amp pages | Sakshi

లంచం తీసుకోవాలంటే భయపడాలి

Published on Fri, 01/03/2020 - 04:12

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యల విషయంలో ఏసీబీ పనితీరు ఆశించిన మేర లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లంచాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని, ఎమ్మార్వో కార్యాలయాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసుల్లో ఎక్కడా అవినీతి కనిపించకూడదని, లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. అందుకోసం ఏసీబీ అధికారులు మరింత చురుగ్గా, క్రియాశీలకంగా.. అంకిత భావంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఏసీబీలో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదని, అవినీతి తిమింగలాల భరతం పట్టాలని ఏసీబీ అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఏసీబీ(అవినీతి నిరోధక విభాగం) పనితీరుపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఏ సదుపాయాలు కావాలన్నా ఇస్తాం: సీఎం
రాష్ట్రంలో అవినీతి నిరోధానికి 14400 కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. దాని ఏర్పాటు వెనుక మంచి కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాల్‌ సెంటర్‌ ఏర్పాటు వల్ల ఆశించిన ఫలితాలు కనిపించాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రజలెవరూ అవినీతి బారిన పడకూడదనే ఉద్దేశంతోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఏసీబీ0 అధికారులకు వివరించారు. సెలవులు లేకుండా పనిచేసి, మూడు నెలల్లోగా స్పష్టమైన మార్పు చూపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకోసం అవసరమైన మేర సిబ్బందిని తీసుకోవాలని, ఎలాంటి సదుపాయాలు కావాలన్న ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. మరో నెలరోజుల్లో పనితీరును మళ్లీ సమీక్షిస్తానని చెప్పారు. సమావేశంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్,  ఏసీబీ చీఫ్‌ విశ్వజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌