amp pages | Sakshi

పకడ్బందీగా జన్మభూమి-మాఊరు

Published on Tue, 09/30/2014 - 01:44

కర్నూలు(అగ్రికల్చర్):
 ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జన్మభూమి- మాఊరు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిద్దామని కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ అన్ని శాఖల అధికారులను కోరారు. సోమవారం ఈ కార్యక్రమంపై కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 2 నుంచి 20వరకు పంచాయతీల వారీగా చేపట్టాల్సిన అంశాలపై నివేదికలు తయారు చేయాలన్నారు. 2న జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రాంతాల్లోను ఈ కార్యక్రమంపై ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. కర్నూలులో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించే బాధ్యతను మునిసిపల్ కమిషనర్, మెప్మా డీఆర్‌డీఏ పీడీలకు అప్పగించారు. ఎంతమంది డాక్టర్లు ఉంటారు, మందులు ఏవేవి అందుబాటులో ఉంటాయనే అంశాలపై సమగ్రమైన ప్రణాళిక ఇవ్వాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. పశు సంవర్ధక శాఖ అధికారులు  పశువైద్య శిబిరాలు అన్ని గ్రామ పంచాయతీల్లో జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పింఛన్లను పరిశీలించాలని తెలిపారు. నిరుపేద కుటుంబాలు అదనపు ఆదాయాన్ని పొందే మార్గాలను సంక్షేమాధికారులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు అన్వేషించాలని సూచించారు. బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు.  ఏపీఎంఐపీ అటవీశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీస్ తదితర అన్ని శాఖలకు సంబంధించి సూక్ష్మ ప్రణాళికలు ఉండాలన్నారు.
 డీఎంహెచ్‌ఓ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలపై ఆగ్రహం
 సమావేశానికి డీఎంహెచ్‌ఓ నరసింహులుతో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు హాజరు కాలేదు. డీఎంహెచ్‌ఓ వైద్య ఆరోగ్య మంత్రి వెంట కడప వెళ్లినట్లు తెలుసుకొని డీఎంహెచ్‌ఓ పరిధి ఎంత.. వెంటనే పిలిపించండి అంటూ సిబ్బందిని ఆదేశించారు. ఇద్దరు ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు సెలవులు పెట్టారని సిబ్బంది చెప్పగా వెంటనే వెనక్కి పిలిపించాలని, రెండు గంటల్లో వారు నా దగ్గర ఉండాలని ఆదేశించారు. కాగా ప్రజావాణి వెబ్‌సైట్‌ను ప్రతిరోజు పరిశీలించుకొని ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. జేసీ కన్నబాబు, ఏజేసి అశోక్‌కుమార్, డీఆర్‌ఓ వేణుగోపాల్ రెడ్డి,(అప్పటికి బాధ్యతల నుండి రిలీవ్ కాలేదు), సీపీఓ ఆనంద్ నాయక్, జేడీఏ ఠాగూర్ నాయక్, డీఆర్‌డీఏ పీడీ నజీర్ సాహెబ్ పాల్గొన్నారు.



 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)