amp pages | Sakshi

38 ప్రాణాలు కాపాడిన ఫోన్‌ కాల్!

Published on Thu, 01/29/2015 - 14:25

అర్ధరాత్రి దాటాక కుటుంబ సభ్యులతో ఓ యువతి సాగించిన ఫోన్ సంభాషణే బస్సులోని 38 మంది ప్రాణాలను కాపాడింది. బుధవారం వేకువజామున ఉలవపాడు మండలం చాగల్లు వద్ద జాతీయ రహదారిపై పర్వీన్ ట్రావెల్స్‌కు చెందిన హైటెక్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. వారి సామగ్రి, నగలు, డబ్బు, ల్యాప్‌టాప్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ బస్సులో చివరి వరుస సీటులో కూర్చున్న శ్వేతా నటరాజన్ అనే యువతి నిద్రపోతున్న సమయంలో ఫోన్ రావడంతో మెలుకువ వచ్చింది.

వెనుక నుంచి పొగరావడం గమనించి వెంటనే బస్సు ఆపి ప్రయాణికులను లేపడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. వారు దిగిపోయిన కొద్ది నిముషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆమె నిద్రపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. బస్సు డ్రైవర్ పొగలు గమనించినా నిర్లక్ష్యంగా 20 కిలోమీటర్లు ముందుకు నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెనుక నుంచి మంటలు వ్యాపించడంతో డిక్కీల్లో ఉన్న సూట్‌కేసులు, బ్యాగులు తీసే అవకాశం లేకుండా పోయింది.

దీంతో అందరి సామగ్రి పూర్తిగా కాలిపోయింది. హైదరాబాద్‌కు చెందిన నూతన దంపతులు నికేష్ హేమాద్రి, క ల్యాణికి చెందిన రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, నగదు అగ్నికి ఆహుతయ్యాయి. చెన్నైకి చెందిన నలుగురు విద్యార్థులు హైదరాబాద్‌కు శిక్షణ కోసం వెళ్తున్నారు. వీరి సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి. నెల్లూరు జిల్లా అల్లూరుకు చెందిన వినోద్‌తో పాటు మరికొందరి ల్యాప్‌టాప్‌లు కాలిపోయాయి.

కళ్లముందే బంగారం బూడిదపాలు కావడంతో క ల్యాణి కన్నీరు మున్నీరుగా విలపించింది. కేవలం పది నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైందని ప్రయాణికులు తెలిపారు.  బస్సులో  వెనుక వైపు 10 బాక్స్‌లు ఉన్నాయని, మధ్యలో అవి కింద పడడంతో తాము పైన పెట్టినట్లు చివరి సీటు ప్రయాణికులు తెలిపారు. అవి స్వీట్‌బాక్సులని డ్రైవర్ తెలిపాడు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియాలంటే విచారణ పూర్తయితేనే చెప్పగలమని పోలీసులు అంటున్నారు.
 
భారీగా నష్టం
బస్సు ప్రమాదంలో భారీగా నష్టం వాటిల్లింది. సుమారు రూ.60 లక్షల విలువైన బస్సు పూర్తిగా దెబ్బతింది. ప్రయాణికుల నగదు, వస్తువులు, బంగారం కాలిపోయాయి. సుమారు రూ.20 లక్షల విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయని ప్రయాణికులు వాపోయారు. ఫోరెన్సిక్ ఏడీ రామకృష్ణ, క్లూస్‌టీం సీఐ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై విచారణాధికారిగా నెల్లూరు రవాణా శాఖాధికారి శివరాంప్రసాద్‌ను నియమించారు.  
 
ప్రయాణికుల రాస్తారోకో..
పోలీసులు, అధికారులు సక్రమంగా స్పందించలేదని ప్రయాణికులు రాస్తారోకో నిర్వహించారు. సుమారు 20 నిమిషాల పాటు ఒంగోలు వైపు వెళ్లే వాహనాలను నిలిపివేశారు. కందుకూరు సీఐ లక్ష్మణ్  వచ్చి వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
 
పలువురి అండ..
బస్సు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అటువైపుగా వెళుతున్న మానవ హక్కుల సంఘం నేత అవినాష్ దేవీచంద్రలు ప్రయాణికులకు సహకరించారు. తిరుపతి వెళుతున్న అవినాష్ అక్కడే ఉండి ప్రయాణికులకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. వెంటనే పోలీసులు మిగిలిన ప్రయాణికులను వివిధ మార్గాల్లో పంపించారు.
 
మంత్రుల పరిశీలన..
బస్సు దుర్ఘటన జరిగిన స్థలాన్ని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖా మంత్రి శిద్దా రాఘవరావు, పౌరసంబంధాలు, ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు పరిశీలించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం  అన్నారు. కలెక్టర్ విజయ్‌కుమార్, ఎస్పీ శ్రీకాంత్‌లు ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ ఉన్నారు.
 
ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటేమో..
- డ్రైవర్ తంగివేలు

షార్టు సర్క్యూట్ వలనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని బస్సు డ్రైవర్ తంగివేలు అభిప్రాయపడ్డాడు. బస్సులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవన్నాడు. కావలి సమీపంలో కొద్దిగా కాలిన వాసన రావడంలో ఆపి బస్సును పరిశీలించగా బయట మొత్తం బాగానే ఉండటంతో తిరిగి ప్రయాణం ప్రారంభించినట్లు తెలిపాడు. అంతా బాగానే ఉన్న లోపలి నుంచి మంటలు వచ్చాయంటే షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని అన్నాడు.            
 
బంగారం బూడిదైపోయింది
నెలక్రితం పెళ్లయింది. మానాన్న వాళ్లు చేయించిన బంగారం అంతా బ్యాగ్‌లో పెట్టా. అది మొత్తం కాలి బూడిదైపోయింది. అత్తగారింటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు ఆర్పిన వెంటనే వెళ్లి వెతికినా ఉపయోగం లేదు. కొన్ని ఆభరణాలు కనపడడంతో వాటిని తీసుకున్నా. నాకు న్యాయం చేయండి.                                               

- కెంగు కల్యాణి, ప్రయాణికురాలు
 
సర్టిఫికెట్లు కాలిపోయాయి
చెన్నై అమృత ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నాం. ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళుతున్నాం. మొత్తం నలుగురు బయలుదేరాం. ఈ ప్రమాదంలో మా సర్టిఫికెట్లు, పదివేల రూపాయల నగదు మొత్తం కాలిపోయాయి. ఏం చేయాలో అర్థం కావడంలేదు. మా కాలేజీ యాజమాన్యం వాళ్లు వెనక్కి రమ్మన్నారు. వెళ్లడానికి కూడా డబ్బులు లేవు.      

- శబరీష్, కిరణ్

Videos

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)