amp pages | Sakshi

‘దిశ’ నిర్దేశం

Published on Fri, 12/27/2019 - 04:29

దిశ చట్టం అమలుకు ఏం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేకంగా ఒక ఐపీఎస్‌ అధికారిని నియమించి, రాష్ట్రంలోని 18 మహిళా పోలీసుస్టేషన్లను ఈ అధికారి కిందకు తీసుకువచ్చేలా చూడండి. ఈ చట్టం అమలుకు వ్యవస్థలన్నీ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి. స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ తయారు చేయాలి. వీలైనంత త్వరలో ఇవి పూర్తి కావాలి.– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ దండన విధించేలా తాజాగా తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం అమలుకు రాష్ట్ర పరిధిలో అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితరులతో ఈ విషయమై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. న్యాయపరంగా, పోలీసుపరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నదానిపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు జిల్లాకు ఒకటి చొప్పున 13 ప్రత్యేకకోర్టులకు అవసరమైన బడ్జెట్‌ను వెంటనే కేటాయించాలని సీఎం ఆదేశించారు. ప్రతి కోర్టుకూ సుమారు రూ.2 కోట్లు అవసరం అవుతాయని అధికారులు పేర్కొనగా వారం రోజుల్లోగా డబ్బును డిపాజిట్‌ చేయాలని చెప్పారు. 13 మంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేయాలని సూచించారు.

వైజాగ్, తిరుపతిలో కొత్తగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు
రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రస్తుతం ఉన్న ఫోరెన్సిక్‌ విభాగాన్ని రెట్టింపు చేయడం.. వైజాగ్, తిరుపతిలో కొత్తగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారు. ఈ ఫోరెన్సిక్‌ ల్యాబుల్లో 176 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని డీజీపీ పేర్కొనగా.. ఇందుకోసం జనవరి 1న నోటిఫికేషన్‌ జారీ చేయాలని సీఎం స్పష్టం చేశారు. జిల్లాల్లోని మహిళా పోలీస్‌స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలను డీజీపీ.. ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు.  రాష్ట్రంలోని 18 మహిళా పోలీస్‌స్టేషన్లలో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు సపోర్టు సిబ్బందిని ఏర్పాటు చేయాలన్న డీజీపీ ప్రతిపాదనలకు  సీఎం వెంటనే అంగీకారం తెలిపారు. ఈ పోలీసుస్టేషన్లలో మౌలిక సదుపాయలు, ఇతరత్రా అవసరాల కోసం నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు.

వన్‌ స్టాప్‌ సెంటర్లలో మహిళా ఎస్‌ఐ నియామకం
ప్రతి జిల్లాలో ఉన్న వన్‌ స్టాప్‌ సెంటర్ల (హింస, లైంగిక దాడులకు గురైన మహిళలను ఆదుకునేందుకు)ను మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ సెంటర్లలో ఇప్పుడున్న సిబ్బందితోపాటు ఒక మహిళా ఎస్‌ఐని నియమించడానికి ఆమోదం తెలిపారు. వేధింపులకు గురవుతున్న మహిళలు కాల్‌ చేయాల్సిన కాల్‌ సెంటర్, యాప్, వెబ్‌సైట్ల పనితీరును సమీక్షించారు. సురక్ష స్పందన యాప్‌ తయారు చేశామని, మొత్తం 86 రకాల సేవలు అందుతాయని, దీనిని త్వరలోనే ప్రారంభిస్తామని డీజీపీ వివరించారు. 100, 112 నంబర్లను ఇంటిగ్రేట్‌ చేయాలని, దీంతో పాటు దిశ యాప్‌ కూడా పెట్టాలని, ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి సూచించారు.
 
ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న చర్యలపై దుష్ప్రచారం
ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదన్న ఏకైక అజెండాతో చాలా మంది పని చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. కేవలం టీడీపీతోనే కాకుండా టీడీపీ అనుకూల మీడియాతో, చంద్రబాబుకు మద్దతిస్తున్న వారితో మనం పోరాటం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘పేదల కోసం ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు ప్రవేశ పెడుతున్నాం.. మద్యం మహమ్మారిని పారదోలాలనే ఉద్దేశంతో తొలిదశలో పలు చర్యలు తీసుకున్నాం.. మద్యం నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలను తగ్గించాం.. పర్మిట్‌ రూమ్‌లను నిషేధించాం.. బెల్టుషాపులను ఏరివేశాం.. బార్ల సంఖ్యనూ తగ్గించాం.. ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ చర్యలపై కూడా ఎలాంటి ప్రచారం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం..’ అని సీఎం అన్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)