amp pages | Sakshi

9 గంటల కరెంట్‌పై తొండి

Published on Tue, 09/02/2014 - 02:30

* వ్యవసాయానికి ప్రస్తుతానికి 7 గంటలకు మించి ఇవ్వలేమని అసెంబ్లీలో మంత్రి పల్లె వెల్లడి
* ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేస్తామని వాయిదా వేయడం మోసమే: పెద్దిరెడ్డి
* కనెక్షన్లు తొలగిస్తారని రైతుల్లో ఆందోళన: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

 
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నప్పటికీ ప్రస్తుతానికి 7 గంటలకు మించి ఉచిత విద్యుత్ ఇవ్వలేమని, పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్తులో 9 గంటలు ఇస్తామని తేల్చేసింది. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీడిక రాజన్న దొర, ఉప్పులేటి కల్పన, గడికోట శ్రీకాంత్‌రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నపై చర్చ జరిగింది.
 
 
 ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్లుగా వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ను ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని పెద్దిరెడ్డి నిలదీశారు. ఉచిత విద్యుత్‌పై మొదటి సంతకం అని చెప్పి ఇప్పుడు వాయిదా వేయడం రైతుల్ని మోసగించడమే అవుతుందన్నారు. సీఎం చంద్రబాబు తరఫున సమాచార, సాంకేతిక మంత్రి పల్లె రఘునాధరెడ్డి బదులిస్తూ.. ప్రస్తుతానికి 7 గంటల ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తున్నామని, దశలవారీగా 9 గంటలకు పెంచుతామని చెప్పారు. అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో ‘అందరికీ విద్యుత్’ పథకం ప్రారంభమవుతుందన్నారు.
 
 వచ్చే 5 ఏళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 22 మిలి యన్ యూనిట్ల లోటు ఉందని, సెప్టెంబర్ ఒకటి నాటికి లోటు భర్తీ చేసి జీరో స్థాయికి తీసుకువచ్చామన్నారు. ప్రస్తుతం విద్యుత్ కొరత లేదన్నారు. 2009 జూన్ 25న రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా 9 గంటల ఉచిత విద్యుత్‌ను అమలు చేయలేదని మంత్రి అనడంతో వైఎస్సార్ సీపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2003 వరకు 9 గంటల ఉచిత విద్యుత్‌ను ఇచ్చామని, 2004లో ఇవ్వలేకపోయామని మంత్రి చెప్పారు.
 
 ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్ పంపిణీ వ్యవస్థను నాశనం చేశాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఐఎస్‌ఐ గుర్తింపులేని 36 వేల పంపుసెట్లను మారుస్తామని మంత్రి చెప్పారు. పెండింగ్ కనెక్షన్ల గురించి అడిగితే మంత్రి ఏదేదో చెబుతున్నారని, ఈ కనెక్షన్లు ఒకేసారి ఇస్తారా? లేక దశలవారీగా ఇస్తారో చెప్పాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్‌కు పరిమితులు విధించి కనెక్షన్లు తొలగిస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారని, ఇది నిజమో కాదో చెప్పాలని చెవిరెడ్డి కోరారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)