‘సాక్షి’ స్పెల్‌బీకి అపూర్వ స్పందన

Published on Mon, 11/24/2014 - 03:53

తిరుపతి గాంధీరోడ్డు: ‘సాక్షి’ స్పెల్ బీ మూడో రౌండ్ పరీక్షలు ఆదివారం తిరుపతిలో ముగిశాయి. తిరుచానూ రు రోడ్డులోని శ్రీనివాసపురంలో ఉ న్న రామిరెడ్డి రాయలసీమ విద్యాసంస్థల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు అ పూర్వ స్పందన లభించింది. మొత్తం 264 మంది విద్యార్థులు హాజరైనట్లు ఈవెంట్ అండ్ మార్కెటింగ్ అసిస్టెం ట్ జనరల్ మేనేజర్ హరీష్‌రెడ్డి తెలి పారు. ఈ పరీక్షలకు మొదటి రెండు రౌండ్లలో ఉత్తీర్ణులైన విద్యార్థులు హాజరయ్యారన్నారు. వీరిని నాలుగు కేటగిరిలుగా విభజించి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.

మొదటి కేటగి రి విద్యార్థులకు ఉదయం 10.15కు, 2వ క్యాటగిరి విద్యార్థులకు ఉదయం 11.30కు, 3వ కేటగిరికి మధ్యాహ్నం 12.30,  4వ కేటగిరి విద్యార్థులు మధ్యాహ్నం 1.15 వరకు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఏర్పాట్లపై తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పరీక్షలు విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతాయని సంతోషం వ్యక్తం చేశారు.

మూడో రౌండ్‌లో విజయం సాధిం చిన విద్యార్థులను డిసెంబర్ 5న హైదరాబాద్‌లో జరిగే ఫైనల్ రౌండ్‌కు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ‘సాక్షి’ స్పెల్ బీ కార్యక్రమానికి భారతి సిమెంట్ సహాయసహకారాలు అందించింది. విద్యార్థులకు ఉచితంగా పెన్‌లు అందజేసింది. భారతి సిమెంట్ కంపెనీ ప్రతినిధులు ఛాయాపతి, గంగరాజులు పాల్గొన్నారు.
 
ఇదో మంచి అనుభూతి
విద్యార్థులను పో టీ పరీక్షలకు తీసుకురావడం ఒక మంచి అనుభూతిగా భావిస్తున్నా. సాక్షి సంస్థ వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెం పొందిస్తాయి. విజ్ఞానాన్ని పెంచుకోవడానికి దోహదపడతాయి.     
- సరిత, నెల్లూరు
 
చాలా నేర్చుకున్నారు
నా కుమారుడు స్పెల్‌బీ రెండు రౌండ్లలో ఉత్తీర్ణత సాధించి మూడో రౌండ్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి పాల్గొన్న తరువాత ఎంతో నేర్చుకున్నాడు. చాలా చెబుతున్నా డు. మున్ముందు మరింత నేర్చుకుం టాడని ఆశిస్తున్నాను.
- చిన్నకృష్ణ, వైఎస్‌ఆర్ జిల్లా

మంచి అవకాశం
సాక్షి వారు ఎగ్జామ్ నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చినట్టయ్యింది. ఇక్కడకు వచ్చే ముందు మూడో రౌండ్ వరకు వస్తానని అనుకోలేదు. కానీ ఈ ఎగ్జామ్ రాశాక ఫైనల్ రౌండ్ చేరుకుంటాననే ఆత్మవిశ్వాసం పెరిగింది.  
- లిఖిత, తిరుపతి

చాలా ఆసక్తిగా ఉంది
రెండు రౌండ్లు పూర్తి చేసుకుని మూడో రౌండ్‌కు చేరాను. ఇది కూ డా పూర్తి చేసుకుని ఫైనల్ రౌండ్‌కు చేరతాననే నమ్మకం ఉంది. ఇలాంటి పరీక్షలు నిర్వహిం చడం వల్ల చదువుపై మమకారం పెరుగుతుంది. ఇంకా నేర్చుకోవాలనే ఆసక్తి ఉంది.
 - సాధ్విక, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు  జిల్లా
 
ఇంగ్లిష్‌పై భయం పోయింది
నేను చాలా బాగా చదువుతాను. కానీ ఇంగ్లిష్ సబ్జెక్ట్ అంటే చాలా భయం. ఎంతచదివినా ఎగ్జామ్‌వరకు వచ్చేసరికి వణికిపోతాను. ఇప్పుడీ పరీక్షల్లో పాల్గొన్న తరువాత ఏ పదాన్నైనా అవలీలగా నేర్చేసుకుంటున్నాను.
 -నాగరుత్విక్, కర్నూలు
 
ఫైనల్‌కు చేరుతా
మొదటి రెండు రౌండ్లు బాగా రాశా ను. మూడో రౌండ్ కు వచ్చాను. ఫైన ల్ రౌండ్‌కు కచ్చితంగా చేరుతాను. మొదటిసారి స్పెల్ బీలో పాల్గొన్నప్పుడే నాకు ఆ నమ్మ కం వచ్చింది. మున్ముందు ఇలాంటి పోటీలు  నిర్వహిస్తే బాగుంటుంది.         
               -అభినవ్, వైఎస్సార్ జిల్లా
 
పోటీతత్వం పెరుగుతుంది
సాక్షి స్పెల్‌బీ పరీక్ష నిర్వహించడం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకం. వారిలో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. పోటీతత్వం పెరుగుతుంది. సాక్షి సంస్థ వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయం.    
- శశిధర్, అనంతపురం
 
భయాన్ని పోగొట్టింది
ఇలాంటి పరీక్షలు రాయడం వల్ల నాలో ఇంకా నేర్చుకోవాలనే తపన పెరిగింది. ఇంగ్లిష్‌పై మంచి పట్టు సాధించాను. నాలో ఉన్న భయాన్ని సాక్షి స్పెల్ బీ పోగొట్టింది. చాలా సంతోషంగా ఉంది.
 -కీర్తి,ధర్మవరం

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ