amp pages | Sakshi

ఉయ్యాలలు కట్టాలని ఆదేశాలు.!

Published on Sat, 09/01/2018 - 12:43

గుంటూరు మెడికల్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పేర్లను హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా ఆగస్టు 15 నుంచి మార్పు చేశారు. ఆరోగ్య కేంద్రాలకు పసుపు రంగు పూయాలని ఉత్తర్యుల్లో పేర్కొనటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ఆరోగ్య కేంద్రానికి పేర్లు మార్పు చేసి, కొద్దిపాటి రంగులు వేసినందుకు సుమారు రూ.40వేలు కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రోగులకు మందులు ఇతర అవసరాల కోసం వాడాల్సిన నిధులను ఆరోగ్య కేంద్రాలకు పెయింటింగ్స్‌ పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే...
జిల్లాలోని పెదనందిపాడు, వెనిగండ్ల, వట్టిచెరుకూరు, గొట్టిపాడు, కాట్రపాడు, పెదపలకలూరు ఆరోగ్య కేంద్రాలకు ఇటీవల కాలంలో పేర్లు మార్పు చేశారు. ఆరోగ్య కేంద్రం ముందు ఉన్న ప్రహారీకు రంగులు వేసి, స్టిక్లర్లు అంటించి ఆగస్టు 15 నుంచి ఆరోగ్య కేంద్రాలను హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్పు చేస్తున్నట్లు వైద్యాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాలో 86 ఆరోగ్య కేంద్రాలు ఉండగా వాటిల్లో 32 ఆరోగ్య కేంద్రాలను వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్పు చేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు. సెప్టెంబర్‌ 15 నుంచి 32 ఆరోగ్య కేంద్రాల్లో నాన్‌ కమ్యూనకబుల్‌ డిసీజ్‌( ఎన్‌సీడీ) కార్యక్రమంలో భాగంగా మెన్‌మాస్టర్‌హెల్త్‌ చెక్‌అప్‌ ప్రారంభించాలని జిల్లా వైద్యాధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఎంపీహెచ్‌ఎస్‌( మేల్‌), ఎంపీహెచ్‌ఈఓలు స్క్రీనింగ్‌ చేసి ప్రతి శనివారం ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉంది. అయితే జిల్లా వైద్యాధికారులు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎన్ని ఆరోగ్య కేంద్రాలకు రంగులు వేయాల్లో తెలియజేయకుండా అన్ని ఆరోగ్య కేంద్రాలకు అని పేర్కొనటంపై గందరగోళం నెలకొంది. పెయింటింగ్‌ పనులను టెండర్ల ద్వారా లేదా కొటేషన్ల ద్వారా అప్పగించకుండా ఓ పెయింటింగ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించారని సమాచారం. కాంట్రాక్టర్‌ అన్ని ఆరోగ్య కేంద్రాలకు ఫోన్‌లు చేసి పెయింటింగ్స్‌ వేసేందుకు వస్తున్నామని సిద్ధంగా ఉండాలని ఫోన్‌లు చేస్తున్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి సైతం కాంట్రాక్టర్‌కు వత్తాసుగా ఫోన్‌లు చేస్తూ పెయింటింగ్స్‌ వేయించుకోవాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఆస్పత్రి అభివృద్ధి సంఘం అనుమతి తీసుకుని పెయింటింగ్స్‌ వేయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా నేరుగా  ఒకే కాంట్రాక్టర్‌ అన్ని ఆరోగ్య కేంద్రాలకు పసుపు రంగు వేసి నిధులు నొక్కేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

సిబ్బంది లేకుండా ఎలా....
ప్రభుత్వం, అధికారులు ఆరోగ్య కేంద్రాల్లో నూతనంగా ఏ ఒక్కరిని నియమించకుండా కొత్త కొత్త ఆరోగ్య కార్యక్రమాలను ప్రవేశపెట్టి సిబ్బందిపై ఒత్తిడిని పెంచుతున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వైద్య పరికరాలను ఇవ్వకుండా, వైద్య సిబ్బందిని నియమించకుండా ఆరోగ్య కేంద్రాల్లో నూతన వైద్యసేవలను అందిస్తామని ప్రగల్భాలు పలికితే ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది, వైద్యసేవలకు వచ్చే రోగులు ఇబ్బంది పడటం మినహా ఎలాంటి ప్రయోజనం చేకూరదని సిబ్బంది వాపోతున్నారు. కార్యక్రమాల పేర్లుతో సున్నాలు వేస్తూ నిధులు ఖర్చుచేసే బదులు కనీసం కాంట్రాక్ట్‌లో నైనా కొంత మంది సిబ్బందిని నియమించి మందులు, వైద్య పరికరాలు ఆరోగ్య కేంద్రాలకు అందిస్తే మెరుగైన వైద్యసేవలను గ్రామీణ పేద రోగులకు అందించే అవకాశం ఉంది. ప్రభుత్వం, వైద్యాధికారులు ఆ దిశగా ఆలోచనలు చేయాలని వైద్య సిబ్బంది, రోగులు కోరుతున్నారు.

ఉయ్యాలలు కట్టాలని ఆదేశాలు.!
ఆరోగ్య కేంద్రాల్లో  కాన్పు కోసం వచ్చి పుట్టిన బిడ్డను ఎవరైనా వదలి వెళ్లాలనుకుంటే వారు ఎక్కడ పడితే అక్కడ బిడ్డలను వదిలి వెళుతున్నారు. అలా కాకుండా ఆరోగ్య కేంద్రాల్లో ఉయ్యాలలు కడితే బిడ్డలను వదలివేయాలనుకునే వారు ఉయ్యాలలో వదిలిపెట్టి వెళ్తే వారిని శిశు సంక్షేమశాఖ అధికారులు పెంచేందుకు తీసుకెళ్తారనే ఉద్ధేశంతో ఆరోగ్య కేంద్రాల్లో ఉయ్యాలలు కట్టాలని ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారులు ఆరోగ్య కేంద్రాల్లో ఉయ్యాలలు కట్టాలని ఆదేశాలు ఇవ్వటంపై వైద్య సిబ్బంది ఆశ్చరాన్ని వ్యక్తం చేయటంతో పాటుగా విమర్శలు చేస్తున్నారు. ఏ నిధుల నుంచి ఉయ్యాలలను కొనుగోలు చేయాలో చెప్పకుండా ఉయ్యాలకు రక్షణగా ఎవరు ఉండాలో చెప్పకుండా ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇవ్వటమేమిటని ప్రశ్నిస్తున్నారు. వైద్యం చేయాల్సిన సిబ్బంది ఉయ్యాలకు కాపలాగా ఎలా ఉంటారని మండిపడుతున్నారు. కాగా ఈ విషయాలపై సాక్షి వివరణ కోరేందుకు డీఎంహెచ్‌ఓకు ఫోన్‌ చేయగా ఆమె సెలవులో ఉండటంతో స్పందించలేదు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)