amp pages | Sakshi

‘కాక్సికా’ కలకలం

Published on Thu, 04/26/2018 - 09:24

రాష్ట్రంలో గుంటూరులోనేతొలిసారి గుర్తించామన్న సూపరింటెండెంట్‌1957లో న్యూజిలాండ్‌లో బయటపడ్డ వైరస్‌

సాక్షి, అమరావతి :  రాష్ట్రంలో కాక్సికా వైరస్‌ ఏడేళ్ల లోపు చిన్నారులపై ప్రతాపం చూపిస్తోంది. గుంటూరు జిల్లాలో ఐదు నెలల వ్యవధిలో 56 మంది చిన్నారులు ఈ వైరస్‌ బారిన పడినట్టు పెద్దాసుపత్రి వర్గాలు తెలిపాయి. చేతులు, కాళ్లు, ముఖంపై తీవ్ర దద్దుర్లు లేదా బొబ్బలు కనిపిస్తాయి. తట్టు లాగా కనిపించే ఈ వైరస్‌ లక్షణాలు చిన్నారులను బాగా ఇబ్బంది పెడతాయని వైద్యులు చెబుతున్నారు. ప్రాణాప్రాయ పరిస్థితులు లేకపోయినా వైరస్‌ తీవ్రత వారం రోజుల పాటు బాగా ఉంటుందని, సకాలంలో చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు.

గుంటూరులో తొలిసారి గుర్తింపు
రాష్ట్రంలో కాక్సికా వైరస్‌ సోకినట్టు తొలిసారి గుంటూరు జిల్లాలోనే గుర్తించారు. 2017 అక్టోబర్‌లో 20 కేసులు నమోదైనట్టు గుంటూరు ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు. 2016 ఏప్రిల్‌ వరకూ 56 మంది చిన్నారులకు ఈ వ్యాధి సోకినట్టు వెల్లడైంది. 2016లో తెలంగాణలో కాక్సికా వైరస్‌ కేసులు 50  నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఎక్కడినుంచి వచ్చింది?
కాక్సికా వైరస్‌ 61 ఏళ్ల కిందటే ప్రపంచానికి పరిచయమైంది. తొలిసారిగా 1957లో న్యూజిలాండ్‌లో బయటపడింది. కెనడా దీన్ని 1958లో సీవీఏ16 వైరస్‌గా గుర్తించింది. ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాల్లో బాగా విస్తరించింది. భారత్‌లో తొలిసారిగా 2006లో నాగ్‌పూర్‌లో 4 కేసులు నమోదైనట్టు గుర్తించారు.

వ్యాధి లక్షణాలు..
చేతులు, కాళ్లు, ముఖం, నడుము భాగంలో ఎర్రటి దద్దుర్లు లేదా బొబ్బలు.
కాక్సికా వైరస్‌ ఎ 16 (సీవీఏ 16)లో    మరో ఐదు రకాలున్నాయి.
హెచ్‌ఎఫ్‌ఎండీ (హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ డిసీజ్‌)    అని కూడా దీన్ని వ్యవహరిస్తారు.
అక్టోబర్, నవంబర్‌ నెలల్లో వైరస్‌ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
ఒకరి నుంచి మరొకరికి నోటి ద్వారా,    తుమ్ముల ద్వారా వ్యాపిస్తుంది.
జ్వరం, గొంతు నొప్పితో ఇబ్బంది పడతారు.
కీళ్ల నొప్పుల్లా ఉండి నీరసంగా ఉంటుంది.
శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
నెలల చిన్నారులు ఆహారం తినేందుకు  ఇబ్బంది పడతారు.

నివారణ, జాగ్రత్తలు
‘కాక్సికా’  అంటువ్యాధి.
వైరస్‌ సెల్‌ కల్చర్‌ అంటే రక్తపరీక్షల ద్వారా వ్యాధి లక్షణాలను చెప్పవచ్చు.
వ్యాధి సోకిన చిన్నారులను స్కూళ్లకు పంపొద్దు.
జన సమర్థంలో తిరిగితే ఇతరులకు వ్యాపిస్తుంది.
వ్యాధి లక్షణాలు సోకగానే ప్రత్యేక గదిలోఉంచాలి.
వ్యాధి సోకిన చిన్నారుల చేతులు, కాళ్లను శుభ్రంగా ఉంచాలి.
చిన్నారులు వాడే ఉపకరణాలను సైతం ప్రత్యేకంగా ఉంచాలి.
సాధారణంగా జ్వరానికి చేసే చికిత్సా విధానాలే పాటిస్తారు.
శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా మందులు తీసుకుంటే  సరిపోతుంది.
వారంలో సాధారణ చికిత్సతోనే నయమవుతుంది.

ప్రాణాపాయం లేదు
కాక్సికా వైరస్‌ వల్ల ప్రాణాపాయం ఉండదు. ఇది పూర్తిగా చర్మానికి సంబంధించిన వ్యాధి. వారం రోజుల్లో చికిత్స ద్వారా తగ్గిపోతుంది. గుంటూరులోనే ఈ వ్యాధి బాధితులు ఉన్నారు అనడం కంటే ఇక్కడ వైరస్‌ను గుర్తించాం అనడం సబబు. మిగతా చోట్ల కూడా ఉండొచ్చు. వైరస్‌ సోకిన వారికి చికిత్స చేసి పంపించాం.  –డా.రాజునాయుడు, సూపరింటెండెంట్,    గుంటూరు సర్వజనాసుపత్రి 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)