amp pages | Sakshi

నలు‘దిశ’లా రక్షణ!

Published on Mon, 03/09/2020 - 13:36

సాక్షి, గుంటూరు: “దిశ పోలీస్‌ స్టేషన్‌ల ఏర్పాటు ఓ చరిత్ర.. మహిళల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్‌ స్టేషన్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆరు పోలీస్‌ స్టేషన్‌లను ఇప్పటికే ప్రారంభించాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిగిలిన 12 స్టేషన్‌లను ప్రారంభించాం’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన అర్బన్‌ దిశ పోలీస్‌ స్టేషన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మహిళల భద్రత కోసం దిశ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడం పోలీస్‌ శాఖ చరిత్రలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. మహిళల భద్రత కోసం దిశ ఎస్‌ఓఎస్‌ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చిన 2020 సంవత్సరం “ఉమెన్‌ సేఫ్టీ’ సంవత్సరంగా నిలుస్తుందన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని చెప్పారు. దిశ చట్టం అమలులోకి వస్తే దిశ పోలీస్‌ స్టేషన్‌లు మరింత బలోపేతం అవుతాయన్నారు. దిశ పోలీస్‌ స్టేషన్లలో మహిళా డీఎస్పీలను నియమించాలనుకున్నామని, అయితే సరిపడా మహిళా అధికారులు అందుబాటులో లేరన్నారు. రాబోయే రోజుల్లో సమస్యను అధిగమించి మహిళా అధికారులను ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేట్‌ కార్యాలయాన్ని తలపించేలా దిశ పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. ప్రతి ఒక్కరూ ఈ–దిశ ఎస్‌ఓఎస్‌ యాప్‌ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు.

పోలీసు గౌరవ వందనం స్వీకరణ
దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన డీజీపీ ముందుగా పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించిన ఆర్‌ఎస్‌ఐ బాషాను అభినందించారు. అనంతరం మహిళా పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించి, పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. దిశ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు ఉన్నతాధికారుల విజిటర్స్‌ బుక్‌లో డీజీపీ తొలి సంతకం చేశారు. అనంతరం మహిళా పోలీసులతో, మహిళా మిత్ర వలంటీర్లతో మాట్లాడారు. కౌన్సిలింగ్‌ హాల్‌లో మహిళా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది, కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు రేంజ్‌ ఐజీ జె. ప్రభాకర్‌రావు, డీఐజీ అర్బన్‌ ఇన్‌చార్జి ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, రూరల్‌ జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయారావు, విజిలెన్స్‌ ఎస్పీ జాషువా, ఏఎస్పీలు గంగాధరం, ఈశ్వరరావు, మనోహర్‌లు, డీఎస్పీలు బి.సీతారామయ్య, బీవీ రామారావు, సుప్రజ, సౌజన్య, బాలసుంధర్‌రావు, రమణకుమార్, ప్రకాశ్‌బాబు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. దిశ పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఆర్థిక సాయం చేసిన ఐటీసీ సీఈవో సంజయ్‌ రంగరస్, డైరెక్టర్‌ వీరస్వామిను డీజీపీ ప్రత్యేకంగా అభినందిచి, కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు అర్బన్‌ కమిషనరేట్‌ ప్రతిపాదన పెండింగ్‌లో ఉందన్నారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, హోం మంత్రి సుచరితతో చర్చించామన్నారు.   

స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పోలీస్‌ శాఖ సన్నద్ధమై ఉందని డీజీపీ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించామన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత పోలింగ్‌ నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించామని, ప్రతిరోజూ ఎన్నికల నిర్వహణ, బందోబస్తు తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)