హవ్వ.. నిరుపేదకు 12 ఎకరాలా?

Published on Wed, 01/01/2020 - 09:05

సాక్షి, అద్దంకి: సెంటు భూమి లేని ఓ నిరుపేద పేరిట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఎకరాల భూమి ఉన్నట్లుగా మీ భూమి పోర్టల్‌లో చూపిస్తోంది. దీంతో ఆ వ్యక్తి అమ్మ ఒడి పథకానికి అనర్హుడయ్యాడు. వివరాలు.. పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీకి చెందిన దాసరి బుల్లెయ్యకు ఒక కుమారుడున్నాడు. అమ్మ ఒడి పథకం కోసం దరఖాస్తు చేశాడు. దరఖాస్తు రిజక్ట్‌ అయింది. ఎందుకైందని పరిశీలిస్తే నీ పేరిట 12 ఎకరాల భూమి ఉందని చెప్పారు.

దీంతో అవాక్కయిన బల్లెయ్య మీ భూమి అడంగల్‌ వెబ్‌సైట్‌లో  పరిశీలించగా, బుల్లెయ్య ఆధార్‌ నంబరుతో,  ఖాతా నంబరు 2408 పేరుతో దక్షిణ అద్దంకిలోని వీరభద్రస్వామి దేవస్థానానికి చెందిన 1353/2, 1354 సర్వే నంబర్లకు సంబంధించి 12.64 ఎకరాలు భూమి ఉన్నట్లుగా చూపిస్తోంది. దీంతో బుల్లెయ్య లబోదిబోమంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. తనకు సెంటు భూమి కూడా లేకున్నా ఇదేమిటని వాపోతున్నాడు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ