amp pages | Sakshi

నర్సింగ్‌ విద్యార్థినులకు అస్వస్థత

Published on Sat, 04/08/2017 - 11:35

► కలుషితాహారం తిని వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిన 21 మంది
► రిమ్స్‌ నర్సింగ్‌ హాస్టల్‌లో పర్యవేక్షణ లోపం
► ఆహార కాంట్రాక్టర్‌కు మెమో జారీ

ఒంగోలు సెంట్రల్‌: రిమ్స్‌ నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులు శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రిమ్స్‌కు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలో దాదాపు 180 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా రిమ్స్‌లోనే ఉన్న నర్సింగ్‌ కళాశాలలోనే ఉంటున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే హాస్టల్‌లో ఉన్న విద్యార్థినులు కడుపునొప్పితో విలవిల్లాడారు. దీంతో ఉదయం 6 గంటల సమయంలో ఈ విషయాన్ని రిమ్స్‌ అధికారులకు తెలిపారు. అనంతరం ఐదుగురు విద్యార్థినులు రిమ్స్‌ క్యాజువాలిటీ అత్యవసర చికిత్స విభాగంలో తీవ్ర కడుపునొప్పితో చేరారు.

అనంతరం మరో ఐదుగురు తీవ్ర వాంతులతో, ఇంకో 11 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం చేరారు. మధ్యాహ్నానికి పలువురు విద్యార్థినులు కోలుకున్నారు. మిగిలిన వారిలో మూడో సంవత్సరం నర్సింగ్‌ విద్యార్థినులు లావణ్య, హర్షితల పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ప్రత్యేక చికిత్స అందించారు. వీరికి బీపీ చాలా తక్కువగా ఉండటంతో అత్యవసర చికిత్స అందించారు. మరో 24 గంటలు పరిశీలనలో ఉంచారు.

విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు దగ్గర ప్రాంతాల వారు హుటాహుటిన రిమ్స్‌కు చేరుకుని, తమ పిల్లల పరిస్థితి వాకబు చేసి ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థినులకు లక్ష్మీనారాయణ అనే కాంట్రాక్టర్‌ ఆహారాన్ని సరఫరా చేస్తున్నాడు. గురువారం రాత్రి దోసకాయ కూరతో కూడిన అన్నాన్ని విద్యార్థినులకు పెట్టారని రిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.వల్లీశ్వరి తెలిపారు.  ఆహారంలోనో, పాత్రల్లోనూ కలుషితమై విషపూరితమైనట్లు చెప్పారు. 

కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులను శుక్రవారం మధ్యాహ్నం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, రిమ్స్‌ వైద్యశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సింగరాజు రాంబాబులు రిమ్స్‌కు చేరుకుని పరామర్శించారు. విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రిమ్స్‌ డైరక్టర్‌ డాక్టర్‌ వల్లీశ్వరి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేశ్వరరావు, డాక్టర్‌ నామినేని కిరణ్‌కుమార్, డాక్టర్‌ ఎం.వెంకయ్య, డాక్టర్‌ హనుమానాయక్, నర్సింగ్‌ సిబ్బంది వైద్య సేవలు అందించారు.

వసతి గృహంపై కొరవడిన పర్యవేక్షణ:
రిమ్స్‌ నర్సింగ్‌ కళాశాల వసతి గృహంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఆహార కాంట్రాక్టర్‌ తన ఇష్టం వచ్చినట్లు ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అనేక సార్లు ఆహారం బాగాలేదని విద్యార్థినులు ఫిర్యాదు చేసినా కాంట్రాక్టర్‌ గానీ, అధికారులు గానీ పట్టించుకోలేదు. ఈమధ్యే వైద్య కళాశాల విద్యార్థినులు తమకు కూడా నాణ్యమైన ఆహారం అందించడం లేదని, అధిక ధరలు వసూలు చేస్తున్నారని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు,  కలెక్టర్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఇది జరుగుతుండగానే నర్సింగ్‌ కళాశాల వసతి గృహంలో ఆహారం కలుషితమై విషాహారంగా మారింది. ఆహారం విద్యార్థినులు గానీ, రోగులు గానీ తినే ముందు ఆర్‌ఎంఓ, డైటీషియన్లు తప్పని సరిగా రుచి చూడాలి. బాగుంది అంటేనే విద్యార్థులకు గానీ, రోగులకు గానీ వడ్డించాలి. అయితే ఈ నిబంధన అమలు కావడం లేదు. ఆమ్యామ్యాలకు కక్కుర్తి పడుతున్న అధికారులు నాసిరకం భోజనాన్ని విద్యార్థినులకు అందిస్తున్నారు.

ఆహార కాంట్రాక్టర్‌కు మెమో:
రిమ్స్‌ నర్సింగ్‌ కళాశాల వసతి గృహానికి ఆహారాన్ని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌ లక్ష్మీ నారాయణకు ప్రాథమికంగా మెమో  జారీ చేస్తున్నట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ తెలిపారు. ఆహార శాంపిల్‌ను నాణ్యత పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. పూర్తి నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)