amp pages | Sakshi

తుపాను నష్టం రూ.850 కోట్లు

Published on Wed, 10/22/2014 - 01:37

 శ్రీకాకుళం పాతబస్టాండ్: హుదూద్ తుపాను, వరదలకు జిల్లాలో రూ.850 కోట్లకు పైగా పంట, ఆస్తినష్టం వాటిల్లిందని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ వెల్లడించారు. వ్యవసాయ సర్వే పూర్తి కాలేదని, పూర్తయితే ఈ నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండుమూడు రోజుల్లో తుపాను నష్టం వివరాల సేకరణ పూర్తవుతుందన్నారు. తుపాను బాధితులందరికీ ప్రభుత్వ ప్యాకేజీ అమలు చేస్తామని పేర్కొన్నారు.
 
 జియోట్యాగింగ్ లేనట్టే
 ఇప్పటికే పలు బృందాలు గ్రామల్లో సర్వేలు చేస్తున్నాయని, ఈ దఫా జీపీఆర్‌ఎస్(జియో ట్యాగింగ్) సర్వేను మినహాయించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం మెరుగు, వైద్య శిబిరాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బియ్యం పంపిణీ చేశామని, రెండు మూడు రోజుల్లో అందరికీ అందజేస్తామని చెప్పారు. కేవలం ప్రభావిత గ్రామల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ బియ్యం, ఉల్లి, నూనె, ఉప్పు వంటి నిత్యావసరాలు అందజేస్తామని తెలిపారు. ఈ సరుకుల పంపిణీలో అవినీతి జరగకుండా ఉండేందుకు విజిలెన్సు, పోలీస్ నిఘా ఉంటుందని, ఎవరైనా అవినీతికి పాల్పడితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. కూరగాయలకు ఇబ్బంది లేకుండా రైతు బజార్లులో కిలో రూ.3లకే విక్రయిస్తున్నామన్నారు. రెండు రోజుల్లో ఉల్లి, బంగాళ దుంపలు పంపిణీ చేస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో ఎప్పీ ఏఎస్ ఖాన్, విజిలెన్సు డీఎస్పీ ఆర్‌ఎస్ ఆర్‌కే రాజు డీఆర్‌లో నూరు బాషా కాశీం తదితరులు ఉన్నారు.
 

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)