amp pages | Sakshi

ఇచ్చుకున్నోళ్లకే న్యాయం!

Published on Sat, 01/31/2015 - 02:01

ధర్మవరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మితిమీరిన అవినీతి!
చేయి తడపందే ఏ పనీ జరగని వైనం
స్టేషన్‌కు వెళ్లాలంటేనే  జంకుతున్న సామాన్యులు

 
 
ధర్మవరం : ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్ అవినీతికి చిరునామాగా మారింది. కింది స్థాయి నుండి పైస్థాయి వరకు మామూళ్లు ముట్ట జెప్పందే ఇక్కడ ఏ పనీ జరగదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలవంతులకే న్యాయం జరుగుతోందనే ఆరోపణలు పెరుగుతున్నారుు. ప్రతి రోజు పంచాయితీలు నిర్వహించడం, ఇరు వర్గాల నుండి డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల బెంగళూర్ నుండి ధర్మవరం వచ్చి రేషం వ్యాపారం చేసే వ్యాపారులను ఓ పోలీసు అధికారి అటకాయించి.. జీరో వ్యాపారం చేస్తున్నారంటూ బెదిరించినట్లు సమాచారం. అందుకు సదరు వ్యాపారులు చేనేత అనుబంధ రంగాలకు వ్యాట్, ట్యాక్స్‌లకు మినహాయింపు ఉంటుందని ఎంత చెప్పినా వినిపించుకోకుండా అరెస్ట్ చేయండంటూ బెదిరించినట్లు తెలిసింది. దీంతో మధ్యవర్తిత్వం నెరిపిన కొందరు పెద్ద మనుషులు బేరం కుదిర్చి కొంత మొత్తం ఇప్పించినట్లు సమాచారం.దీంతో వ్యాపారులు అప్పటి నుండి ధర్మవరం రావాలంటేనే జంకుతున్నారు. పట్టణంలోని డాబాలలో మద్యం సరఫరా యథేచ్చగా సాగుతోంది.

సదరు డాబా నిర్వాహకులు పోలీసులకు నెలవారీ మామూళ్లు ముట్టజెప్తున్నట్లు సమాచారం. దీంతో డాబాల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారం రేట్లు పెంచి మద్యం విక్రయాలు సాగిస్తూ డాబాలను కాస్తా బార్ అండ్ రెస్టారెంట్లుగా మార్చేస్తున్నారు. ఓ డాబా నిర్వాహకుడు రింగ్ మాస్టర్‌గా వ్యవహరిస్తూ ఎలాంటి ఇక్కట్లు రాకుండా చూసుకుంటున్నారు.

వివిధ కారణాలతో అరెస్ట్ అరుు్య స్టేషన్‌లో ఉన్న వారిని చూడాలని వెళ్లిన వారి కుటుంబ సభ్యులు, బంధువులను స్టేషనరీ ఖర్చులంటూ పోలీసులు జలగల్లా పీడిస్తున్నారు. పేపర్లు అంటూ కొందరితో, మెస్ బిల్లులంటూ మరికొందరితో డబ్బులు వసూలు చేస్తున్నారు.

పట్టణంలో మట్కా మూడు పువ్వులు, ఆరు కాయల్లా విరాజిల్లుతోంది. మట్లా నిర్వాహకులు ప్రతి నెలా పోలీస్‌స్టేషన్‌కు కొంత మామూళ్లు ముట్ట జెప్పి నిర్భీతిగా వారి పని వారు చేసుకుపోతున్నారు. ప్రజల దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవడం కోసం అడపా దడపా ఒకరిద్దరిపై తూతూ మంత్రంగా కేసు నమోదు చేస్తున్నారు. ఇలాగైతే ఉన్నతాధికారుల నుంచి ఇక్కట్లుండవనే ఎత్తుగడ వేశారు. పోలీసుల నిర్లక్ష్యంతో నిరుపేదలు మట్కాకు బానిసలై సంసారాలు గుల్ల చేసుకుంటున్నారు.

వరుస దొంగతనాలతో పట్టణ వాసులకు నిద్ర కరువైంది. సగటున వారానికి రెండు దొంగతనాలు పట్టణంలో జరుగుతున్నాయి. ఒకే రోజు తారకరామాపురంలో ఐదిళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. రూరల్ పీఎస్ పక్కనే ఉన్న కిరాణ బంక్‌లో చోరీ జరగడం పోలీసుల పనితీరును ఎత్తిచూపుతోంది. బాధితులు నిర్భయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకున్నామని ఓ వైపు ఆ శాఖ ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నా ఇక్కడి పోలీసుల్లో మార్పు కనిపించడం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు.

కాగా, పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పరిస్థితిపై సీఐ భాస్కర్‌గౌడ్‌ను వివరణ కోరగా.. అవినీతిని ప్రోత్సహించే ప్రసక్తే లేదన్నారు. అలాంటి పరిస్థితి లేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

#

Tags

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)