amp pages | Sakshi

రగిలిన స్ఫూర్తి

Published on Fri, 11/27/2015 - 00:51

రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా  కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్‌లకు ఘనంగా నివాళులు
గుంటూరు నగరంలో ఘనంగా  రాజ్యాంగ ఆమోద దినోత్సవం
13 జిల్లాల నుంచి ర్యాలీకి తరలివచ్చిన  పార్టీ నాయకులు, కార్యకర్తలు
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తే    సహించబోమని ప్రభుత్వాలకు హెచ్చరిక

 
పట్నంబజారు (గుంటూరు) :  రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎండగట్టింది.  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించిన సమసమాజ స్థాపనే ధ్యేయంగా పార్టీ శ్రేణులు ఉద్యమ కెరటాల్లా కదిలారు.  రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించేందుకు తామున్నామన్న విషయాన్ని చాటి చెప్పారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని  వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో గురువారం గుంటూరు నగరంలో నిర్వహించిన భారీ ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది.


తొలుత  లాడ్జి సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్క ర్ విగ్రహానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రదర్శనను ప్రారంభించారు.  శంకర్‌విలాస్ సెంటర్, ఓవర్‌బ్రిడ్జి, ఏసీ, హిందూ కళాశాలల మీదుగా సాగిన ప్రదర్శన చివరకు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరానికి చే రుకుంది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా పోటెత్తారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుంటూరు నగరానికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగ ఫలాలు పేద ప్రజలకు అందకుండా, చట్టాన్ని వారికి అనుకూలంగా వాడుకుం టున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్నీతిని  ఈ సందర్భంగా ఎండగట్టారు. స్వార్థ రాజకీయాల కోసం,స్వలాభం కోసం రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తే సహించబోమని  పౌరుషాల పోతుగడ్డ గుంటూరు సాక్షిగా హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షకులు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజా సంఘాల నేతలు భారీ  ప్రదర్శనకు మద్దతుగా నిలిచారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి  కార్యకర్తలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్‌లు, మండల, గ్రామ అధ్యక్ష, కార్యదర్శలు, గుంటూరు నగర డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ విభాగాల నేతలు తరలివచ్చారు.

అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్‌లకు నివాళి ...
ప్రదర్శన అనంతరం శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు హిందూ కళాశాల కూడలిలోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి, సభ ప్రారంభం ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
 
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఉప్పులేటి కల్పన, శ్రీనివాసులు, పాలపర్తి డేవిడ్‌రాజు, నారాయణస్వామి, కంబాల జోగులు,  గుంటూరు నగరాధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, బండారు సాయిబాబు, కావటి మనోహరనాయుడు, నియోజకవర్గాల సమన్వయకర్తలు  రావి వెంకటరమణ, కత్తెర క్రిస్టీనా, అన్నాబత్తుని శివకుమార్,  బొల్లా బ్రహ్మనాయుడు, పి. హనిమిరెడ్డి, కత్తెర సురేష్‌కుమార్, రాష్ట్ర కార్యద ర్శి ఎండీ నసీర్‌అహ్మద్, నాయకులు పోలూరి వెంకటరెడ్డి, నూనె ఉమామహేశ్వరరెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి,  సయ్యద్‌మాబు, కొత్తా చిన్నపరెడ్డి, యేళ్ళ జయలక్ష్మి, అంగడి శ్రీనివాసరావు, మాలె దేవరాజు, డైమండ్‌బాబు, మండేపూడి పురుషోత్తం, జెడ్పీటీసీలు కొలకలూరి కోటేశ్వరరావు, ఎన్ సునీత, నగర అనుబంధ విభాగాల నేతలు శ్రీకాంత్‌యాదవ్, మెట్టు వెంకటప్పారెడ్డి, ఆరుబండ్ల వెంకటకొండారెడ్డి, గనిక ఝాన్సీ, పల్లపు రాఘవ, షేక్ జానీ, పానుగంటి చైతన్య, మేరాజోతు హనుమంతనాయక్, నాగం కాశీ విశ్వనాథం, మార్కెట్‌బాబు, కోట పిచ్చిరెడ్డి, దాసరి కిరణ్, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, అత్తోట జోసఫ్, శిఖా బెనర్జీ, గోళ్ల శ్యామ్‌ముఖర్జీ, యరమాల విజయ్‌కిషోర్, నందేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌