amp pages | Sakshi

సాగర వీర...సాహస ధీర

Published on Mon, 02/08/2016 - 03:11

భళా ‘త్రివిధ’ విన్యాసం
♦ ఆకాశంలో, సముద్రంలో, నేలపైనా నావికాదళం పాటవ ప్రదర్శన
♦ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు
♦ ప్రధాని సమక్షంలో ప్రదర్శన
♦ ఘనంగా అంతర్జాతీయ సిటీ పరేడ్
♦ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
♦ జనసంద్రమైన విశాఖ ఆర్కే బీచ్ రోడ్డు
 
 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

 విశాఖ సాగరతీరం సాక్షిగా భారత నౌకాదళం తన సామర్థ్యాన్ని సమున్నతంగా ఆవిష్కరించింది. బంగాళాఖాతంలో అలల హోరుతో పోటీపడుతూ వేలాదిమంది కరతాళ ధ్వనులు చేస్తుండగా నౌకాదళం సాహసోపేత విన్యాసాల్ని ప్రదర్శించింది. గగనతలంలో దూసుకుపోయిన చేతక్ హెలికాఫ్టర్లు.. రివ్వున దూసుకుపోతూనే పల్టీలు కొడుతూ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన హాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు.. అలల్ని చీల్చుకుంటూ దూసుకుపోతూ డేర్ డెవిల్ విన్యాసాలను ప్రదర్శించిన మెరైన్ కమెండోలు... సముద్రంలో ఠీవిగా నిల్చున్న యుద్ధనౌకల మీద నుంచి నేరుగా ఆకాశంలోకి చొచ్చుకొస్తూ గగుర్పాటుకు గురిచేసిన ఫాల్కన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు... ఇక భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా బీచ్‌రోడ్డులో వివిధ రాష్ట్రాల జానపద నృత్యాల ప్రదర్శన... ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొన్న 51 దేశాల నౌకాదళాల కవాతు.. శకటాల ప్రదర్శన... ఓ వైపు సూర్యాస్తమయం అవుతూ పరుచుకుంటున్న చీకట్లను పారదోలుతూ వెలుగులు చిమ్మిన యుద్ధవిమానాలు.. మిరుమిట్లు గొలుపుతూ శోభాయమానంగా విరజిమ్మిన బాణసంచా వెలుగులు .. విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో ఆదివారం ఈ సుందరదృశ్యం ఆవిష్కృతమైంది.  

 అద్భుతరీతిలో విన్యాసాలు..
 ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్)లో భాగంగా విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో ఆదివారం సాయంత్రం భారత నౌకాదళం తన సాహస విన్యాసాలను సగర్వంగా ప్రదర్శించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, త్రివిధ దళాధిపతులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు, 51 దేశాల నౌకాదళాల ప్రతినిధులతోపాటు వేలాదిగా హాజరైన ప్రజలతో బీచ్‌రోడ్డు కిక్కిరిసిపోయింది. సాయంత్రం 5 గంటలకు వేదిక వద్దకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అడ్మిరల్ ఆర్కే ధోవన్, వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ, గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బుల్లెట్‌ప్రూఫ్ వేదికలో ప్రధాని ఆశీనులైన మరుక్షణంలోనే ఆకాశంలో మూడు చేతక్ హెలికాఫ్టర్లు రివ్వున దూసుకువచ్చి నౌకాదళ విన్యాసాలకు శ్రీకారం చుట్టాయి.

వెనువెంటనే హాక్ యుద్ధవిమానాలు పల్టీలు కొడుతూ అద్భుతరీతిలో విన్యాసాల్ని ప్రదర్శించాయి. అంతలోనే సముద్రంలో ఐఎన్‌ఎస్ జలాశ్వ నుంచి నాలుగు మెరెన్ బోట్లలో మార్కోవ్స్ కమెండోలు దూసుకొచ్చారు. బీచ్‌లో నిర్దేశించిన లక్ష్యాల్ని ఛేదించారు. చేతక్ హెలికాఫ్టర్ల పై నుంచి సంద్రంలోకి దిగిన మార్కోవ్స్ తమ సాహసాన్ని చాటిచెప్పారు. మళ్లీ తాళ్ల సహాయంతో హెలికాప్టర్లోకి చేరుకుని అబ్బురపరిచారు. అంతవరకు దూరంగా లంగరు వేసిన యుద్ధనౌకలు మెల్లగా తీరంవైపు రాసాగాయి. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, శివాలిక్ మీద నుంచి ఫాల్కన్, బ్లాక్‌ఫాంథర్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు జతల జతలుగా గాలిలోకి దూసుకుపోయి సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి.

బాంబులు వేస్తున్న తీరును తలపిస్తూ వెలుగుపూల బాంబులు విరజిమ్ముతూ సముద్రంలోని లక్ష్యాలను ఛేదించాయి. పీ 8ఐ హెలికాప్టర్లు వెలుగులు విరజిమ్ముతూ గగనతలాన్ని కాంతివంతం చేసి చూపరుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి. అంతలోనే ఆకాశం నుంచి 16 మంది స్కైడైవర్స్ పారాచ్యూట్లతో దిగుతూ కనిపించారు. గింగిరాలు తిరుగుతూ ప్రధాని మోదీ ఆశీనులైన వేదిక ముందు దిగారు. వారిలో ఒక డైవర్.. నౌకాదళం రూపొందించిన ‘మారిటైమ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా’ అనే పుస్తక ప్రతిని పట్టుకుని దిగి.. నేరుగా ప్రధాని మోదీ ఉన్న వేదిక మీదికెళ్లి దాన్ని ఆయనకు అందజేశారు. ఆ వెంటనే మోదీ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

 ఆకట్టుకున్న సిటీ పరేడ్
 నౌకాదళ విన్యాసాల అనంతరం అంతర్జాతీయ సిటీ పరేడ్‌ను బీచ్‌రోడ్డులో ఘనంగా నిర్వహించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన యోగా విశిష్టతను చాటుతూ కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. వివిధ రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. అనంతరం పరేడ్‌ను ప్రారంభించారు. కమాండర్ పర్వీన్ మల్లిక్ నేతృత్వంలో భారత నౌకాదళ బృందం పరేడ్‌ను నిర్వహించింది. భారత వాయుసేన, కోస్టుగార్డు, ఏపీ పోలీస్, ఎన్‌సీసీ, కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థులు దాన్ని అనుసరించారు. భారత్‌తోపాటు ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొన్న విదేశీ నౌకాదళాల సిబ్బంది కవాతు చేస్తూ ప్రధాని మోదీకి గౌరవ వందనం సమర్పించాయి. చివరగా 30 బుల్లెట్ బైక్‌లపై నౌకాదళ సిబ్బంది రైడ్ నిర్వహించారు. తదుపరి ఐఎఫ్‌ఆర్ థీమ్‌సాంగ్ ప్రదర్శన, నేవీ స్కూల్ విద్యార్థినుల నృత్య ప్రదర్శనలతో ఈ వేడుకలు ముగిశాయి. ఆ వెనువెంటనే బాణసంచా మెరుపులతో ఆకాశం శోభాయమానంగా మారింది. లేజర్ కాంతులు విరజిమ్ముతూ విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి.

Videos

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్...కేసు నమోదు చేసిన ఈడీ

ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుంది: సీఎం జగన్

ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్

Photos

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)