amp pages | Sakshi

అన్ని పథకాలకూ ఆధార్ లింకు

Published on Thu, 07/31/2014 - 03:50

సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు ఆదేశం

హైదరాబాద్: అన్ని ప్రభుత్వ పథకాలకు శల వారీగా ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను, కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత హాస్టళ్లలో విద్యార్థుల చేరికకు, అలాగే విద్యాసంస్థల్లో విద్యార్థుల చేరికకు ఆధార్ అనుసంధానాన్ని నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు.

అలాగే రెవెన్యూ రికార్డులకు కూడా ఆధార్‌ను అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. అధార్ అనుసంధానం చేయడం ద్వారా పథకాల భారాన్ని తగ్గించుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రైతుల ఖాతాలకు ఆధార్ అనుసంధానం ద్వారా రుణ మాఫీ భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో ఈ-గవర్నెన్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీపై  కేంద్రానికి పంపాల్సిన ప్రతిపాదనలను త్వరగా సిద్ధం చేయాల్సిందిగా అన్ని శాఖలను ఆదేశించారు.
 
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌