ఏకకాలంలో 100 చోట్ల ఐటీ దాడులు

Published on Thu, 10/25/2018 - 09:56

సాక్షి, విశాఖపట్నం : ఇసుక మాఫియాపై ఐటీ అధికారులు విరుచుకుపడ్డారు.  బీచ్‌ల్లోని ఇసుకను విదేశాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లోని నాలుగు ఇసుక మైనింగ్‌ కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ కంపెనీలకు చెందిన 100 చోట్ల గురువారం ఉదయం ఏకకాలంలో దాడులు చేశారు. తమిళనాడుకు చెందిన వైకుందరాజన్‌ (న్యూస్‌ 7 తమిళ్ అధిపతి) వీవీ మినరల్‌ కంపెనీ, సుకుమార్‌, చంద్రేశన్‌, మణికందన్‌కు చెందిన కంపెనీలపై దాడులు చేసినట్టుగా సమాచారం. సముద్ర ఖనిజమైన ఇసుకను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారన్న ఇంటలిజన్స్‌ వర్గాల సమాచారంతో  ఈ దాడులు చేశామని అధికారులు వెల్లడించారు.

దువ్వాడలో..
విశాఖలోని ‘ట్రాన్స్‌ వరల్డ్‌ గార్నెట్‌ ఇండియా’ అనే ఎక్స్‌పోర్టు కంపెనీపై కూడా గురువారం తెల్లవారుజామున ఐటీ అధికారులు దాడులు చేశారు. విశాఖ సెజ్‌లో సోదాలు చేసేందుకు ఐటీ అధికారులు దువ్వాడకు ఉదయం 4.30కి చేరుకున్నారు. అయితే, సెజ్‌కు ఆవల ఉన్న ‘ట్రాన్స్‌ వరల్డ్‌ గార్నెట్‌ ఇండియా’ కంపెనీకి అక్రమాలకు పాల్పడుతోందని సమాచారం అందింది. ఈ కంపెనీ శ్రీకాకుళం నుంచి వేల టన్నుల ఇసుక దిగుమతి చేసుకుని కంటెయినర్లలో అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తుందని ఫిర్యాదు అందడంతో కంపెనీపై దాడులు నిర్వహించామిన ఐటీ అధికారులు తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ