amp pages | Sakshi

డీలర్లు పరేషాన్‌

Published on Sat, 10/21/2017 - 08:54

అరకొర కమీషన్‌.. గోడౌన్లలో తక్కువ తూకాలతో బియ్యం సరఫరా.. బయోమెట్రిక్‌ యంత్రాల నిర్వహణ ఖర్చు.. అందని మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీలకు సరఫరా చేసే బియ్యం బిల్లులు.. దుకాణా ల్లో సౌకర్యాల లేమి.. వెరసి ముప్పావలా కోడి పిల్లకు మూడు రూపాయల పందిపిల్లను దిష్టి తీసిన చందంగా మారింది చౌకదుకాణ డీలర్ల పరిస్థితి. ఫలితంగా డీలర్లకు కష్టాలు.. నష్టాలు మిగులుతున్నాయి.

చిత్తూరుటౌన్‌: జిల్లాలోని చౌకదుకాణల డీలర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. చౌకదుకాణాలను నష్టాలతో నడుపుతూ తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. దుకాణాల్లో సౌకర్యాల లేమితో కష్టాలు తప్పడం లేదు. దీనికితోడు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో 2,970 చౌకదుకాణాలు ఉన్నాయి. వీటికి బియ్యం సరఫరా చేయడానికి 29 మండల నిల్వ కేంద్రాలున్నాయి. ఇందులో ఏ గోదాములోనూ బయోమెట్రిక్‌ వేయింగ్‌ మిషన్లు అందుబాటులో లేవు. దీంతో బస్తాకు 51 కిలోల బియ్యానికి బదులు డీలర్లకు 48 కిలోలు మాత్రమే అందజేస్తున్నారు. ఒక బస్తాకు 3 కిలోల వరకు డీలర్ల నష్టపోతున్నారు. అయితే డీలర్లు మాత్రం బయోమెట్రిక్‌ తూనికల మిషన్‌ ద్వారా రేషన్‌ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. నాలుగేళ్ల నుంచి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.

బయోమెట్రిక్‌ భారమూ డీలర్లదే
డీలర్లకు బయోమెట్రిక్‌ తూనికల యంత్రాన్ని ప్రభుత్వం అందజేసింది. అయితే దాని నిర్వహణకు సంవత్సరానికి రూ.900 ఆ కంపెనీ డీలర్ల వద్ద నుంచి వసూలు చేస్తోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఈ తూనికల యంత్రానికి మూడేళ్ల ఉచిత సర్వీసు చేయాల్సిన బాధ్యత కంపెనీకి ఉన్నా దాన్ని పాటించడం లేదు. ఈ యంత్రానికి సంబంధించిన బ్యాటరీలు కూడా డీలర్ల సొంత ఖర్చులతో మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

రూ.25 కోట్ల బకాయిలు
మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న బియ్యం బిల్లులు దాదాపు రూ.25 కోట్ల మేరుకు రావాల్సి ఉంది. ప్రభుత్వం ఆ బిల్లుల ఊసే ఎత్తడం లేదు. ఫలితంగా ఆ బకాయిలు రోజురోజుకూ పేరుకుపోతున్నాయి. ఇంతకుముందు రేషన్‌ షాపుల్లో వివిధ రకాల సరుకులను కార్డుదారులకు పంపింణీ చేసేవారు. ఇప్పుడు ఒక బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు.  దీంతో డీలర్లు ఒకటో తేదీ నుంచి 15 వరకు బియ్యం పంపిణీకే పరిమితమవుతున్నారు. ప్రజలకు అవసరమైనటువంటి వస్తువులను డీలర్లకు పంపిణీ చేసి, విలేజ్‌మాల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.   

అరకొర కమీషన్‌
చౌక దుకాణ డీలర్లు ఇంత చేసినా వారికి ఇచ్చే కమీషన్‌ అతి తక్కువగా ఉంటోంది. దీంతో డీలర్లకు చౌకదుకాణం నిర్వహణ భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే కొందరు డీలర్‌ షిప్‌ వదుకుంటున్నారు. కొందరు మాత్రం విధిలేక కొనసాగిస్తున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)