amp pages | Sakshi

కాళేశ్వరంతో  ఆంధ్రాకు నష్టం లేదు

Published on Sat, 06/22/2019 - 10:25

సాక్షి, విజయవాడ : కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం లేదని రాష్ట్ర డ్రైనేజ్‌ బోర్డు మాజీ సభ్యులు, రైతు సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్‌ అభిప్రాయపడ్డారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణహితా – చేవెళ్ల అనే మెగా ప్రాజెక్టు చేపట్టిందని, 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును గోదావరి నది కాలువగా ఉపయోగించుకుని రివర్స్‌ పంపింగ్‌ ద్వారా రీడిజైన్‌ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిండని వివరించారు.

గోదావరి జల్లాల్లో తెలంగాణకు కేటాయించిన 936 టీఎంసీలలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు 350 టీఎంసీల నీటిని వినియోగించుకుంటారని తెలిపారు. ఈ నీటిని వినియోగించుకున్నా.. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తరువాత పోలవరం కుడి, ఎడమ కాల్వల ద్వారా సుమారు 300 టీఎంసీలు, దిగువన మరో 500 టీఎంసీల నీటికి ఢోకా ఉండదని తెలిపారు. గోదావరిలో జూన్‌ నుంచి అక్టోబర్‌ 10 వరకు 100 రోజుల్లో సుమారు 80 రోజులు మిగులు జలాలు ఉంటాయని వాటిని సద్వినియోగం చేసుకుని కృష్ణా – పెన్నా నదులకు తరలించాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ కలిసి వస్తే పులిచింతల ఎగువన కృష్ణానదిపై 2 బ్యారేజలు నిర్మించి సాగర్‌ టెయిల్‌పాండ్‌లోకి, అక్కడ నుంచి సాగర్‌లోకి నీటిని ఎత్తిపోయాలన్నారు. శ్రీశైలం వద్దకు చేరిన నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల ప్రాజెక్టులు ప్రణాళిక బద్దంగా వాడుకోవచ్చన్నారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పులో వెనులుబాటు కల్పించిన డెసిషన్‌–ఇంప్లిమెంటేషన్‌ బోర్డ్‌ ఏర్పరచుటకు వీలుగా సుప్రీం కోర్టులలోను బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందున్న దావాలను ఇరు రాష్ట్రాలు ఉపసంహరించుకోవాలన్నారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌