amp pages | Sakshi

డబ్బులిస్తూ దొరికిపోయినా చంద్రబాబుపై చర్యలుండవా?

Published on Fri, 02/17/2017 - 02:15

‘యువభేరి’లో నిలదీసిన విద్యార్థిని

గుంటూరు: ‘‘ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికిపోతే అతడిని ఆ ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేస్తారు. ఒక విద్యార్థి పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోతే అతడిని డిబార్‌ చేస్తారు. మరి సాక్షాత్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ‘ఓటుకు కోట్లు’ కేసులో సాక్ష్యాలతో సహా దొరికిపోతే ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’  వైఎస్సార్‌సీపీ గురువారం గుంటూరులో నిర్వహించిన యువభేరిలో బీటెక్‌ మూడో సంవత్సరం విద్యార్థిని శ్రీవిద్య సంధించిన ప్రశ్న ఇది.

యువభేరి కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు మైక్‌ ఇచ్చి మాట్లాడించారు. వివిధ అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు, ప్రత్యేక హోదా పోరాటం, ఓటుకు కోట్లు కేసు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో ఆంక్షలు తదితర అంశాలపై ప్రశ్నలు సంధించారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట తప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తమ భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని తేల్చిచెప్పారు. హోదా కోసం పోరాడేవారికే మద్దతిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. అందరం కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు. హోదా ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)