండెక్స్ అపెరెల్‌సిటీకి చేరుకున్న బృంద సభ్యులకు పరిశ్రమలకు సంబంధించిన వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ద్వారా హెచ్‌ఆర్‌మేనేజర్ రఘుపతి వివరించారు. పరిశ్రమల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలపై సభ్యులు ప్రశ్నించారు. రోడ్లు విస్తరించాలని, విద్యుత్‌సరఫరా మెరుగుపడాలని సూచించారు. ముడిసరకు దిగుమతిలో ఇబ్బందులులేవని,ఎగుమతికి చెన్నయ్‌పోర్టును ఆశ్రయిస్తున్నామని బ్రాండెక్స్ అధికారులు తెలిపారు.

ఉద్యోగులకు కొరతలేదన్నారు. హుద్‌హుద్ నష్టాన్ని వివరించారు. అనంతరం పూడిమడక హైస్కూల్ వద్దకు వెళ్లారు. ఎస్‌ఈజెడ్ అవుటర్ రింగ్‌రోడ్డు నమూనాను పరిశీలించారు. పైపులైన్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించారు. అక్కడ నుంచి ఆంజనేయ అల్లాయీస్ పరిశ్రమను సందర్శించి సమస్యలను అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో సౌత్ ఆసియా రీజనల్ కార్పొరేషన్ డెరైక్టర్ శేఖర్‌బోను, ఎకనమిస్ట్ హు యన్ జంగ్, ప్రాజెక్టులీడర్ మనోజ్‌శర్మ, ట్రాన్స్‌పోర్ట్ స్పెషలిస్ట్ రవిపెరీ, సుమిత్ చక్రవర్తి, జార్జ్, బెనిత్ అయ్యర్, సౌమ్య చటోపాధ్యాయ, ఏపీఐఐసీ జెడ్‌ఎం యతిరాజు పాల్గొన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)