amp pages | Sakshi

యువజంట కోసం ముమ్మరంగా గాలింపు

Published on Thu, 10/30/2014 - 03:29

  • యాసిడ్ దాడి కేసులో దర్యాప్తు వేగవంతం
  •  రెండోరోజు పలువురిని విచారించిన పోలీసులు
  • ఇబ్రహీంపట్నం :  ఇబ్రహీంపట్నం రింగుసెంటర్ సమీపంలో దంపతులపై యాసిడ్‌తో దాడి చేసి పరారైన యువజంట కోసం పోలీ సు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం పోలీసులతో పాటు నగరంలోని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కూడా ఈ కేసును ముమ్మరంగా దర్యాపు చేస్తున్నారు. బైక్‌పై వచ్చిన యువకుడికి 30 ఏళ్లు, యువతికి 25 ఏళ్ల వయస్సు ఉంటుంది.

    యువతి పంజాబ్ డ్రెస్ ధరించింది. వారు రింగుసర్కిల్ మీదుగా వచ్చి దాడి అనంతరం ఫెర్రి ఆర్టీసీ కాలనీ రోడ్డు మీదుగా ఇసుక రేవు డొంకరోడ్డులోకి వెళ్లి గాజుల పేట మీదుగా కీసరవైపు వెళ్లారని  పోలీసులకు అందిన సమాచారాన్ని బట్టి తెలిసింది. వారి ఆచూకీ కోసం కీసర టోల్‌గేట్ వద్ద వీడియో కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల పుటేజీని సేకరిస్తున్నట్లు సమాచారం.
     
    మూడు కోణాల్లో దర్యాప్తు

    ఈ కేసును పోలీసులు మూడు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. దాడిలో గాయపడ్డ జూలూరి హనుమంతరావు మొద టి భార్య కుమారులు కుట్రపన్ని ఉంటారని ప్రధానంగా అనుమానించారు. మరి అంశా లపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. హనుమంతరావు రెండో భార్య రమాదేవి, ఆమె తరఫు బంధువుల పాత్ర ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు ఎవరైనా శుత్రువులు ఉం డి ఉంటారా? అనేదానిపై కూడా ఆరా తీస్తున్నారు.  

    హనుమంతరావు వడ్డీలకు డబ్బు కూడా ఇస్తుంటారు. వడ్డీ వసూళ్ల విషయంలో ఒకరిద్దరితో మనస్పర్థలు ఉన్నట్లుగా పోలీసు విచారణలో తేలినట్లు తెలిసింది. తమ కుమారులే దాడి చేయించారని ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కుమారులు వాదిస్తున్నారు.    హనుమంతరావు ఇంటిని పోలీసులు బుధవారం కూడా పరిశీలించారు. అతడి కుటుంబ సభ్యులతో పాటు కుటుంబానికి సంబంధం ఉన్న వారిని కూడా పిలిచి విచారిస్తున్నారు.
     
    కోలుకుంటున్న రమాదేవి

    దాడిలో తీవ్రంగా గాయపడిన రమాదేవి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కార్పొరేట్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. హనుమంతరావు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై నమోదైన కేసును ఇబ్రహీంపట్నం సీఐ సీహెచ్ రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
     

Videos

కూటమికి బిగ్ షాక్

కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది: హరీష్ రావు

వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్

బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

మా మద్దతు సీఎం జగన్ కే

పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ

కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్

భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!

YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు

గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?

ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)