amp pages | Sakshi

‘గిరి’ నుంచి రాష్ట్ర స్థాయికి!

Published on Sun, 01/05/2014 - 01:42

=క్రికెట్ టీమ్‌లో ప్రశాంత్‌కు చాన్స్
 =దాతల సాయానికి ఎదురుచూపు

 
చింతపల్లి, న్యూస్‌లైన్ :  రాష్ట్ర స్థాయి క్రికెట్‌లో పాల్గొనే అరుదైన అవకాశం ఓ పేద గిరిజన యువకుడిని వరించింది. అక్కడ పరుగుల వరద పారిస్తే హైదరాబాద్ ఐపీఎల్ సన్‌రైజర్స్ జట్టులో చోటు దక్కుతుంది. విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలం జర్రెల గ్రామానికి చెందిన గొర్లె వెంకటగిరి ప్రశాంత్ (19) స్థానిక పరిశోధనా స్థానంలో ద్వితీయ సంవత్సరం అగ్రికల్చర్ డిప్లొమా చదువుతున్నాడు. కుడిచేతివాటం బ్యాట్స్‌మన్ అయిన ప్రశాంత్ మండల, జోనల్ స్థాయి పోటీల్లో బాగా రాణించడంతో విశాఖపట్నంకు చెందిన సన్ ఎస్‌ఆండ్‌ఎస్ జట్టులో చోటు లభించింది. 2009-10 సీజన్‌లో హైదరాబాద్‌లో జరిగిన జిల్లా స్థాయిలో పోటీల్లో రాణించాడు.

2013లో ఉత్తరాఖండ్‌లో జరిగిన ఇండియన్ క్రికెట్ అకాడమీ ట్రోఫీలో సత్తా చాటాడు. గత నెల 16న రాజస్థాన్‌లో జరిగిన ఇండియన్ క్రికెట్ అకాడమీ పోటీల్లో ముంబ యి జట్టుపై పరుగుల వరద పారించాడు. ఏకంగా 124 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టులో స్థానం కోసం పోటీపడే జట్లలో చోటు దక్కింది. ఈ పోటీల్లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఈ నెల 24 నుంచి పోటీలు ప్రారంభమవుతాయి. ఇందులో ప్రతిభ కనబర్చిన ఐదుగురిని ఎంపిక చేసి ఐపీఎల్ సన్‌రైజర్స్ జట్టులో స్థానం కల్పించనున్నారు.
 
 పేదరికం శాపం..
 ఈ పోటీల్లో పాల్గొనాలంటే ముందుగా తాను సభ్యుడుగా ఉన్న విశాఖపట్నం సన్ ఎస్‌ఆండ్‌ఎస్ జట్టుకు రూ.లక్ష డొనే షన్ చెల్లించాలని ప్రశాంత్ తెలిపాడు. పేద కుటుంబానికి చెందిన తాను అంత సొమ్ము చె ల్లించే స్థొమత లేదని చెప్పాడు. ఈ నెల 6,7 తేదీల్లో విరాళం చెల్లించాలని, లేనిపక్షంలో జట్టులో స్థానం కోల్పోతానని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలతో పా టు పాడేరు ఐటీడీఏ తనకు ఆర్థిక సాయం అందించాలని కోరాడు. స్పందించే దాతలు 94937 39024 నంబర్‌కు సంప్రదించాలని ప్రశాంత్ అభ్యర్థించాడు.
 
 జాతీయ జట్టులో ఆడాలన్నదే నా కల
 ప్రస్తుతం ఐపీఎల్ సన్‌రైజర్స్ జట్టులో స్థానం సంపాదించడమే ధ్యేయంగా సాధన చేస్తున్నాను. జాతీయ జట్టులో ఆడాలన్నది నా కల. గిరిజన కుటుంబంలో పుట్టిన నేను ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది.                    
 -గొర్లె వెంకటగిరి ప్రశాంత్
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)