amp pages | Sakshi

‘దేశం’లో కులకలం

Published on Tue, 09/11/2018 - 13:42

అధికార పార్టీలో కుల చిచ్చు కలవరపెడుతోంది. అధికార పెత్తనంపై తిరుగుబాటు రాజకీయ సమరానికి తెరలేచింది. పార్టీ అధినేత సామాజిక వర్గానికి చెందిన నేతలు సమావేశమై పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, జిల్లా పార్టీలో మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రల ప్రాధాన్యం, పెత్తనంపై సదరు నేతలు లేవనెత్తిన అంశాలు ఇప్పుడు పార్టీలో హాట్‌టాపిక్‌గా మారాయి. టీడీపీ అంటేనే ఆ సామాజికవర్గానిదే అనే రీతిలో ఆ నేతల వ్యవహార శైలి ఉండటంతో ఈ పరిమాణాలు ఎలా దారితీస్తాయోనని పార్టీ నేతలు కలవరపడుతున్నారు. ముఖ్యంగా నాలుగున్నరేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న కులాల పోరు ఎన్నికల వేళ బహిర్గతం కావడం, అది కూడా పొరుగు జిల్లాలో రహస్య సమావేశం నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే సమావేశ నిర్వహణకు తెరవెనుక ప్రోత్సాహం ఇచ్చింది ఎవరు, ఎవరిని టార్గెట్‌ చేసి సమావేశం నిర్వహించారనే దానిపై పార్టీ నేత టీడీ జనార్దన్‌ ఆరా తీసినట్లు సమాచారం. మంగళవారం విజయవాడకు రావాలని ఆదాలకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చినట్టు తెలిసింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీ అధినేత సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలు పదుల సంఖ్యలో ఉన్నారు. సాధారణంగా జిల్లాలో అధికార పార్టీ సామాజిక వర్గం కాకుండా మరో కీలక సామాజిక వర్గ నేతలే దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కురగుండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావుతో పాటు ఆత్మకూరు మాజీ ఇన్‌చార్జి కన్నబాబు, పార్టీ నేతలు గంగాప్రసాద్, బొల్లినేని కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడుతో పాటు సామాజిక వర్గానికి చెందిన మండలస్థాయి నేతలు, ఇతర పదవుల్లో ఉన్న నేతలు ఆదివారం తిరుపతిలో సమావేశం నిర్వహించారు. వాస్తవానికి నాలుగు రోజుల ముందే ఈ సామాజిక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు నేతృత్వం వహించేలా ముందుగానే సిద్ధం చేసి ఆ మేరకు నడిపించారు. ఇది కూడా జిల్లా మంత్రి సోమిరెడ్డి చంద్రమోన్‌రెడ్డి సూచనతోనే జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తిరుమల దర్శనానికి వచ్చిన కర్ణాటక మంత్రికి విందు ఏర్పాటు చేశారు. ఈ విందు అనంతరం ఆ సామాజికవర్గ సమావేశంలో నేతలు పరోక్షంగా కొందరి తీరును తప్పుబట్టారు.

సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు తమ ఆవేదనను ఇతర నేతల వద్ద వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో 8 మంది ఎస్సైలను మారిస్తే ఇద్దరి విషయం మాత్రమే తనకు తెలుసునని, ఇది తనకు ఇస్తున్న ప్రాధాన్యత అని బొల్లినేని ఆవేదన వ్యక్తం చేయగా,  వెంకటగిరి నియోజకవర్గంలో పనులు, పదవులు తనతో నిమిత్తం లేకుండా వేస్తున్నారని కురుగండ్ల ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం షెడ్యూల్‌ తీసుకుని రూ.కోట్లు ఖర్చు పెట్టి మరీ మా ఇంట్లో పెళ్లి చేస్తే కనీసం లోకేష్‌ కూడా కార్యక్రమానికి హాజరుకాలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తమ నియోజకవర్గంలో 100 ట్రాక్టర్లు ఇస్తే 95 ట్రాక్టర్లు పాత కాంగ్రెస్‌ నేతలకే ఇస్తే తాము ఎలా రాజకీయాలు చేయాలని ఆత్మకూరు మాజీ ఇన్‌చార్జి కన్నబాబు ఆకోశ్రం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉంటే తన నియోజకవర్గంలో కొత్త నేతను జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ప్రోత్సహిస్తున్నారని బొల్లినేని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తం మీద సొంత కులానికే జిల్లా పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని ముగ్గురు నేతలు అభిప్రాయపడి 19న మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. సమావేశానికి హజరైన మిగిలిన నేతలు వీరి వ్యాఖ్యలపై మాట్లాడకుండా మౌనం వహించినట్లు తెలిసింది. బొల్లినేని కృష్ణయ్య మాత్రం ఇవ్వన్ని సరికావని సూచించినట్లు తెలుస్తోంది.  

ఆదాలతో సీఎం గంటలు గంటలు ఎలా మాట్లాడతారు
ఈ సమావేశంలో కన్నబాబు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డిని టార్గెట్‌ చేసి మాట్లాడారని తెలిసింది. దీనికి మిగిలిన ఎమ్మెల్యేలు మౌనం వహించటంతో పాటు ఎవరి బాధలు వారు వెళ్లగక్కటంతో కొత్త కుల రాజకీయానికి తెరలేచింది. మనం సీఎం అపాయింట్‌మెంట్‌ కోరితే ఇవ్వని చంద్రబాబునాయుడు ఆదాల ప్రభాకరెడ్డికి గంటలు గంటలు ఆపాయింట్‌మెంట్‌ ఇవ్వటం, నెల్లూరు పార్లమెంట్‌పై పూర్తి పెత్తనం అప్పగించడం ఏమిటని నేతలు ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తం మీద టార్గెట్‌ ఆదాలగా సామాజిక కుల సమావేశం జరగ్గా పనిలో పనిగా బీద రవిచంద్రపైన ఎమ్మెల్యేలు ఫైర్‌ అవ్వటంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ నేత టీడీ జనార్దన్‌ జరిగిన పరిణమాలపై ముఖ్య నేతలతో మాట్లాడి సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఈ నెల 19న మళ్లీ సమావేశం అనంతరం సీఎంను కలవాలని ఇద్దరు ఎమ్మెల్యేలు, కన్నబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

#

Tags

Videos

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)