amp pages | Sakshi

ఆధార్ అనుసంధానంతో ఇక్కట్లు..

Published on Mon, 09/22/2014 - 02:20

విజయనగరం కంటోన్మెంట్ : గ్యాస్ కనెక్షనలకూ ఆధార్ అనుసంధానం చేస్తుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నా రు. జిల్లాలోప్రస్తుతం రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం జరుగుతు న్న విషయంతెల్సిందే. ఆధార్ అనుసంధా నం చేయడం వల్లే జిల్లా వ్యాప్తంగా 8493 రేషన్‌కార్డులను బోగస్‌గాగుర్తించిఏరివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బోగస్ గ్యాస్ కనెక్షన్లుఏరివేసేందుకు అధికారులుచర్యలు చేపడుతున్నారు. అయితే గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం చేయడం కూడా కష్టంగా మారుతోంది.
 
 ఉదాహరణకు జిల్లా కేంద్రంలోని జొన్నగుడ్డికి చెందిన నారాయణమ్మ అనే పేద మహిళకు 2008లో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ మంజూరైంది. అయితే ఆ సమయంలో సబ్సిడీ సొమ్ము కట్టలేని నారాయణమ్మ ఆ కనెక్షన్‌ను తనకు తెలిసిన నాయుడుబాబుకు అమ్మేసింది. అనంతరం నాయుడుబాబు అదే కనెక్షన్‌ను చిట్టెమ్మ అనే మరోమహిళకు అమ్మేశాడు. ప్రస్తుతం నారాయణమ్మ గ్యాస్ కనెక్షన్‌ను చిట్టెమ్మ వినియోగిస్తోంది. అయితే ఐదేళ్ల కిందట నారాయణమ్మ చనిపోయింది. ఆ మెకు ఆధార్‌కార్డు కూడాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో చిట్టెమ్మ తను వినియోగిస్తున్న గ్యాస్ కనెక్షన్‌కు నారాయణమ్మ ఆధార్‌కార్డును ఎలా అందజేయగలదు.
 
 దీంతో ఇటువంటి కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం కష్టంగా మారుతోంది. జిల్లావ్యాప్తంగా సుమారు 23 వేల మంది  వేరొకర నుంచి గ్యాస్ కనెక్షన్లుకొనుగోలుచేశారు. ఆధార్ కా ర్డు సమర్పిస్తేతప్ప గ్యాస్‌డెలివరీ చేయమ నిఏజెన్సీలు స్పష్టం చేస్తుండడంతో వారం తా ఆందోళనలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,04,353 గ్యాస్ కనెక్షన్లుండగా ఇప్పటి వరకు 2,23, 802కనెక్షన్లకు ఆధార్‌అనుసంధానం జరిగింది. మిగిలిన 80,551 గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం జరగలే దు. ఇందులో వేరొకరినుంచి కనెక్షన్లు కొనుగోలుచేసినసుమారు 23 వేలమంది బోగస్ లబ్ధిదారులుగా మిగిలిపోనున్నారు. ఆధార్ అనుసంధానం వల్ల అసలైన లబ్ధిదారులు ఇబ్బంది పడకపోయినా బోగస్ లబ్ధిదారులకు మాత్రం ఇక్కట్లు తప్పేలా లేదు.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)