amp pages | Sakshi

సెల్‌టవర్‌పై ఆరుగురు.. గుణదలలో టెన్షన్.. టెన్షన్

Published on Sun, 11/26/2017 - 14:50

సాక్షి, విజయవాడ: కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు ఆందోళన కొత్త మలుపు తిరిగింది. గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఫాతిమా మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు, ఒక విద్యార్థి తండ్రి గుణదలలోని సెల్ టవర్ ఎక్కడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇవ్బకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలపై తమకు నమ్మకం పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల ఉపఎన్నిక సమయంలో సీఎం చంద్రబాబు తమకు వేరే కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు.

రేపు (సోమవారం) సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామంటూ కలెక్టర్ లక్ష్మీకాంతం వారికి నచ్చజెప్పినా విద్యార్థులు వినడం లేదు. తక్షణం వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సెల్ టవర్ వద్దకు వచ్చి మీడియా సమక్షంలో తమ సమస్య పరిష్కారంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు గంటలుగా విద్యార్థులు సెల్‌టవర్‌పై ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించక పోవడం సిగ్గుచేటని అక్కడికి చేరుకున్న వైఎస్ఆర్ సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. ఇప్పటివరకూ నాలుగుసార్లు సీఎం చంద్రబాబును కలిసినా ప్రయోజనం లేకపోయిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే వైఎస్ జగన్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కు లేఖ రాశారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు సెల్ టవర్ ఎక్కారని తెలిపారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

అసలు వివాదం ఏంటంటే..
'ఫాతిమా కాలేజీ 2015-16 బ్యాచ్‌ విద్యార్థుల అడ్మిషన్లను సరైన వసతులు లేని కారణంగా మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎమ్‌సీఐ) రద్దు చేసింది. తొలి రెండు దశల్లో నిర్వహించిన కౌన్సెలింగులో విద్యార్థుల చేరికకు ఎమ్‌సీఐ అనుమతి ఇవ్వలేదు. కాలేజీ యాజమాన్యం హైకోర్టు ఉత్తర్వులతో మూడో దశ కౌన్సెలింగులో 100 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. అనంతరం ఈ విద్యార్థుల సీట్లను ఎమ్‌సీఐ రద్దు చేసింది. దీంతో ఆ విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగిపోయింది. తమకున్న సీట్లలోని వంద సీట్లను ఏపీ ప్రభుత్వం ఇవ్వడానికి నిరాకరించడంతో ఇతర కాలేజీల్లో చేర్చాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌