amp pages | Sakshi

కనికరించని జూలై !

Published on Thu, 07/31/2014 - 05:07

  • ఖరీఫ్‌లో 4 నెలల్లో   నమోదు కాని సగటు వర్షపాతం  
  •  ఆగస్టులో వర్షంపై అనుమానాలు
  •  రైతుల ఆశలు ఆవిరి
  • బి.కొత్తకోట: ఖరీఫ్ సేద్యానికి జూలైలో కురిసే వర్షపాతమే కీలకం. అన్నిపంటల సాగుకోసం రైతులు ఈ నెలలో కురిసే వర్షంపైనే ఆశలుపెట్టుకుంటారు. అయితే పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉండడంతో వ్యవసాయం ఆగిపోతోంది. జూలైలో జిల్లాలో సగటు వర్షపాతం 101.9 మిల్లిమీటర్ల వర్షం కురవాల్సి ఉంది.  బుధవారం నాటికి కేవలం 62.3 మిల్లిమీటర్ల వర్షపాతమే నమోదైంది. ప్రధానంగా పడమటి మండలాల్లో సేద్యం దయనీయంగా మారింది.

    పంటలు పెట్టిన రైతులు.. పంటలు పెట్టని రైతులు వర్షంకోసం ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గడచిన నాలుగు నెలల్లో ఒక్క నెలలో కూడా సగటు వర్షపాతం నమోదు కాలేదు.  గత సంవత్సరం రెండు నెలల్లో సగటుకు మించిన వర్షం నమోదైంది. ఈ ఏడాది సగటు వర్షం మాటేలేదు. ఇది వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా సాగు సాధ్యం కావడంలేదు. ఖరీఫ్ పంటలపై ఆధారపడిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    పొలాలను బీళ్లుగా ఉంచుకుని ఆవేదన చెందుతున్నారు. వరుస కరువులు, పంటల నష్టాలతో అల్లాడిపోతున్న రైతులకు ఈ పరిస్థితులు మింగుడు పడడంలేదు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు 2,11,582 హెక్టార్లలో సాధారణ సాగు కావాలి. అయితే బుధవారం నాటికి 1,59,310 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి.

    వేరుశెనగపంటను 1,36,479 హెక్టార్లలో సాగుకావాల్సి ఉండగా 1,10,954 హెక్టార్లలో సాగుచేశారు. మిగిలిన భూములన్నీ ఇంకా బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. గత ఖరీఫ్‌లో జూలై 30 నాటికి జిల్లావ్యాప్తంగా 1,18,857 హెక్టార్లలో వేరుశెనగ పంటను సాగుచేశారు. గత ఏడాది కంటే ప్రస్తుతం 7,903 హెక్టార్లలో సాగు తగ్గింది.
     

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌