amp pages | Sakshi

చర్చంతా మూడు చుట్టే..

Published on Sun, 01/19/2020 - 02:43

సాక్షి, అమరావతి:  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల ఆలోచనంతా మూడు రాజధానుల మధ్యే తిరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ  చూసినా ఈ అంశమే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ చేసి తీరాల్సిందేనన్న చర్చ పట్టణాల నుంచి గ్రామసీమల వరకూ పాకింది. కొత్తగా ఏర్పాటైన గ్రామ సచివాలయాల దగ్గరా ఇదే అంశంపై జనం మాట్లాడుకుంటున్నారు. అటు ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం నుంచి ఇటు కర్ణాటక సరిహద్దులోని అనంతపురం వరకూ ఎక్కడికి వెళ్లినా ఎవరి నోట విన్నా ఇదే మాట నానుతోంది. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని, లేకపోతే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర మరింత వెనుకబడిపోయి మరోసారి విభజన వాదం పుట్టుకురాక తప్పదనే వాదన ప్రబలంగా వినిపిస్తోంది.  
- రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అభివృద్ధిపై సూచనల కోసం ఏర్పాటైన  జీఎన్‌ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ, ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు(బీసీజీ) సైతం మూడు రాజధానులు ఏర్పాటు చేయడంతోపాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని తమ నివేదికల్లో నొక్కి చెప్పాయి.  
ఆ రెండు నివేదికలపై అధ్యయనం కోసం మంత్రులు, ఉన్నతాధికారులతో ఏర్పాటైన హైవపర్‌ కమిటీ కూడా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న విషయాన్ని గుర్తించింది.  
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు తమ జిల్లాలను అభివృద్ధి చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారని హైపవర్‌ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు.  
అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందేనంటూ ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు జరుగుతున్నాయి.  
- పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఇదే డిమాండ్‌ను ముక్తకంఠంతో వినిపిస్తున్నారు.  
బీసీజీ, జీఎన్‌ రావు కమిటీల నివేదికలను అధ్యయనం చేసిన హైపవర్‌ కమిటీ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతోంది.  
- నాలుగుసార్లు సమావేశమైన హైపవర్‌ కమిటీ ఎక్కడెక్కడ ఏయే వనరులు ఉన్నాయో గుర్తించి, వాటిని వినియోగించుకోవడం ద్వారా అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి రోడ్‌ మ్యాప్‌ రూపొందించే కసరత్తు జరుగుతోందని ప్రకటించింది.  
విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ నానాటికీ తీవ్రతరమవుతోంది.  
అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ ఎజెండాగా సోమవారం రాష్ట్ర మంత్రివర్గం, అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల దృష్టంతా దీనిపైనే కేంద్రీకృతమై ఉంది.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)