amp pages | Sakshi

పెళ్లి కళ వచ్చేసిందే బాలా..

Published on Thu, 08/07/2014 - 01:26

  •      ఈనెలలో వేలాది వివాహాలు
  •      ముస్తాబవుతున్న వేదికలు
  •      పరిమిత ముహూర్తాలతో పెళ్లి ఏర్పాట్లకు భారీ డిమాండ్
  • మూడు ముళ్లు.. ఏడడుగులు.. పెళ్లంటే రెండు మనసులు ఒక్కటయ్యే శుభ ఘడియలు. అందుకే అంత ఆనందం. చూసిన వారికి సైతం ముచ్చట గొలిపే వేడుకది. అందుకే అంత వైభోగం. శ్రావణం మాసం రావడంతో సుముహూర్తాలు సమీపించాయి. వేదికలు సిద్ధమవుతున్నాయి. పట్టు చీరల రెపరెపలు.. సుగంధ పరిమళాలు.. పిండి వంటల ఘుమఘుమలు.. వివాహ మహోత్సవానికి శోభను చేకూర్చే విషయాలు. పెళ్లి సందడిపై ప్రత్యేక కథనం..
     
    విశాఖపట్నం-కల్చరల్ : శ్రావణ మాసం వచ్చింది.. మంచి ముహూర్తాలెన్నో తెచ్చింది. కల్యాణ మండపాలు సర్వాంగసుందరంగా ముస్తాబవుతున్నాయి. మూఢం ముగిశాక ఈనెల 13, 14, 15 తేదీల్లో సుముహూర్తాలు ఉండటంతో పెద్దలు పెళ్లి పనుల్లో బిజీబిజీ అయిపోయారు. 19వ తేదీన బలమైన ముహూర్తం కావడంతో ఆరోజు వెయ్యికిపైగా వివాహాలు జరగనున్నాయని పురోహితులు చెప్పారు. ఈ రోజుల్లో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు ఉండటంతో నగరంలోని కల్యాణ మండపాలతోపాటు క్యాటరింగ్, వీడియో తీసే వారికి డిమాండ్ పెరిగిపోయింది. నగరంలోని ప్రముఖ కల్యాణ మండపాలతోపాటు చిన్న, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఫంక్షన్ హాల్స్, ట్రావెల్స్, ఫ్లవర్ డెకరేషన్ ట్రూప్స్‌ను ముందుగానే రిజర్వు చేసుకున్నారు. చిన్న పెద్ద హోటల్ రూమ్స్ ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. నగరంలో 500లకు పైగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు బిజీబిజీగా ఉన్నాయి. ఈ మూడు రోజుల్లో బుక్ చేద్దామంటే డేట్స్ ఖాళీలేవని కస్టమర్లకు చెబుతున్నారు.
     
     ముచ్చటైన వేదికలు
     
    పెళ్లికి గ్రాండ్ లుక్ తీసుకురావడంలో ఫంక్షన్ హాళ్లదే కీలక పాత్ర. ఖరీదైన కల్యాణ మండపాలు, స్టార్ హోటళ్లలో కాన్ఫరెన్స్ హాళ్లు ఇందుకు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి. పెద్దపెద్ద గ్రౌండ్స్‌లో అపురూపమైన సెట్టింగ్‌లు వేసి, ఇంకెక్కడా లేని విధంగా ప్రత్యేకంగా డెకరేట్ చేసుకోవడం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. సెట్టింగులు వేయడానికి చెన్నై నుంచి ఆర్ట్ డెరైక్టర్లను కూడా రప్పిస్తున్నారు. ది పార్క్ హోటల్ లాన్‌లో ఓపెన్ ఫంక్షన్ హాల్‌ను కళ్లు చెదిరేలా రూపొందిస్తున్నారు. ఎల్‌ఈడీ టీవీలు, స్క్రీన్‌లు ఏర్పాటు చేసి, వివాహ వేడుకను దూరంగా కూర్చున్నవారు, డిన్నర్ హాల్లో ఉన్నవారు సైతం క్లోజ్‌గా వీక్షించడనాకి ప్రొజెక్టర్‌తోపాటుగా వైఫై సౌకర్యం అందుబాటులో ఉంటున్నాయి. స్పెషల్ డెకరేటివ్ లైటింగ్, సెంట్రలైజ్డ్ ఏసీ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో 270 ఫంక్షన్ హాల్స్‌ను ఆన్‌లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలి. (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.జీవీఎంసీ.ఓఆర్‌జీ.ఇన్) ఇక ప్రైవేటుగా సుమారు 1500కుపైగా ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఆన్‌లైన్ ద్వారానే బుక్ చేసుకుంటున్నారు.
     
    ..అందుకే శ్రావణమంటే క్రేజ్
     
    శ్రావణంలో పెళ్లి ముహూర్తాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సహజంగానే ఈ మాసంలో పెళ్లిని సుముహూర్తంగా భావిస్తారు. అందుకే శ్రావణమంటే క్రేజ్. చాలా అడ్వాన్సుగా శ్రావణం సీజన్ ముహూర్తాలకు వివాహ వేదికలన్నీ బుక్ అయిపోయాయి. మన నగరంలో ఇప్పుడిప్పుడే ఫంక్షన్ హాళ్లు పెరిగాయి. అయితే కొన్ని చోట్ల కనీస సౌకర్యాలు ఉండటం లేదు. అవసరం కోసం జనం అడ్జస్టయిపోతున్నారు. వాహనాల పార్కింగు సదుపాయం లేని ఫంక్షన్ హాళ్లకు అనుమతించరాదనే నిబంధన అధికారులు అమలుచేయాలి.
     - యు.నాగభూషణం, వైశాఖి జల ఉద్యానవనం
     

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)