నీటి కష్టాలు తీర్చండి

Published on Fri, 11/17/2017 - 09:22

కర్నూలు జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం రామచంద్రాపురం క్రాస్‌రోడ్డు వద్ద కేసీ కెనాల్‌ సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు కలిశారు. యాలూరి రామసుబ్బారెడ్డి, తలసాని బాలిరెడ్డి, గంగుల సుభాష్‌రెడ్డి తదితరులు ఈ ప్రాంత రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. 120 కి.మీ. నుంచి 215 కి.మీ. వరకు ఉన్న కేసీ కాల్వకు ఎలాంటి నమ్మకమైన నీటి వనరు లేదని, కేవలం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌పై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారని చెప్పారు.

శ్రీశైలం జలాశయం నీటిమట్టాన్ని 854 అడుగులకు స్థిరీకరిస్తేనే ఈ ప్రాంత రైతులకు పోతిరెడ్డిపాడు ద్వారా సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. శ్రీశైలంలో నీటి మట్టాన్ని 841 అడుగుల కంటే దిగువకు తగ్గిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన జీవో నం.69ను తక్షణమే రద్దు చేయించాలని, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయించాలని కోరారు. జగన్‌ స్పందిస్తూ.. రైతుల సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు జగన్‌కు తలపాగా చుట్టి సత్కరించారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ