amp pages | Sakshi

మేఘాలలో తేలిపొమ్మని..

Published on Fri, 05/30/2014 - 01:36

సాక్షి ప్రతినిధి, అనంతపురం :  అనంతపురం సమీపంలో మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హడావుడి చేసింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు అనువైన ప్రదేశాల కోసం పర్యటించినప్పుడు రెండు స్థలాలను కూడా గుర్తించారు. ఇదంతా జరిగి పది నెలలైనా  ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం లేదు. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన అశోక్ గజపతిరాజు పౌరవిమానయాన శాఖ మంత్రి పదవి స్వీకరించడంతో మినీ ఎయిర్‌పోర్ట్‌పై ఆశలు చిగురిస్తున్నాయి.
 
 వివరాల్లోకి వెళితే.. విమాన సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో గతంలో ఉన్న కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇదే సమయంలో రాష్ట్ర విభజనకు యూపీఏ సర్కారు జూలై 30న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది అనంతపురం నగర నడివీధుల్లో సమైక్యాంధ్ర ఉద్యమ ఆవిర్భావానికి దారితీసింది. ఉద్యమం మహోగ్రరూపం దాల్చిన సమయంలోనే.. అనంతపురంలో మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హడావుడిగా ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల బృందం ఆగష్టు 31న జిల్లాలో పర్యటించింది. ఆరు కిలోమీటర్ల మేర రన్ వేతో పాటు మినీ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రెండు వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని ఏఏఐ అధికారులు తేల్చారు.
 
 జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, రెవెన్యూ అధికారులతో కలిసి ఏఐఐ అధికారుల బృందం.. మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతం కోసం అన్వేషించింది. అనంతపురం నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో బళ్లారి-అనంతపురం రోడ్డుకు సమీపంలో ఒక ప్రదేశాన్ని.. ఎన్‌హెచ్-44కు దగ్గరలో కనగానిపల్లి-రాప్తాడు మండలాల సరిహద్దులోని మరొక ప్రదేశాన్ని మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు గుర్తించింది. ఇదే అంశాన్ని కేంద్రానికి నివేదించింది. ఈలోగా భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించి.. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉక్కుపాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేశాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన సాఫీగా జరిగిపోయింది. విభజన సమయంలో సీమాంధ్రకు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తామని కేంద్రం పేర్కొంది.
 
 కానీ.. అనంతపురం జిల్లాలో మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామన్న హామీని ప్రత్యేక ప్యాకేజీలో ఎక్కడా పొందుపరచలేదు. ఈలోగా ఎన్నికలు రానే వచ్చాయి. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 8న ఏర్పాటు కానుంది. మన రాష్ట్రానికే చెందిన అశోక్‌గజపతిరాజు కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత తరుణంలో అనంతపురంలో మినీ ఎయిర్‌పోర్టు ఏర్పాటు ఆయన చేతుల్లో ఉంది.
 
 కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మినీ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తే.. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి బీజం వేయవచ్చు. జిల్లాలో ఇనుప ఖనిజం, సున్నపురాయి వంటి నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. చౌకగా భూమి లభిస్తుంది. విస్తారంగా మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు, రవాణా మార్గాలు మెరుగ్గా ఉన్నాయి. మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటైతే పారిశ్రామికాభివృద్ధి ఊపందుకునే అవకాశం ఉంది. దీనికి సమాంతరంగా విద్యారంగం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాకు మంజూరైన ఐఐఎస్‌సీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సస్) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు త్వరితగతిన ఏర్పాటవుతాయి.  
 

#

Tags

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)