amp pages | Sakshi

డెర్మటాలజీ విభాగాభివృద్ధికి కృషి

Published on Sun, 10/19/2014 - 02:28

కర్నూలు(హాస్పిటల్):
 రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో డెర్మటాలజీ విభాగాభివృద్ధితో పాటు టీచింగ్ ఫ్యాక్టల్టీ సంఖ్య పెంపునకు కృషి చేస్తామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజు అన్నారు. శనివారం స్థానిక కర్నూలు వైద్య కళాశాలలోని న్యూఆడిటోరియంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్టు, వెనిరి యాలజిస్టు, ల్యాప్రోలాజిస్టు ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో 33వ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వైద్యులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన అనంతరం వైస్ ఛాన్స్‌లర్ మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని వైద్య కళాశాలల్లో టీచింగ్ సదుపాయాలను మెరుగు పరుస్తున్నట్లు చెప్పారు. డెర్మటాలజీ విభాగంలో టెక్నాలజీ పరంగా అభివృద్ధి ఎంతైనా అవసరమన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీలో 80వేల మంది సభ్యులు ఉన్నారని.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యులే కీలక భూమిక పోషిస్తున్నారన్నారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో లైబ్రరీ విభాగాన్ని మరింత విస్తృతం చేసి 80 జర్నల్స్, 2వేల పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు(ఆంధ్రప్రదేశ్) డాక్టర్ జి.శాంతారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ విభాగాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కర్నూలులో చర్మ వ్యాధుల విభాగానికి కొత్త బిల్డింగ్ నిర్మించే దిశగా చర్యలు చేపడతామన్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇటీవలే డాక్టర్ పోస్టుల భర్తీ చేపట్టామన్నారు. త్వరలోనే ప్రొఫెసర్ పోస్టుల భర్తీ పూర్తవుతుందన్నారు.

డెర్మటాలజీ వైద్యుల కొరత గ్రామీణ, రెవెన్యూ డివిజన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు(తెలంగాణ) మాట్లాడుతూ వయసును తగ్గించుకోవడంలో భాగంగా చర్మ సౌందర్యంపై అధిక శాతం ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. ఇదే అదునుగా కొందరు బ్యూటీ క్లీనిక్‌ల పేరిట దోచుకుంటున్నారన్నారు. చర్మ వ్యాధులకు అర్హత కలిగిన వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స పొందాలని సూచించారు. కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ఎస్.రాంప్రసాద్ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం డెర్మటాలజీలో సీటుపై ఆసక్తి కనబర్చే వారి సంఖ్య తక్కువగా ఉండేదని.. ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యత పెరిగిందన్నారు.

కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చర్మ వ్యాధులతో పాటు కాస్మొటిక్ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిం దన్నారు. సదస్సులో యువ వైద్యులు పాల్పంచుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం లభించిందన్నారు. అసోసియేషన్ నిర్వహణ చైర్మన్, కర్నూలు ప్రభుత్వాసుపత్రి చర్మ వ్యాధుల విభాగం అధిపతి డాక్టర్ ఐ.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చర్మ వ్యాధుల విభాగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

డ్రగ్స్ రియాక్షన్ కేసుల విషయంలో రోగులను ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదని.. ఈ కారణంగా ప్రభుత్వాసుపత్రిపై అధిక భారం పడుతోందన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి డాక్టర్ ఎస్.కొండారెడ్డి, కోశాధికారి డాక్టర్ వై.అరుణకుమారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జోజిరెడ్డి, కార్డియాలజిస్టు డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Videos

ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్

జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)