amp pages | Sakshi

ఇంగ్లీష్‌ మీడియం చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

Published on Mon, 12/16/2019 - 20:54

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయం ఒక చరిత్రాత్మక ఘట్టం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇక నుంచి రైట్‌ టు ఎడ్యుకేషన్‌ కాదని, రైట్‌ టు ఇంగ్లిష్‌ ఎడ్యుకేషన్‌ అని ఆయన స్పష్టం చేశారు. ఇందు కోసం తీసుకొచ్చిన ఏపీ ఎడ్యుకేషన్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు–2019తో, ఇక నుంచి ప్రతి పేద విద్యార్థికి ఇంగ్లిష్‌ మీడియమ్‌ను ఒక హక్కుగా తీసుకు వస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెడుతూ తీసుకొచ్చిన ఏపీ ఎడ్యుకేషన్‌ అమెండ్‌మెంట్‌ బిల్లుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభలో మాట్లాడారు. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ను రైట్‌ టు ఇంగ్లిష్‌ ఎడ్యుకేషన్‌గా మార్చబోతున్నామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. ఈ బిల్లు ప్రవేశ పెట్టడం ఒక చరిత్రాత్మక నిర్ణయం అన్న ఆయన, ఈ బిల్లుతో రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాల ఇక మీద ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌గా మారబోతుందన్నారు.

‘రాష్ట్రంలో అక్షరాలా 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 1 నుంచి 6వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం కాబోతున్నాయి. ఆ తర్వాత సంవత్సరం 7వ తరగతి, ఆ తర్వాత ఏడాది 8వ తరగతి, ఆ తర్వాత 9వ తరగతి, ఆ మరుసటి సంవత్సరం 10వ తరగతిని ఇంగ్లిష్‌ మీడియంగా మారుస్తున్నాం. ఆ విధంగా నాలుగేళ్లలో మన పిల్లలందరూ 10వ తరగతి బోర్డు పరీక్ష ఇంగ్లిష్‌ మీడియంలో రాసే విధంగా ఈ బిల్లు మార్చబోతున్నది. ఇది ఒక చరిత్రాత్మక బిల్లు అని తెలియజేస్తున్నాను’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనంతరం ఏపీ ఎడ్యుకేషన్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు–2019ను సభ ఆమోదించింది. ఆ తర్వాత స్పీకర్‌  తమ్మినేని సీతారాం సభను మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు.

Videos

వీడియో చూపించి షర్మిల బండారం బయటపెట్టిన పొన్నవోలు

పెమ్మసాని...కాసుల కహానీ

కూటమి మేనిఫెస్టోపై రాచమల్లు కామెంట్స్

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)