రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డబ్బు ఇమ్మన్నందుకు కత్తితో పొడిచాడు..
Published on Tue, 04/21/2015 - 16:11
అనంతపురం : మంగళవారం ఉదయం ఓ మహిళపై ఆటోడ్రైవర్ కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా కమలానగర్‌కు చెందిన మోమిన్బేగం అనే మహిళ చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. కాగా స్థానికంగా ఆటో నడుపుకునే వెంకటకృష్ణ అనే వ్యక్తి గతంలో ఆమె వద్ద రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు.
ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని మోమిన్బేగం అడుగుతుండగా కొంతకాలంగా అతను వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం అతన్ని గట్టిగా నిలదీయగా ఆమెను కత్తితో పొడిచాడు. ఆమె కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి రాగా నిందితుడు పారిపోయాడు. బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు.
#
Tags