amp pages | Sakshi

మేత భూమినీ మేసేశారు

Published on Fri, 08/28/2015 - 04:52

పశువుల మేత పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. ఇది ప్రభుత్వ భూమి అంటూ హెచ్చరిక బోర్డులు పెట్టినా...గుట్టుచప్పుడు కాకుండా దున్నేసి ఏకంగా పంటలు సాగుచేస్తున్నారు. వెలిగండ్ల మండలంలోనే దాదాపు 200 ఎకరాలు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి.
- యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణ
- 200 ఎకరాలు కబ్జా
- హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా ఆగని దందా
వెలిగండ్ల :
ప్రభుత్వ భూమి ఖాళీగా కనిపిస్తే చాలు.. దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రిళ్లు పొక్లెయిన్‌లు పెట్టి భూములను బాగుచేసి, ట్రాక్టర్లతో దున్నుతున్నారు.  పైర్లు సాగు చేస్తున్నారు. మండలంలోని బొంతగుంట్ల, ఇమ్మడిచెరువు, పద్మాపురం, రామలింగాపురం, వెలిగండ్ల, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 200 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురయ్యాయి.

ఆక్రమణ దారులు దర్జాగా భూములు సాగు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు పశువుల మేత భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్నారు. ఒక ఊరి పొలాలను వేరొక ఊరు వాళ్లు ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని ఇరు గ్రామాలకు చెందిన ఆక్రమణదారులు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నారు.

బొంతగుంట్లపల్లిలో సర్వే నంబర్లు 65, 66,69, 77,70,59/16, 59/18, 59/2, 58, 20,19/2, 42 నంబర్లలో 704.42 ఎకరాలు రెవిన్యూ రికార్డుల ప్రకారం పశువుల మేత గ్రేజింగ్ పోరంబోకు భూమిగా ఉంది. ఆ భూముల్లో సుమారు 150 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఆక్రమించుకున్న భూముల్లోని 9 సర్వేనెంబర్లలో రెవిన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి.
 
ఇమ్మడిచెరువులో సర్వే నంబర్ 50లో 18 ఎకరాల పశువుల మేత పోరంబోకు భూమిని ఆ గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో ఆక్రమించుకొని సాగు చేస్తున్నట్లు ఎంపీపీ ముక్కు జయరామిరెడ్డి గతంలో పనిచేసిన తహ శీల్దార్ కావేటి వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేయడంతో గ్రామంలో దండోరా వేయించి పనులు ఆపివేశారు. మళ్లీ  మూడు రోజుల నుంచి పనులు చేస్తుండటంతో ఎంపీపీ తహ శీల్దార్ పుల్లారావుకు ఫిర్యాదు చేశారు. పనులు ఆపి, బోర్డులు ఏర్పాటు చేయాలని తహ శీల్దార్ వీఆర్వోను ఆదేశించారు. కానీ ఆ భూమిలో మాత్రం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు.
 
పద్మాపురంలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 13,14,15లో 40 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఇలాగే రామలింగాపురం, వెలిగండ్ల, నాగిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములు, పశువుల మేత పోరంబోకు భూములు కబ్జా అయ్యాయి. ఇకనైనా రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు స్పందించి మండలంలో ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.
 
హెచ్చరిక బోర్డులు పెట్టాం
బొంతగుంట్లలో ఆక్రమణలకు గురైన పశువుల మేత భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ఇమ్మడిచెరువులో సర్వే నంబర్ 50లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని వీఆర్వోను ఆదేశించాను. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాను.  
 -వి.పుల్లారావు, తహశీల్దార్

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)