amp pages | Sakshi

ఆత్మవిశ్వాసం..ఆత్మనూన్యత!

Published on Sun, 03/19/2017 - 13:11

ఎమ్మెల్సీ గెలుపుపై విశ్వాసంతో వైఎస్సార్‌సీపీ 
► 4 కూడికలు, తీసివేతలతో డోలాయమానంలో టీడీపీ
► 4 కోట్లాది రూపాయల డబ్బు..అధికార దుర్వినియోగం నిరర్థకం
► 4 ఆ ఇద్దరు మినహా గుంభనంగా తక్కిన నేతలు
ఎమ్మెల్సీ ఎన్నికల శంఖారావంతోటే గెలుపుపై విశ్వాసంతో వారు ముందడుగు వేశారు. పార్టీ శ్రేణులతో చర్చించి ఏకాభిప్రాయంతో అభ్యర్థిని ప్రకటించారు. ఆపై కదనరంగంలోకి దూకారు. ఎవరికి వారు  ఓటర్ల మద్దతు కూడగడుతూనే ఆ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేస్తూ దీటుగా నిలిచారు. తామంతా ఒక్కటే అన్నట్లుగా పిడికిలి బిగించి పోరాటం చేశారు. అదే వైఎస్సార్‌సీపీ బలం.. ఎన్నికల వ్యూహం. ఆపై ఆత్మవిశ్వాసంతో పోరు నడిపించారు. 
 
సాక్షి ప్రతినిధి, కడప: 
 ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక నాటి నుంచే అంతర్గతంగా కుయుక్తులు తెరపైకి వచ్చాయి. రాజకీయంగా పైచేయి సాధించాలనే తపన, ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా శైలి ప్రస్ఫుటం అయ్యాయి. మాటవరుసకైనా చర్చించకుండానే అర్ధరాత్రి ఇన్‌ఛార్జి మంత్రితో ప్రకటింపజేశారు. ఆపై సమష్టి నిర్ణయమంటూ మీడియాకు వెల్లడించారు.
 
ఎప్పటికప్పుడు ఇంటా బయట తమదే పైచేయి కావాలని ఆ ఇద్దరు తాపత్రయపడ్డారు. పార్టీలో ఉంటూనే ఆత్మన్యూనతతో నాయకులు  వ్యవహరించాల్సి వచ్చింది. ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ పోకడలు వ్యతిరేకించలేక భరిసూ్తనే తెలుగుదేశం నేతలు మౌనం దాల్చి పోరు నడిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు వైఎస్సార్‌సీపీ, ఇటు టీడీపీల మధ్య నెలకొన్న పోరాటం పైన చెప్పినట్లుగా నడిచింది. అధికారం, అధిష్టానం మాట వింటోందని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తాము చెప్పినోళ్లే అభ్యర్థి, తాము సూచించినట్లే అడుగులు వేయండి అన్నట్లు  ఆ ఇద్దరు టీడీపీ బండిని నడిపించారు. వారి శైలే టీడీపీ నావను ముంచుతోందని విశ్లేషకుల భావన. నియంతృత్వ ధోరణి, ఏకపక్ష నిర్ణయాలు ఆపై బురద అందరికీ రుద్దడం ఇదే క్రమంలో వ్యవహరించారని ఆపార్టీ సీనియర్‌నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటి విధానమే తెలుగుదేశం పార్టీని దెబ్బతీసిందని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. 
 
ప్రజాజీవితంలో మమేకం అదనపు బలం
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైఎస్‌ వివేకానందరెడ్డి ఎంపిక ఆ పార్టీకి అదనపు బలం చేకూర్చింది. ప్రజాజీవితంలో మమేకమయ్యే నాయకుడు కావడం,  నిగర్వి, క్షేత్రస్థాయిలో వ్యక్తిగత పరిచయాలు, ఇలాంటి అదనపు అర్హతలుండడం ఫ్లస్‌ పాయింట్‌గా పరిశీలకులు భావిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవికి ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవలేమి, జిల్లాలో పార్టీ నాయకులందరితో వ్యక్తిగత  పరిచయాలు లేకపోవడం మైనస్‌ పాయింట్‌గా పలువురు వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదన్నట్లుగా పరి స్థితి నెలకొందని ఆపార్టీ సీనియర్‌ నేతలు వాపోతున్నారు. కడపలో ప్రత్యక్ష దౌర్జన్యకర ఘటనలు బహు అరుదు. బద్వేల్‌ ప్రాంతంలో కిడ్నాప్‌ ఉదదంతం వచ్చే ఓట్లను దెబ్బతీశాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అభిమానంతో రాజకీయ ఉన్నతి సాధించాలి్సందిపోయి, వచ్చిన అవకాశం చేజెక్కించుకోవాలనే తపనతో, అధికా రం అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలకు దిగడం వంటి చర్యలను పలువురు తప్పుపడుతున్నారు. ఇలాంటి చర్యలన్నీ పోలింగ్‌లో టీడీపీని వెనుకంజలో వేశాయని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. 
 
కోడింగ్‌ ముంచిందా..గోవిందా..
అ«ధికారం బలం, విచ్చలవిడి డబ్బు కారణంగా టీడీపీ శిబిరానికి గణనీయ సంఖ్యాబలాన్ని తరలించింది. శిబిరంలో ఉన్న ఓటర్లను మచ్చిక చేసుకొని మంచితనంతో ఓట్లు వేయించుకోవాల్సి ఉండగా, ఓటర్లకు కోడ్‌ ఇచ్చారు. బ్యాలెట్‌ సీక్రెట్‌ అయినప్పటికీ మీరు వేసిన ఓట్ల ఆధారంగా వేశారా...లేదా...తెలుసుకోగలం...అంటూ బెదిరింపులకు దిగారని, ఈపరిణామం ఇబ్బంది కరంగా మారిందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. గ్రాడ్యుయేట్స్‌ సైతం ఎ మ్మెల్సీ ఓటింగ్‌లో తికమకపడుతోన్న నేపథ్యంలో రిజర్వేషన్ల కారణంగా ప్రజాప్రతినిధులైన పలువురు పూర్తిగా ఇబ్బంది పడ్డారని పలువురు పేర్కొంటున్నారు. ఈక్రమంలో తప్పిదం చోటుచేసుకుంటే పరువు నిలుపుకోవడమే కష్టంగా ఉంటోందని  వెల్లడిస్తున్నారు. ఈక్రమంలోనే జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఏకపక్షచర్యలు, నియంతృత్వ పోకడలు, ఓటర్లకు కోడ్‌ ఇలా ఒకదానికి ఒకటి తోడై టీడీపీ శిబిరాన్ని ఆత్మన్యూనతలో నెట్టేశాయని పలువురు పేర్కొంటున్నారు. సోమవారం కౌటింగ్‌ సందర్భంగా అదే విషయం స్పష్టం కాగలదని విశ్లేషకులు సైతం వెల్లడిస్తుండడం గమనార్హం.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌