amp pages | Sakshi

చిన్నారి కంటికి ఏమైంది..

Published on Sat, 12/21/2019 - 12:17

చిన్నప్పుడు పిల్లల కంటి సమస్యను గుర్తించడం కష్టం..నిశితంగా తల్లితండ్రులు వారి చూపును పరిశీలిస్తే తప్ప సమస్య బయటపడదు. కొందరు టీవీ లేదా పుస్తకం దగ్గరగా పెట్టుకుని చూస్తుంటారు. మరికొందరికి కంటి నుంచి తరచూ నీరుకారుతుంది. మరికొందరు రెప్పలు ఆడిస్తూ ఉంటారు. చిన్న సమస్యేలే.. వయసు పెరిగే కొలదీతగ్గిపోతుందని తల్లితండ్రులుసమాధానపడుతుంటారు.అంతేకాని వైద్యుని దగ్గరకుతీసుకువెళ్ళరు. ఇలాంటి పిల్లలకుఆదిలోనే వైద్యం చేయిస్తే కంటిని కాపాడిన వారిమమవుతాం. ఈ బాధ్యతను కీలకంగా భావించి రాష్ట్రప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైతే ఆపరేషన్లు సైతం ఉచితంగా చేయాలని సంకల్పించింది.

సాక్షి కడప : ఆహారంలో సమతుల్యత లోపమో.... జన్యుపరమైన సమస్యో...పుట్టుకతోనే వచ్చిన ఇబ్బందో తెలియదుగానీ జిల్లాలో అనేకమంది చిన్నారులు కంటికి సంబంధించిన లోపంతో అల్లాడుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించి వైఎస్సార్‌కంటి వెలుగు పథకం ద్వారా చికిత్స చేసి కొత్త వెలుగులు ప్రసాదిస్తోంది ప్రభుత్వం. అక్టోబరు 10 అంధత్వ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించిన ఈపథకం విజయవంతంగా కొనసాగుతోంది. మొదటి విడతలో 4,24,000 మంది విద్యార్థులను పరిశీలించి కంటి సమస్యలున్న చిన్నారులను గుర్తించి సరిదిద్దేందుకు సమాయత్తమవుతున్నారు. 

13 వేల మందికి కంటి అద్దాలు అవసరం
ఇప్పటివరకు తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో విద్యార్థులకు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ, పాఠశాల ఉపాధ్యాయులు పరీక్షలు చేపట్టారు. అందులో 32,005 మందికి కంటిచూపు సమస్యలను గుర్తించారు. ఆప్తాలమిక్‌ అసిస్టెంట్లు పాఠశాలల వారీగా వారికి మరోసారి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి లోపాన్ని గుర్తించారు.  27 వేల మంది చిన్నారులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించగా 13 వేల మందికి కంటి అద్దాలు అవసరమని పక్కాగా లెక్క తేల్చారు. ముంబయికి చెందిన ఓ సంస్థ ద్వారా కంటి అద్దాలను అందజేస్తున్నారు. ఆప్తాలమిక్‌ అసిస్టెంట్లు చిన్నారులను పరిశీలించిన అనంతరం అక్కడి నుంచే నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా కంటికి సంబంధించిన వివరాలు పొందుపరిచి ఫలానా సైజులో అద్దాలు అవసరమని సమాచారం ఇస్తున్నారు. తదనంతరం అద్దాలు ముంబయి నుంచి సోమవారం కడపకు చేరుకోగానే....దాదాపు రెండు వేల మందికి అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

2000 మందికి కంటి వ్యాధులు
ప్రత్యేక పరీక్షలు నిర్వహించిన వారిలో రెండు వేల మంది కంటి వ్యాధులతో బాధపడుతున్నారు.కంటిలో గుల్లలు,  పొరలు, శుక్లాలు, రే చీకటి, కనుగుడ్డు సమస్య, మెల్లకన్ను, కార్నియా సంబంధిత వ్యాధులతో ఉన్నట్లు లెక్క తేల్చారు. వీరందరికీ కడప రిమ్స్, ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఆపరేషన్లు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. అందరికీ ఆపరేషన్లు అవసరం లేకపోయినా ప్రత్యేక చికిత్సల ద్వారా వ్యాధులను నయం చేసేందుకు వైద్యాధికారులు సిద్దమయ్యారు. జనవరి 15వ తేదీలోపు అన్ని చికిత్సలను పూర్తి చేయనున్నారు. అద్దాలు అవసరమైన వారికి కూడా ఆ గడువులోపు అందజేసేందుకు ప్రణాళిక రచించారు.ప్రత్యేక పరీక్షలు అవసరమైన మరో ఐదు వేల మంది పరీక్షలకు రోజూ 30 వైద్య బృందాలు పనిచేస్తున్నాయి. వారం రోజుల్లో పూర్తవుతాయి. జనవరి 15 తరువాత పెద్దలకు కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలి దశలో రాజంపేట డివిజన్‌లో ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించేందుకు వైద్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఆరు నెలలపాటు అక్కడ కంటి సమస్యలున్న వారికి పరీక్షలు మొదలుకొని ఆపరేషన్ల వరకు అన్నీ చేయనున్నారు. ఇలా మూడు విడతల్లో 2021 నాటికి జిల్లా అంతటా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఏది ఏమైనా జిల్లాను కంటి సమస్య రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

బాల్యంలోనే కంటి సమస్యలను గుర్తించేందుకు నడుం బిగించిన ప్రభుత్వం
వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం ప్రారంభం
తొలిదశలో విద్యార్థులందరికీ పరీక్షలు పూర్తి
కంటి అద్దాలు అవసరమైన వారు గుర్తింపు
కొందరికి ప్రత్యేక వైద్య చికిత్సలు
ముంబయి నుంచి వస్తున్నకంటి అద్దాలు
జనవరి 15నుంచి పెద్దలకూ పరీక్షలు
జిల్లాలో 32,005 మందికి కంటి సమస్యలు
27 వేల మంది విద్యార్థులకు పూర్తయిన పరీక్షలు
13 వేల మందికి కంటి అద్దాల అవసరం
23 నాటికి ముంబయినుంచి వస్తున్న అద్దాలు
2000 మందికిపైగా ప్రత్యేకవైద్యం
ఇప్పటికే4425పాఠశాలల్లో4,24,000మందికి పరిశీలన
జనవరి 10లోపుఆపరేషన్లు పూర్తికికసరత్తు

ఆపరేషన్లకు ఏర్పాట్లు
 రెండు వేల మందికి పైగా చిన్నారుల కళ్లలో పెద్ద సమస్యలు ఉన్నాయి...వాటికి పరిష్కారం చూపేందుకు కొందరికి కంటి ఆపరేషన్లు...మరికొందరికి ఇతర మార్గాల ద్వారా పరిష్కారం చూపుతున్నాం. నాణ్యతతో కూడిన అద్దాలను కూడా అందిస్తాం. జనవరి 15వ తేదీలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం.త్వరలోనే రాజంపేట డివిజన్‌లో రెండవ విడత ఫిబ్రవరి 1 నుంచి ప్రజలందరికీ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం– డాక్టర్‌ రామిరెడ్డి, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ,అంధత్వ నివారణ సంస్థ జిల్లా అధికారి, కడప

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)