amp pages | Sakshi

నాటు కోడికి పెరుగుతున్న క్రేజ్‌

Published on Tue, 11/05/2019 - 09:12

ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది గానీ.. నాలుక మీద పడగానే ఆ రుచి అదిరిపోతుంది. పంటితో కొరికాక చూడాలి ఆ ముక్క మజాని.. కొన్ని క్షణాలు కళ్లు తెరిస్తే ఒట్టు. ఆ నాటు ఘాటును అలా హాయిగా ఆస్వాదించేస్తాం మరి. ఇగురైనా.. పులుసైనా.. చివరకు ఫ్రై అయినా.. ఆ టేస్టే వేరు. అందుకే తిన్నాక అంటాం.. తింటే నాటు కోడినే తినాలని. అందుకే ఇప్పటివరకూ కొంచెం దూరమైన ఆ రుచిని మాంసం ప్రియులు మళ్లీ కోరుకుంటున్నారు. బ్రాయిలర్‌కు బదులు ‘నాటు’కే ఓటేస్తున్నారు. 

సాక్షి, నెట్‌వర్క్‌: నాటు కోడి గుడ్డు.. మాంసాన్ని బలవర్ధక ఆహారంగా పరిగణిస్తారు. కానీ.. నాటు కోడి మాంసం గట్టిగా.. తినడానికి ఇబ్బందిగా ఉంటోందని వినియోగాన్ని తగ్గించేశారు. పల్లెల్లో సైతం మారిన జీవనశైలికి నాటుకోళ్ల పెంపకం భారం కావడంతో దాదాపు మానుకున్నారు. పల్లెల్లో సైతం బ్రాయిలర్‌ కోడి మాంసం అందుబాటులోకొచ్చింది. అందుకే ఇంతకాలం నాటుకోళ్లకు ప్రత్యామ్నాయంగా మాంసం ప్రియులు బ్రాయిలర్‌ కోడి మాంసానికి అలవాటుపడ్డారు. మెత్తగా.. తినడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో దీనినే ఎక్కువగా వినియోగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల మాంసం ప్రియుల ఆహార అలవాట్లలో మార్పులొచ్చాయి. బరువు పెరగడానికి బ్రాయిలర్‌ కోళ్లకు ఇంజెక్షన్‌లు చేస్తున్నారనే అనుమానం పెరిగింది. హార్మోన్‌ ఇంజెక్షన్లతో నెల రోజుల కోడి పిల్లను రెండు, మూడు కేజీలకు పెంచుతున్న వైనాలూ వెలుగు చూస్తున్నాయి. మరోవైపు వాటి రుచి తగ్గిపోవడం వంటి కారణాలతో బ్రాయిలర్‌ మాంసం వినియోగాన్ని క్రమంగా తగ్గించేస్తున్నారు.  వారాంతంలో విధిగా నాటు కోడి మాంసం కొనుగోలుకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటికొచి్చన బంధువులకు, వివాహ విందులు, ఇతర కార్యక్రమాల్లో నాటు కోడి కూర వండి వడ్డిస్తున్నారు. 

కిలో రూ.400 నుంచి 500పైనే.. 
పల్లెటూళ్లలో పెంచుతున్న నాటుకోళ్లను పట్టణాలు, నగరాలకు తీసుకొచ్చి వారాంతంలో విక్రయిస్తున్నారు. పెంపకందార్లు నాటు కోడిని రూ.300 వరకు విక్రయిస్తుంటే.. మార్కెట్‌లో కిలో కోడిని రూ.400 నుంచి రూ.500కు పైగా అమ్ముతున్నారు. మార్కెట్‌లో మటన్, నాటు కోడి మాంసం ధరలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. నాటు కోడికి పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా ఇటీవల కాలంలో బ్రాయిలర్‌ కోళ్ల ఫారాలు మాదిరిగా నాటు కోళ్ల ఫారాలు పెరిగాయి. 

నాటు కోడి పులుసు రెడీ 
పట్టణాల్లో ఓ మోస్తరు హోటళ్లు మొదలుకుని.. విజయవాడ,విశాఖ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి తదితర నగరాల్లోని రెస్టారెంట్లు, స్టార్‌ హోటళ్లలో నాటు కోడి ఇగురు, పులుసును మెనూలో ప్రత్యేకంగా చూపుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో అన్ని రెస్టారెంట్లు, దాబాలు.. నాటు కోడి పులుసు, రాగి సంగటితో స్వాగతం పలుకుతున్నాయి. జాతీయ రహదారుల వెంట దాబాల్లో నాటు కోడికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 

కోళ్ల పెంపకంపై ఆసక్తితో..
సుదీర్‌రెడ్డి, వైఎస్సార్‌ జిల్లా, ఓబులవారిపల్లి మండలం, తల్లెంవారి పల్లె గ్రామ నివాసి. గతంలో ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. నాటు కోళ్ల పెంపకంపై ఆసక్తితో ఇటీవలే అక్కడ ఉద్యోగం మానేసి సొంతంగా రూ. 10 లక్షలతో ఫారం ఏర్పాటు చేశాడు. ఎలాంటి కృత్తిమ మందులు వాడకుండా పూర్తిగా సంప్రదాయ దాణాలతో దాదాపు 3,000 కోళ్లను పెంచుతున్నారు. ఆయన్ని పలకరించగా.. నాటు కోడి గుడ్లకు, మాంసానికి విపరీతమైన డిమాండ్‌ ఉందని, ప్రతి రోజూ ఫారం దగ్గరికే వచ్చి మాంస ప్రియులు నాటు కోళ్లను, గుడ్లను తీసుకెళ్తున్నారని చెబుతున్నారు.  వారాంతాలు, పండుగల్లో దూర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వస్తుంటారని వివరించాడు. ఒకసారి ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత నెలకు రూ. లక్ష వరకు లాభాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.  

నాణ్యతకు పెద్దపీట 
మా నాటు కోళ్ల ఫారం కర్నూలు సిటీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. ప్రతి ఆదివారం కనీసం 50 మంది ఇక్కడికే వచ్చి నాటు కోళ్లు కొనుక్కెళ్తున్నారు. వినియోగదారులు డబ్బుకు వెనకాడటం లేదు. రుచి, నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. – వెంకటేశ్వర్లు, కర్నూలు 

సబ్సిడీపై కోళ్ల పిల్లలు 
గతంలో రైతులు పెరట్లో నాటు కోళ్లు విరివిగా పెంచేవారు. కాలక్రమేణా ఈ పెంపకం తగ్గింది. ఇటీవల కాలంలో రైతులు మళ్లీ నాటుకోళ్లు పెంపకంపై ఆసక్తి చూప్తున్నారు. ప్రతి జిల్లాలో చిన్న చిన్న ఫామ్‌లు వెలుస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా పెరటికోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి రైతుకూ సబ్సిడీపై 45 నాటుకోళ్ల పిల్లలను పంపిణీ చేస్తుంది.   – ఎన్‌.టి.శ్రీనివాస్, పశుసంవర్థకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ 

పోషక విలువలు అధికం 
నాటు కోళ్లలో తక్కువ ఖర్చుతో ఎక్కువ మాంసకృత్తులు లభిస్తాయి. నాటు కోడి గుడ్లు ఎక్కువ బలమైన ఆహారం. కోళ్లకు తరుచూ సీజనల్‌ వ్యాధులకు వ్యాకిన్స్‌లు వేయించుకోవాలి.     – డా‘‘ వి.అనురాధ, పశుసంవర్ధకశాఖ (వీబీఆర్‌ఐ) జెడీ, సామర్లకోట.

మాజీ సైనికుని ఇంట సిరుల పంట 
ఎర్రావారిపాళెం (చిత్తూరు జిల్లా): ఎర్రావారి మండలం కూరపర్తివారిపల్లిలో మాజీ సైనికుడు శ్రీనాథ్‌రెడ్డి కడక్‌నాథ్‌ రకంతోపాటు నాటు కోళ్లు పెంచుతున్నారు. మార్కెట్లో నాటు కోళ్లకు డిమాండ్‌ బాగుండటంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నట్టు శ్రీనాథ్‌రెడ్డి చెప్పారు. కోళ్లతోపాటు కోడిగుడ్లు, పిల్లల్ని కూడా అమ్ముతున్నట్టు వివరించారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని ధీమాగా చెప్పారు. 

రాష్ట్రంలో జీవాల గణాంకాలివీ.. (సుమారుగా..) 
లేయర్‌ కోళ్లు- 11,01,10,315
బ్రాయిలర్‌ కోళ్లు- 8,05,83,000 
నాటు కోళ్లు- 35,18,950 
మేకలు- 44,12,500 
గొర్రెలు- 1,35,04,350 
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)