amp pages | Sakshi

అంచనాలు పురోగతి.. పనులు అధోగతి

Published on Tue, 07/10/2018 - 02:24

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైల్వే పనుల అంచనాలు ఏటికేడాది పెరుగుతున్నాయి తప్ప.. పనులు మాత్రం ఎక్కడివి అక్కడే ఉన్నాయి. రైల్వే పనుల జాప్యానికి ప్రధానంగా భూసేకరణ, అధికార పార్టీ నేతల కమీషన్ల కక్కుర్తే కారణమని రైల్వే వర్గాలే చెబుతున్నాయి. ఈ కారణంగానే పనులు ముందుకు నడవక ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరుగుతోందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ పనుల్లో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామకృష్ణ, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురగండ్ల రామకృష్ణ కాంట్రాక్టు కంపెనీల నుంచి కమీషన్ల కోసం డిమాండ్‌ చేసి నానాహంగామా సృష్టించిన విషయాలను వారు ఉదహరిస్తున్నారు. రైల్వే ప్రాజెక్టు భూ సేకరణ బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఆ సేకరణ సకాలంలో పూర్తి చేయడం లేదని రైల్వే శాఖ చెబుతోంది.

ఇక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే ప్రాజెక్టులకు కాస్ట్‌ షేరింగ్‌ విధానంలో నిధులు మంజూరు చేస్తున్నాయి. కాస్ట్‌ షేరింగ్‌ విధానంలో అటు రైల్వే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అరకొరగా నిధులు కేటాయిస్తుండటంతో ప్రాజెక్టుల పనులు నాలుగేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులు 8 ఉన్నాయి. వీటి అంచనా వ్యయం నాలుగేళ్ల క్రితం మొత్తం రూ. 13,200 కోట్లు. ఇప్పుడు అదనంగా మరో రూ. 2 వేల కోట్ల వరకు పెరిగినట్లు రైల్వే శాఖ నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రైల్వే, ఏపీ ప్రభుత్వం జాయింట్‌ వెంచర్‌ కంపెనీ (జేవీ) ఏర్పాటు చేసినా.. అది కాగితాలకే పరిమితమైంది. జేవీ కాకుండా రాష్ట్రంలో రైల్‌ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, నిధుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్లతో రైల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను గతేడాది ఆగస్టులో ఏర్పాటు చేసింది. 2016 డిసెంబర్‌ 30న ఏపీ ప్రభుత్వం రైల్వే శాఖ జాయింట్‌ వెంచర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో రైల్వే వాటా 41%, ఏపీ సర్కారు వాటా 51 % ఉంటుంది.  

కొలిక్కిరాని నడికుడి–శ్రీకాళహస్తి భూసేకరణ
రాష్ట్రానికి వెన్నెముకలాంటి నడికుడి–శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ ఏర్పాటుకు భూ సేకరణ ప్రక్రియ ఇంతవరకు కొలిక్కి రాలేదు. రూ.1,314 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం ప్రస్తుతం రూ. 2,200 కోట్లు దాటిందని రైల్వే శాఖ చెబుతోంది. విజయవాడ–భీమవరం–నిడదవోలు రైల్వే లైన్‌ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌ పనులు 2013లో రూ.1,009.08 కోట్లు అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు రూ.1,300 కోట్లను దాటుతోంది. కడప–బెంగళూరు రైల్వే లైన్‌కు రూ.1000.23 కోట్లు అంచనా వ్యయం కాగా, ఇప్పుడు రూ.1,300 కోట్లు దాటింది. కాజీపేట–విజయవాడ మూడో లైన్‌ నిర్మాణానికి రూ.3,246 కోట్లు అంచనా కాగా, రూ.3,780 కోట్లకు చేరింది.   

Videos

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)