amp pages | Sakshi

ఇదేంది చైర్మన్‌ గారూ..!

Published on Tue, 03/05/2019 - 19:22

సాక్షి, ప్రొద్దుటూరు టౌన్‌(వైఎస్సార్‌) :  ఐదు రోజుల క్రితం టీడీపీ 30వ వార్డు కౌన్సిలర్‌ సీతారామిరెడ్డిని ఫిబ్రవరి, మార్చి నెలల కౌన్సిల్‌ సమావేశాలకు రాకుండా సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన మున్సిపల్‌ చైర్మన్‌ ఆసం రఘురామిరెడ్డి ప్లేటు ఫిరాయించడం చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 28వ తేదీన కౌన్సిల్‌ సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా వేశారు. దీంతో మున్సిపల్‌ చైర్మన్‌కు దిక్కుతోచలేదు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల కోడ్‌ వస్తున్న నేపథ్యంలో ఈ కౌన్సిల్‌ సమావేశమే చివరిదిగా చెప్పుకుంటున్నారు. దీంతో కోరం లేక వాయిదా పడిన సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అత్యవసర కౌన్సిల్‌ సమావేశంగా ఏర్పాటు చేసినట్లు అజెండా రూపొందించి సోమవారం పంపిణీ చేశారు.

 
సస్పెండ్‌ రద్దు మొదటి అంశంగా...
అయితే ఈ అజెండాలో మొదటి అంశంగా సస్పెం డ్‌ అయిన టీడీపీ కౌన్సిలర్‌ జి.సీతారామిరెడ్డిని సస్పెండ్‌ నుంచి తొలగించేందుకు కౌన్సిల్‌ ముం దుంచారు. జనవరి 31న జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సిలర్‌ ప్రవర్తనకు చైర్మన్‌ మున్సి పల్‌ యాక్ట్, 1965 సెక్షన్‌ 51–5 ప్రకారం రెండు నెలలు సస్పెండ్‌ చేస్తూ ఫిబ్రవరి 27న నోటీసులు జారీ చేశారు. అయితే కౌన్సిలర్‌ 28న జరిగే కౌన్సిల్‌ స మావేశంలో సభ్యుల నిర్ణయానికి ఉంచాలని కోరా రు. కానీ ఎలాగైనా సీతారామిరెడ్డిని కౌన్సిల్‌ సమావేశానికి రాకుండా చేయాలని అజెండాలో ఈ అం శాన్ని చేర్చలేదు. కౌన్సిల్‌ సమావేశానికి ఎవ్వరూ రాక వాయిదా పడటంతో చైర్మన్‌ మార్చి నెల సమావేశం మొదటి అంశంగా చేర్చాలని చెప్పారు.

 
కౌన్సిల్‌ ఆమోదం లేకుండా సస్పెండ్‌ చేయడమేంటి సారూ..
కౌన్సిల్‌ సభ్యున్ని రెండు, మూడు నెలలు సస్పెండ్‌ చేయాలంటే సస్పెన్షన్‌కు ప్రతిపాదించిన మరుసటి సమావేశంలో కౌన్సిల్‌ ఆమోదం తీసుకోవాలని చట్టం చెబుతోంది. అయితే అదేదీ తమకు వర్తించదన్నట్లు, రెండు నెలలు సస్పెండ్‌ చేసిన చైర్మన్‌ వారం రోజులకే కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి అజెండాలోకి తీసుకురావడంపై తోటి కౌన్సిలర్లు నవ్వుకుంటున్నారు. తప్పుడు విధానాల్లో సస్పెండ్‌ చేసిన చైర్మన్, కమిషనర్లపై కోర్టులో పరువునష్టం దావా వేస్తామని కౌన్సిలర్‌ సీతారామిరెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు తీసుకున్నారని కౌన్సిల్‌ సమావేశానికి గైర్హాజరైన కౌన్సిలర్లు అంటున్నారు.

 
ముక్తియార్‌ మాటపై నిలబడతారా...
టీడీపీ కౌన్సిలర్‌ సీతారామిరెడ్డిని సస్పెండ్‌ చేసిన సందర్భంలో కౌన్సిలర్‌ ముక్తియార్‌ స్వగృహంలో మీడియాతో మాట్లాడారు.  ఇక తాము ఏ కౌన్సిల్‌ సమావేశాలకు వెళ్లమని, అన్నీ రిక్విజేషన్‌ సమావేశాలే నిర్వహిస్తామని చెప్పారు. ఇదే విధంగా మంగళవారం జరిగే సమావేశానికి ఎంపీ రమేశ్‌ వర్గం టీడీపీ కౌన్సిలర్లు హాజరు కాకుండా మాట నిలబెట్టుకుంటారా, లేక అంతా ఉత్తుత్తి ప్రకటనలేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
 

మెజారిటీ లేకుండానే ర్యాటిఫై...
చైర్మన్‌ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని కొన్ని అంశాలను ర్యాటిఫై చేయాలని అనుకుంటే మెజారిటీ కౌన్సిల్‌ సభ్యులు తన వర్గంలో ఉండాలి. అప్పుడు ఆ అంశం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పోతుంది. అయితే ఈ చైర్మన్‌ వర్గంలో 9 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఎంపీ రమేశ్‌ వర్గంలో 21 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చైర్మన్‌ రెండో అంశంలోని రూ.39.88 లక్షల పనికి,  3వ అంశంలోని రూ.39 లక్షల పనికి, 6వ అంశంలోని రూ.39 లక్షల పనికి దాదాపు రూ.కోటికిపైగా పనులకు ర్యాటిఫై చేశారు. మరి కౌన్సిల్‌ సభ్యులు ఈ అంశాలను రద్దు చేయాలనో, వాయిదా వేయాలనో కోరితే పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది. చైర్మన్‌ చర్యలపై భగ్గుమంటున్న టీడీపీ కౌన్సిలర్లు ఈ అంశాలను ఆమోదిస్తారో లేదో వేచి చూడాలి. 

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)