amp pages | Sakshi

ఆయన హాస్యానికే బ్రహ్మ

Published on Sat, 06/21/2014 - 01:57

ఇంటర్వ్యూ - ప్రముఖ హాస్యనటుడు రాళ్లపల్లి
 
నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం... నవ్వలేక పోవడం ఒక రోగం.. అనడమే కాదు అందులోని రెండో సూత్రాన్ని తూ.చా. తప్పకుండా పాటించి అంతులేని కీర్తిని మూటగట్టుకున్నారు జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి. రచరుుతగా, దర్శకుడిగా ఆయన సినిమాల్లో ఎంతోమందికి అవకాశమిచ్చి ఉన్నతస్థానంలో నిలబెట్టారు. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి వంటి ఎంతోమంది హాస్యనటులు ఆయన సినిమా నుంచి పుట్టుకొచ్చినవారే. నటుడు రాళ్లపల్లి నరసింహశాస్త్రి కూడా ఎన్నో జంధ్యాల సినిమాల్లో నటించి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఇటీవల జరిగిన జంధ్యాల 13వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా జంధ్యాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ   ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.           
 
 జంధ్యాల గురించి చెప్పండి

 తెలుగు భాష ఉన్నంతకాలం జంధ్యాల అందరి గుండెల్లో చిరస్థారుుగా నిలిచిపోతారు. హాస్యం గురించి మాట్లాడే ప్రతిచోటా ఆయనుంటారు. జంధ్యాల.. హాస్యానికే పర్యాయపదం.
 
 ఆయన సినిమాలపై మీ అభిప్రాయం

 ప్రవాసాంధ్రులు జంధ్యాల సినిమాలు చూడటానికే ప్రాధాన్యత ఇస్తారు. తమ వద్ద ఎప్పుడూ ఆయన సినిమా సీడీలు ఉంచుకుం టారు. స్వదేశానికి దూరంలో ఉన్నా జంధ్యాల సినిమా చూసి స్వదేశం లో ఉన్నామని భావిస్తామని చాలామంది ఎన్నారైలు నాకు చెప్పారు.
 
జంధ్యాలతో మీ అనుబంధం

జంధ్యాలతో నా సంబంధం దైవికమైనది. ఆయన దర్శకత్వంలో పది సినిమాలకుపైగా నటించాను. ఆ సినిమాల్లో రాళ్లపల్లి కనిపించడు. పాత్రే కనిపిస్తుంది. ఆ పాత్ర పోషించింది నేనేనా.. అన్న అనుమానం నాకు అప్పుడప్పుడూ కలుగుతుంది. రెండురెళ్ల ఆరు, అహ నా పెళ్లంటా.., శ్రీవారికి ప్రేమలేఖ, బావా బావా పన్నీరు సినిమాలు జంధ్యాలను అంచనా వెయ్యటానికే.. జంధ్యాల హాస్య చిత్రాలకే పరిమితం కాలేదు. సర్వసమానత్వం కోరుతూ తీసిన ‘నెలవంక’, కళాకారులకు జాతిమత కులబేదం లేదని చెప్పిన ‘ఆనందభైరవి’ ఆయన దర్శకత్వ ప్రతిభకు పరాకాష్ట.
 
 నేటి హాస్య సినిమాలపై ఆయన ప్రభావం..

 ఈరోజు హాస్య చిత్రాలకు మాటలు రాసేవారు, దర్శకత్వం చేసేవారిలో చాలామంది జంధ్యాల శిష్యులే. హాస్యం ఎలా పండించాలో ఆయన నుంచే నేర్చుకున్నారు.
 
 దర్శకుడిగా ఆయన విజయ రహస్యం..

 జంధ్యాల వంటి దర్శకులు అరుదుగా కనిపిస్తారు. ఆయన సినిమాల్లో హాస్యం అతికించినట్టు ఉండదు. సినిమాల్లో భాగంగా ఉంటుంది. జంధ్యాల పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. నాటక రంగం నుంచి రావటం వల్ల ప్రతి సన్నివేశంలో జీవించేవారు. ‘ఆపద్బాంధవుడు’ సినిమాలో మాధవయ్య సినిమా ద్వారా అజరామరమైన కీర్తి సాధించారు. అందుకే జంధ్యాల మన మధ్య లేకపోయినా ఆయన చిరంజీవిగానే ఉన్నారని నేను భావిస్తాను.

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)