ఏపీని నెంబర్ వన్గా చూడాలన్నదే లక్ష్యం: గవర్నర్

Published on Sat, 03/07/2015 - 09:07

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ విభజన హేతుబద్ధంగా జరగలేదని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆయన శనివారం ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు. అయితే కేంద్రం నుంచి సరైన సాయం అందలేదని... కేంద్రం నుంచి మరింత సహకారం కోసం ఎదురు చూస్తున్నామన్నారు.

 

ప్రకృతి వైపరిత్యాల వల్ల ఏపీకి మరింత నష్టం జరిగిందన్నారు.  వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం తప్పనిసరి అన్నారు.

9 నెలలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. 2029 నాటికి  దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నెంబర్వన్గా చేయటమే తమ లక్ష్యమన్నారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయటం తమ  విభజన వల్ల జరిగిన నష్టాలను గత అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించామన్నారు.  రాజధాని నిర్మాణంలో ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉండాలన్నారు.  జన్మభూమి, మా ఊరు కార్యక్రమాల ద్వారా గ్రామాలు అభివృద్ధి చేస్తామన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ